JAV Jagananna Ammavodi Laptops for 9-12th Class Guidelines Willing Letter

JAV Jagananna Ammavodi Laptops for 9-12th Class - Guidelines - Acceptance Letter. AP CM has given an opportunity to the Students studying 9-12th Class - if they are willing, then AP Govt will provide Jagananna Laptops in Jagananna Ammavodi Scheme from 2021 Onwards. For that they have to give willingness Letter that they want JAV LAPTOPS. Details are given below. Specifications of Jagananna Ammavodi Laptops - Details configuration of Laptop given in JAV SCHEME, Rate of the Laptop Details. 

JAV Jagananna Ammavodi Laptops for 9-12th Class - Guidelines - Willingness Letter

పాఠశాల విద్యా శాఖ - "నవరత్నాలు” - జగనన్న అమ్మఒడి పథకం - 9 -12 తరగతుల విద్యార్ధులకు అమ్మఒడి పథకం ద్వారా నగదు బదులు లాప్ టాప్ లు అందించుట గూర్చి-ఇందు మూలముగా తగు సూచనలు జారీ చేయటం-గురించి
JAV Jagananna Ammavodi Laptops for 9-12th Class - Guidelines - Willingness Letter
రేఖా సంఖ్య :ఇ.ఎస్.ఇ02-28021/27/2020-ప్లానింగ్ తేది : 31-3-2021
విషయం : పాఠశాల విద్యా శాఖ - "నవరత్నాలు” - జగనన్న అమ్మఒడి పథకం - 9 -12 తరగతుల విద్యార్ధులకు అమ్మఒడి పథకం ద్వారా నగదు బదులు లాప్ టాప్ లు అందించుట గూర్చి-ఇందు మూలముగా తగు సూచనలు జారీ చేయటం-గురించి.,

సూచిక: 
1) ఈ కార్యా లయ ప్రొసీడింగ్స్ ESE02-28021/27/2020-PLG-CSE, తేదీ : 09.12.2020 2) ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య. 63 పాఠశాల విద్యా శాఖ (ప్రోగ్రాం: 
2) తేదీ: 28-12-2020 3) ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య. 79, పాఠశాల విద్యా శాఖ (ప్రోగ్రాం: 2) తేదీ:. 4.11.2019

ఆదేశములు:
  • రాష్ట్రములోని అందరు జిల్లా విద్యాశాఖాధికారులు మరియు ప్రాంతీయ విద్యా శాఖాధికారులకు తెలియ చేయునది ఏమనగా, పైన సూచించిన సూచికలు 2 మరియు 3 ల నందు "నవరత్నాలు” లో భాగంగా “జగనన్న అమ్మ ఒడి' పథకం కింద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2019-20 మరియు 2020-21 సంవత్సరాలకు గాను అర్హులైన 1 వ తరగతి నుండి 12 వ తరగతి (ఇంటర్ మీడియట్ ) చదువుచున్న విద్యార్థుల తల్లికి లేదా గుర్తించబడిన సంరక్షకుల వారికి సంవత్సరానికి రూ.15,000 / - ఆర్థిక సహాయం అందిస్తున్నది. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న అందరికి నాణ్యమైన విద్యకు గాను భరోసా ఇవ్వడంతో పాటు విద్యార్థుల హాజరుని నిరంతరం పరిశీలిస్తూ వారు మెరుగైన అభ్యాసన ఫలితాలను సాధించడం కోసం 1 నుండి 12 (ఇంటర్మీడియట్ విద్య) తరగతుల వరకు పిల్లల సర్వతోముఖ అభివృద్ధికి గాను అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు పరుస్తూ ఉన్నది. 
  • 2. కాగా, రానున్న విద్యాసంవత్సరం నుండి, అనగా, 2021-22 సంవత్సరం నుండి, అమ్మఒడి పథకం ద్వారా అర్హులైన 9 -12 తరగతుల విద్యార్థుల తల్లులకు వారి విద్యార్థుల విద్యావికాసం కోసం ఎవరైనా తల్లులు నగదు బదులు లాప్ టాప్ లు కోరుకున్నట్లయితే వారికి లాప్ టాపులు అందించడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్హులైన తల్లులందరికీ తెలియపరిచి, వారు అమ్మ ఒడి కింద సహాయం నగదు రూపేణా కోరుకుంటున్నారా లేక లాప్ టాప్ ల రూపేణా కోరుకుంటున్నారా తెలుసుకోవటం కోసం గౌరవనీయ ముఖ్యమంత్రిగారు తల్లుల్ని ఉద్దేశించి ఒక లేఖ రాసారు. ఆ లేఖ ప్రతిని దీనివెంట జతపరుస్తున్నాం. 
  • 3. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి ఉత్తరమును అమ్మఒడి పథకం కింద అర్హులైన 9-12 విద్యార్థుల తల్లులందరికీ అందిస్తూ, వారి అభీష్టం తెలుసుకుని తిరిగి ప్రభుత్వానికి తెలియపరచటం కోసం అందరు జిల్లా విద్యాశాఖాదికారులు మరియు ప్రాంతీయ విద్యా శాఖాది కారులకు ఈ క్రింది సూచనలు ఇవ్వడమైనది.
  • అ) ఈ ఉత్తర్వులకు పి. డి. ఎఫ్ . రూపములో జతపరిచిన సదరు లేఖను డి.సి. యి . బి. ల ద్వారా 10-4-2021 లోపుగా ముద్రించాలి.
  • ఆ) ఆ విధంగా ముద్రించిన లేఖను మండల విద్యా శాఖాదికారుల ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు కళాశాలల ప్రిన్సిపాళ్ళకు విద్యార్ధుల సంఖ్య ను అనుసరించి 154-2021 లోపుగా అందించాలి. 
  • ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాద్యాయులు మరియు కళాశాలల ప్రధా నాచార్యులు అందరు కూడా తమ విద్యాసంస్థల్లో 9 నుండి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో 19-4-2021 న సమావేశం ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి లేఖలోని అంశాలను విద్యార్ధులకు చక్కగా విశదీకరించాలి. విద్యార్ధులు ఆ లేఖను ఇంటికి తీసుకునివెళ్ళి తమ తల్లులకు లేదా సంరక్షకులకు చూపించి వారి అభీష్టాన్ని తెలుసుకుని ఆ లేఖపైన రాయించి తిరిగి ఆ లేఖను 22-4-2021 నాటికి ప్రధానోపాధ్యాయులకు అందచెయ్యాలి. 
  • ఆ విధంగా విద్యార్థులు తమకు తిరిగి ఇచ్చిన అంగీకార పత్రములోని అంశాలను ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాద్యాయులు మరియు కళాశాలల ప్రధా నాచార్యులు స్వీయ పర్యవేక్షణలో అమ్మ ఒడి వెబ్ సైటు నందు 26-4-2021 లోపుగా పొందుపరచాలి. ఆ విధంగా పొందుపరిచిన తర్వాత, ఆ అంగీకారపత్రాలను పాఠశాల, కళాశాల రికార్డులో భద్రపరచాలి. 
5. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని నిర్దేశించిన సమయములో పూర్తిచేయడానికి వీలుగా జిల్లా విద్యాశాఖాధికారులు మరియు ప్రాంతీయ విద్యా శాఖాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ క్రింది స్థాయి సిబ్బందికి తగుసూచనలు అందిస్తూ జయప్రదంగా పూర్తిచెయ్యాలి.

Configuration/Specifications of Jagananna Amma Vodi Laptop - CM Letter