CCE New Grading Table | CCE Marks - Grading Table 2021-2022 for APTEACHERS - CCE Smart Grading Table

CCE New Grading System - CCE Marks - Grades from 2021 - Formative - Summative Assessment Tools. CCE New Grading Table | CCE Marks - Grading Table from 2021 for AP TEACHERS. CCE Grading Table for Teachers New CCE Grades from 2021. New Grading Table for Formative Assessment and Summative Assessment is introduced from 2021. All Classes will have the same Grading Table. Simple CCE Grading table which most helpful to teachers in awarding grades to students. Let us See the CCE Smart Grading Table below.

CCE New Grading Table | CCE Marks - Grade Poinsts Table from 2021 for TEACHERS

CCE New Grading System - CCE Marks - Grades from 2021 - Formative - Summative Competencies.

CCE:  నిరంతర సమగ్ర మూల్యాంకనం
నిరంతరం అంటే పిల్లల ప్రగతిని ఒక సంఘటనకో, సందర్భానికో ఎప్పుడో ఒక మూడు గంటల పరీక్షకు పరిమితం చేయకుండా ఎల్లప్పుడు పరిశీలించడం. అనగా నిరంతరం పాఠశాల లోపల, వెలుపల పిల్లల శారీరక మానసిక వికాసాలను తరచుగా క్రమపద్ధతిలో పరిశీలిస్తున్నామని  తెలియకుండానే పరిశీలించాలి. అభ్యసన లోపాలు గుర్తించి సవరణాత్మక చర్యలు చేపట్టడం ద్వారా  ఉపాధ్యాయులూ, విద్యార్థి ఇద్దరూ కూడా ఎప్పటికప్పుడు స్వీయమూల్యాంకనం చేసుకోగలగాలి.
నిరంతర సమగ్ర మూల్యాంకనంలో రెండు రకాల మూల్యాంకనాలు ఉన్నాయి అవి :
  • 1. నిర్మాణాత్మక మూల్యాంకనం (Formative Assessment F.A)
  • 2. సంగ్రహణాత్మక మూల్యాంకనం. (Summative Assessment SA)

నిర్మాణాత్మక మూల్యాంకనం Formative Assessment

 తరగతి గదిలో కల్పించిన అభ్యసనప్రక్రియలలో పిల్లలు పాల్గొంటున్నప్పుడు. వారు ఏ విధంగా నేర్చుకుంటున్నారో పరిశీలించి నమోదు చేయడం ద్వారా పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి కృషి చేయడాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. ఇది భయరహిత వాతావరణంలో, పిల్లలకు ఆసరాగా నిలిచి అభ్యసనాన్ని వేగవంతం చేసుకోవడానికి ఉపకరించేది.

పిల్లల ప్రగతిని నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన సందర్భాలలో పిల్లలకు సహకారిగా నిలిచేది. తరగతిగదిలో జరిగే చర్చలు, పిల్లల సమాధానాలు పాఠం మధ్యలో మరియు చివర ఉన్న ప్రశ్నలు. అభ్యాసాలు గురించి చర్చిస్తున్నప్పుడు పిల్లలు చర్చల్లో పాల్గొని ఇచ్చే సమాధానాలు, పిల్లలు రాసిన నోటు పుస్తకాలు, తరగతిపని, ఇంటిపని, ప్రాజెక్టు పనులు, జట్టు పనులు మొదలైన వాటి ఆధారంగా పిల్లలు ఏమి నేర్చుకున్నారో, ఎలా నేర్చుకున్నారనేది ఉపాధ్యాయుడు అంచనా వేయవచ్చు.
ఇందుకోసం మనం నాలుగు సాధనాలు వినియోగిస్తున్నాం.  
అవి పిల్లల
  • (1) ప్రతిస్పందనలు,
  • (2) భాగస్వామ్యం,
  • (3) ప్రాజెక్టు పనులు పిల్లలు రాసిన అంశాలు,
  • (4) లఘు పరీక్షలు.
6 నుండి 10వ తరగతి వరకు ఒకే రకమైన మూల్యాంకనా సాధనాలను, గ్రేడింగ్ విధానం అమలు చేస్తున్నారు. ప్రతీ నిర్మాణాత్మక మూల్యాంకనంలో నాలుగు సాధనాలు నిర్వహిస్తారు. నిర్వహణ విధానం, మార్కుల కేటాయింపు గురించి తెలుసుకుందాం.

పిల్లల భాగస్వామ్యం - ప్రతిస్పందనలు (10 మార్కులు)
ఈ అంశంలో, తెలుగు, హిందీ, ఇంగ్లీషులకు పిల్లలు గ్రంథాలయ పుస్తకాలు చదివి, సమీక్ష రాస్తారు. గణితంలో సాధించిన భావనలకు సొంతంగా సమస్యలు తయారు చేస్తారు. సైన్సులో ప్రయోగాలు చేసి నివేదిక రాస్తారు. సాంఘిక శాస్త్రంలో సమకాలీన అంశాల గురించి తమ ప్రతిస్పందన రాస్తారు.

పిల్లలు రాసిన అంశాలు (10 మార్కులు)
ఆయా సబ్జెక్టులకు సంబంధించిన రాత పనుల్ని ఈ అంశంలో భాగంగా పరిశీలిస్తాం. ఈ అంశాలు సొంతంగా ఆలోచించి రాసినవై ఉండాలి.

ప్రాజెక్టు పనులు (10 మార్కులు)

అనుభవ పూర్వకమైన అభ్యసనానికి అవకాశం కల్పించేవి ప్రాజెక్టు పనులు. పిల్లలు ప్రాజెక్టు పనులలో పాల్గొన్న విధానం, రూపొందించిన నివేదికల ఆధారంగా మూల్యాంకనం చేస్తారు.

లఘు పరీక్ష (20 మార్కులు)
పిల్లల సామర్ధ్య సాధనను చిన్నపాటి పరీక్ష రూపంలో పరిశీలిస్తాం. ఉపాధ్యాయుడు తాను చెప్పిన పాఠ్యాంశాల్లో నుండి ఎంపిక చేసుకున్న విద్యాప్రమాణాల్ని దీని ద్వారా పరిశీలిస్తారు. ఈ లఘు పరీక్షను ముందస్తు సమాచారం ఇవ్వకుండానే నిర్వహించాలి.

మొత్తం 50 మార్కులకు ఒక నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని నిర్వహిస్తాం. వీటి నాలుగు సాధనాల అంశాలను 5 మార్కుల చొప్పున కుదించి, 20 మార్కులను సంగ్రహణాత్మక మూల్యాంకనంలో కలుపుతాం.

సంగ్రహణాత్మక మూల్యాంకనం (SA) Summative Assessment

    విద్యార్థి బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా నేర్చుకున్న అంశాలను మొత్తంగా మూల్యాంకనం చేయడాన్ని సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు. ఇవి కోర్సు మొత్తం పూర్తి అయిన తర్వాత లేదా నిర్ధారిత పాఠ్యప్రణాళిక పూర్తయిన తరువాత పిల్లల సాధనను పరీక్షించే పద్ధతి. ఏం నేర్చుకున్నాడు? ఎంతవరకు నేర్చుకున్నాడు? అనే అంశాలను పరిశీలించడం జరుగుతుంది. సాధారణంగా రాత (పేపర్ - పెన్సిల్) పరీక్షల రూపంలో మాత్రమే నిర్వహించే మూల్యాంకనంలో పాఠ్య విషయాలను, విద్యాప్రమాణాల ఆధారంగా పరీక్షించడం జరుగుతుంది.

ఇది తరగతిలో నిర్ధారిత సిలబస్ పూర్తయిన తరువాత, ప్రతీ సబ్జెక్టు 80 మార్కులకు నిర్వహించే మూల్యాంకనం. ఆయా సబ్జెక్టుల వారీగా నిర్ణీత సామర్థ్యాలు  విద్యాప్రమాణాల భారత్వంపై ఆధారపడి తయారు చేయబడిన ప్రశ్నాపత్రంతో నిర్వహిస్తారు. 20 మార్కులకు SA పరీక్షకు ముందు నిర్వహించిన FAల సరాసరిని గణనలోకి తీసుకొని మొత్తం 100 మార్కులకు గ్రేడింగ్ ఇస్తారు.

ఇది విద్యాప్రమాణాలు విషయాల వారీ భారత్వ పట్టికల ఆధారంగా తయారు చేయబడిన పరీక్ష పత్రంతో పరిశీలించే పద్ధతి. మౌఖిక పరీక్షకు సంబంధించిన విద్యాప్రమాణాలకు కేటాయించిన మార్కులు టీచర్ తమ పరిశీలన ఆధారంగా లేదా అంతకు ముందు నమోదు చేసిన FA ఆధారంగా కేటాయించి పిల్లల ప్రగతి నమోదు చేస్తారు.

సహ పాఠ్యాంశాల మూల్యాంకనం 

నిరంతర సమగ్ర మూల్యాంకనంలో పాఠ్యాంశాలతో పాటు సహ పాఠ్యాంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. 
అవి (1) కళా సాంస్కృతిక విద్య (2) వ్యాయామ ఆరోగ్య విద్య (3) విలువల విద్య, జీవన నైపుణ్యాలు -పని (4) కంప్యూటర్ విద్య - పని.
  • సహపాఠ్యాంశాలను కేవలం సంగ్రహణాత్మక మూల్యాంకనంలో సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే చేస్తారు. వీటికి నిర్ధారిత రాత పరీక్ష ఉండదు. టీచర్ పరిశీలన ఆధారంగా గ్రేడ్లు ఇస్తారు
  • సహ పాఠ్యాంశాలలో విద్యాప్రమాణాల వారీగా పిల్లల ప్రగతి పరిశీలించి మార్పులు కేటాయించాలి.
  • గ్రేడులతో పాటు వివరణాత్మక సూచికలు కూడా రాయాలి.
  • సహ పాఠ్యాంశాలు నాలుగు, ఒక్కొక్క సహ పాఠ్యాంశానికి 50 మార్కులు ఉంటాయి. మొత్తం మీద 200 మార్కులు ఉంటాయి. ప్రతీ సహపాఠ్యాంశానికి అయిదు సామర్థ్యాలు ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క దానికి 10 మార్కులు. వీటితో పాటు వివరణాత్మక సూచికలు రాయాలి.

CCE Smart Grading Table from 2021-22 Academic Year

CCE New Grading Table has been adopted. Basing on the marks obtained by the students in the Exams, Grades ranging from A1 to E in the following descending order A1,A2,B1,B2,C1,C2,D1,D2,E are assigned to students. Let us see the Detailed Smart Grading Table, which is useful for Teachers in grading the Students. The Grading Table comprises of Marks, Grade and Grade Point.

100 Marks
www.apteachers.in
50 Marks
Marks Grade Point Grade Marks Grade Point Grade
91-100 10 A1 46-50 10 A1
81-90 9 A2 41-45 9 A2
71-80 8 B1 36-40 8 B1
61-70 7 B2 31-35 7 B2
51-60 6 C1 26-30 6 C1
41-50 5 C2 21-25 5 C2
35-40 4 D 18-20 4 D
0-34 3 E 0-17 3 E
20 Marks 10 Marks
Marks Grade Point Grade Marks Grade Point Grade
19-20 10 A1 9-10 10 A1
17-18 9 A2 8-9 9 A2
15-16 8 B1 7-8 8 B1
13-14 7 B2 6-7 7 B2
11-12 6 C1 5-6 6 C1
9-10 5 C2 4-5 5 C2
6-8 4 D 3-4 4 D
0-6 3 E 0-3 3 E