White Paper on School Education Andhra Pradesh 2018

White Paper on School Education Andhra Pradesh 2018. ఆంధ్రప్రదేశ్ లో మానవ వనరులు మరియు సామాజికాభివృద్ధిపై శ్వేత పత్రం ఆంధ్రప్రదేశ్ సచివాలయం -522503 28, డిసెంబర్, 2018.

White Paper on School Education Andhra Pradesh 2018


  • ఆధునికత అభివృద్ధి నేపధ్యంలో మానవ పెట్టుబడి ఆర్థికాభివృద్ధికి మూలాధారంగా రూపొందింది. అందువల్ల, దేశ సామాజిక & విజ్ఞాన రాజధానిగా రూపొందాలని మరియు విజ్ఞాన ఆర్ధిక వ్యవస్థలోకి ప్రవేశించాలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రంలో సమర్థ, పటిష్ట మరియు ఆరోగ్యకర సామాజిక రంగం ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
  • రాష్ట్రంలో విద్య, ఆరోగ్య, సాంఘిక సంక్షేమ రంగాలలో క్రమబద్ధమైన పరివర్తన కోసం ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన కష్టతర ప్రయత్నాలను వెల్లడించడం ఈ శ్వేత పత్రం ఉద్దేశం.
  • మానవ అభివృద్ధి విధానం ప్రజలను అభివృద్ధి అజెండా కేంద్ర స్థానంలో ఉంచింది. అంతటితో ముగించకుండా ఆర్థికాభివృద్ధి మరియు సంపదను అభివృద్ధికి మార్గాలుగా పరిగణించింది. ప్రధానంగా, ఆదాయాన్ని పెంచడం మాత్రమే కాకుండా ఎవరేని వ్యక్తి కలిగివుండదగు మరియు చేయదగు అంశాలు అంటే ఆరోగ్యంగా ఉండడం & బాగా ఎదగడం, విజ్ఞానాన్ని కలిగి వుండడం వ్యాయమశీలురుగా ఉండడం మరియు సామాజిక జీవనంలో చురుగ్గా పాల్గొనడానికి కూడా విస్తరింప చేయడం ద్వారా మానవ జీవితాలను మెరుగుపరచడం అభివృద్ధి లక్ష్యంగా ఉంది.
  • 25 సంవత్సరాల వయస్సు గల 50 శాతం రాష్ట్ర జనాభాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (2011 జనాభా లెక్కల ప్రకారం) లో ప్రస్తుత జనాభా వివరాలు రాష్ట్రంలో మానవ మరియు సామాజిక అభివృద్ధి పురోగతికి భారీ అవకాశాలను కల్పించడమే కాకుండా బాధ్యతను ఉంచుతున్నాయి.
  • అందువల్ల, సామాజిక సాధికారత మరియు నాలెడ్జ్ మిషన్ క్రింద, రాష్ట్రంలో ఆరోగ్య & సాంఘిక సంక్షేమాన్ని అభివృద్ధి చేసేందుకు, క్రీడల సదుపాయాలు మెరుగుపరిచేందుకు, నాణ్యమైన విద్యను అందించేందుకు మరియు నైపుణ్య అభివృద్ధి అవకాశాలను కల్పించేందుకు అవసరమైన వనరులను పెట్టుబడిగా పెట్టే బాధ్యతను ప్రస్తుత ప్రభుత్వం చేపట్టింది.
  • రాష్ట్రంలో సమర్థ మరియు ఆరోగ్యకర మానవ వనరులు & సామాజిక అభివృద్ధి రంగం కోసం దిగువ అంశాలు అవసరమవుతాయి :
  • సమ్మిళిత, నాణ్యమైన, భరించదగిన విద్య :- విద్య (పాఠశాల & ఉన్నత) అన్ని విధాలా ప్రాధమిక అభివృద్ధి అంశాలలో ఒకటి. సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధన కోసం విద్యా రంగంలో గణనీయమైన పెట్టుబడి తప్పనిసరి. రాష్ట్రంలో నైపుణ్యంగల మానవ మూలధవం ఉండడం :- అభివృద్ధి చెందుతున్న దేశాలలో అధిక నైపుణ్యం గల సిబ్బంది అవసరాన్ని పట్టణీకరణ విజ్ఞానం మరియు పోటీని తీవ్రతరం చేశాయి. అధిక వేగం నిమిత్తం వృద్ధిరేటును పెంచడానికి ఇవి వారికి వీలుకల్పిస్తున్నాయి. అందువల్ల, రాష్ట్రంలో సుస్థిర, ఆర్థిక మరియు మానవాభివృద్ధిని సాధించేందుకు వీలుగా రాష్ట్రంలో నైపుణ్యంగల మానవ మూలధనాన్ని పెంచడానికి గట్టి ప్రయత్నాలను చేపట్టడమయింది.