Ganita Mithra Module Ganita Mithra Hand Book Download

Ganita Mithra Module Ganita Mithra Hand Book Download. Read the Message of CSE on Ganitha Mitra

Ganita Mithra Module Ganita Mithra Hand Book Download

చిట్టిపొట్టి చిన్నారులకుగణితాన్ని బోధిస్తున్న మీ కోసం మీ బోధనను సులభతరం చేయడానికి ఒక చిరు ప్రయత్నంగా విద్యాశాఖ ఎంపిక చేయబడిన పాఠశాలలకు గణిత బోధనోపకరణాలను సరఫరా చేయుటకు నిర్ణయించడమైనది. లెకించుకోవడం జీవితంలో ఒక భాగం. వస్తు వినియోగం, సమయపాలనలోని ఖచ్చితత్వం, ఆహారం సమకూర్చుకోవడం, ఆహారాన్ని స్వీకరించడం, దుస్తుల ఎంపిక, ఇంటి నిర్మాణం ఇలా ప్రతీ విషయంలోనూ మనకు తెలియకుండానే ప్రతి ఒక్కరు గణితంను ఉపయోగిస్తున్నారు.
ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త చెప్పినట్లు “ Mathematics is the king of all sciences and the queen of all fine arts" అన్న ఆంగ్లసూక్తి అక్షరసత్యం. ప్రతీ విజ్ఞానశాస్త్రం, కళాత్మక అంశాల యొక్క అంత: సూత్రం. గణితమే కదా! గణిత భావనల అభ్యాసం ప్రతి మనిషికి అత్యవసరం అని మనం గుర్తించగలిగాం. ప్రాథమిక సంఖ్యాభావనలు, చతుర్విధ ప్రక్రియల మొదలు అనేక గణిత సిద్ధాంతాలు నిరూపణ వరకు విద్యార్థి తన సుదీర్ఘ గణిత ప్రయాణాన్ని, కొనసాగిస్తాడు. ప్రతి విద్యార్థిగణితాన్ని అభ్యాసం చేసే స్థాయి నుండి అధ్యయనం చేసే ఉన్నత స్థాయికి చేరుకోవాలి. అందుకు అనుగుణమైన బోధన ప్రక్రియలు మనం చేపట్టాలి.
ప్రాథమిక స్థాయిలో గణితాన్ని పరిచయం చేయడం, బలపరచడం చాలా క్లిష్టమైన అంశం. కానీ ప్రకృతి ఇల్లు, పరిసరాలలోని వస్తువుల ఆధారంగా లెక్కించడం, గుణించడం, చతుర్విధ ప్రక్రియల పట్ల అవగాహన కల్గించడం మన ఉపాధ్యాయులు తరగతి గదులలో చేసే కృత్యాలు.
అయితే గణిత అమూర్త భావనలను మూర్త భావనలుగా మార్చే సందర్భంలో గణిత బోధనాభ్యసన ఉపకరణాలు ఉపాధ్యాయులకు ఎంతగానో దోహదపడతాయి. బోధనలో బోధనోపకరణాలను ఉపయోగించి కృత్యాధార బోధన గావించిన ఉపాధ్యాయులు మెరుగైన ఫలితాలను సాధించడం నేను ప్రత్యక్షంగా గమనించినాను.
రాష్ట్రంలో ఎంపిక చేసిన పాఠశాలలలో ఒక గొప్ప గణిత వాతావరణాన్ని సృష్టించడానికి, బోధనలో గణిత భావనలను మరింత మెరుగుగా పిల్లలకు పరిచయం చేయడానికి వీలుగా “అక్షర ఫౌండేషన్" వారు రూపొందించిన 'గణితకిట్'లు ఎంతో ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. వాటిని వినియోగించడానికి వీలైన మార్గదర్శకత్వం ఈ కరదీపిక అందిస్తుందని ఆశిస్తున్నాను.
ఉపాధ్యాయులు తరగతి గదిలో నాణ్యమైన బోధనాభ్యసన ప్రక్రియలను కొనసాగించేందుకు వీలుగా వారికి అన్నిరకాల ప్రోత్సహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. మెరుగైన ఫలితాలు సాధించడమే ఉపాధ్యాయుల విధి. మన నిర్దేశిత లక్ష్యాలు త్వరలోనే సాకారం కావాలని కోరుకుంటూ...
K.సంధ్యారాణి I.PO.S కమీషనర్, పాఠశాల విద్యాశాఖ,
అమరావతి, ఆంధ్రప్రదేశ్