Clarification on Election Duty for Today

పోలింగ్ ప్రక్రియ వాయిదా వేసినట్టు గా ఇప్పటి వరకు SEC నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదు
ప్రభుత్వం వేసిన పిటిషన్ పై 8 గంటల తరువాత విచారణ, తదుపరి తీర్పు వచ్చే అవకాశం ఉంది.
ఆ తీర్పు తరువాత SEC ఎన్నికల నిర్వహణ పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కావున
ఎన్నికల కమిషన్ మనకి ఎన్నికల విధులకు కేటాయించింది. ఎన్నికల కమిషన్ నుండి తిరిగి ఆదేశాలు వచ్చే వరకూ ఎన్నికల విధులకు కేటాయించబడినవారు అందరూ ఎన్నికల విధుల్లో ఉండాల్సిందే.

పోలింగ్ కేంద్రాలుగా కేటాయించిన పాఠశాలలు కూడా అంత వరకు పోలింగ్ కేంద్రాలుగానే ఉంటాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అవి ఎన్నికల కేంద్రాలు గానే ఉంటాయి. వాటిని నిన్ననే హ్యాండోవర్ చేయడం జరిగింది.  ఎన్నికలు వాయిదా అని SEC నుండి ఆదేశాలు వచ్చే వరకు అవి కూడా ఎన్నికల ప్రక్రియ లో భాగమే. 

ఎన్నికల కమిషన్ ఎన్నికలు వాయిదా వేసినట్టు ఆదేశాలు ఇచ్చే వరకు మనం ఎన్నికల కమిషన్ పరిధిలోనే విధులు నిర్వహించవలసి ఉంటుంది. APTELS లో OTP వస్తే నేటికి ఎన్నికల విధుల కొరకు OD అప్లై చేయండి.