Jagananna AMMAVODI Latest Instructions 2nd Dec 2019 Rc 242

Jagananna AMMAVODI Latest Instructions 2nd Dec 2019. Rc 242/A&I/2019 Dated 2.12.2019. Ammavodi After Data Entry, Latest Instructions on further action Plan as on 2nd Dec 2019 is given below.
>

Jagananna AMMAVODI Latest Instructions 2nd Dec 2019

ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019 తేది :02.12.2019
  • విషయం : పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ. 15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20 విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు. 
నిర్దేశములు : 
  • 1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-II) వారి ఉత్తర్వులు నెం. 79,
  • తేది : 4.11.2019 
  • 2. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/- a w/2019, తేది: 16.11.2019 
  • 3. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 22.11.2019

ఆదేశములు
  1. 'జగనన్న అమ్మఒడి' కార్యక్రమం అమలులో బాగంగా అర్హులైన తల్లుల సంరక్షకుల జాబితాను సిద్ధం చేసేందుకు పై సూచిక 2,3లలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది...
  2. పై సూచిక 1లోని ఆదేశాలను అనుసరించి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 17.11.2019 నుండి 21.11.2019 మధ్య కాలంలో తమ తమ పాఠశాలలోని విద్యార్థుల వివరములను చైల్డ్ ఇన్ఫోనందు నమోదు! నవీకరణ చేయడమైనది. ఆ విధంగా చర్డ్ ఇన్ఫోలోని విద్యార్థుల వివరములు 21.11.2019న ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారికి అందించడమైనది.
  3. పై సూచిక 20న ఆదేశాలను అనుసరించి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 24.11.2019 నుండి 29.11.2019 మధ్య కాలంలో తమ తమ లాగిన్ ద్వారా ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు అందించిన విద్యార్థి వారి సమాచారం నందు తల్లుల/ సంరక్షకుల వివరములను సాధ్యమైనంతవరకూ పొందుపరచి సదరు సమాచారాన్ని తల్లుల సంరక్షకుల వివరములు ఏ మండలంనందైతే క్షేత్రస్థాయి పరిశీలన చేయబడతాయో ఆ సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారికి పంపబడ్డాయి. మండల స్థాయి అధికారులతో సమన్వయ సమావేశం, గ్రామాల/ వార్డుల వారీగా జాబితాలను ముద్రించి సంబంధిత గ్రామ సచివాలయ/ వార్డు సచివాలయ విద్యా సంక్షేమ సహాయకునికి అందచేయడం. 
  • 1. మండల విద్యాశాఖాధికారి తమ మండల అభివృద్ధి అధికారి, తహసీల్దార్ మరియు తమ మండల పరిధిలోని గ్రామ/ వార్డు సంక్షేమ, విద్యా సహాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించి 'జగనన్న అమ్మఒడి' కార్యక్రమంలో భాగంగా అర్హులైన తల్లుల/ సంరక్షకుల జాబితాలను సిద్ధం చేసేందుకు తమ తమ సహాయ సహకారాలను అర్థించాలి. మండల విద్యాశాఖాధికారి వారికి రాష్ట్రంలోని వివిధ పాఠశాలల నుంచి ఆ మండలంలోని గ్రామాలకు సంబంధించిన విద్యార్థుల, తల్లి/ సంరక్షకుల వివరములు చేరుతాయి. మండల విద్యాశాఖాధికారి తమకు చేరిన సమాచారాన్ని
  • ఎప్పటికప్పుడు వారి సిబ్బంది ద్వారా గ్రామాల వార్డులు వారీగా
  • (ప్రొఫార్మా-1 : తెల్ల రేషను కార్డు వివరాలు కలిగిన తల్లుల మరియు సంరక్షకుల వివరాలతో కూడుకున్న విద్యార్థుల జాబితా. ప్రొఫార్మా-2 : తెల్ల రేషను కార్డు వివరాలు లేని తల్లుల మరియు సంరక్షకుల వివరాలతో కూడుకున్న విద్యార్థుల జాబితా.) జాబితాలను ముద్రించి సంబంధిత
  • గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకునికి అందజేయాలి. ప్రొఫార్మా -1: (అ) సామాజిక తనిఖీ కొరకు ప్రదర్శింపజేయుట 
  • 2. గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకుడు, మండల విద్యాశాఖాధికారి ద్వారా తనకందిన ప్రొఫార్మా-1 ( తెల్ల రేషను కార్డు వివరాలు కలిగిన తల్లుల మరియు సంరక్షకుల వివరాలతో కూడుకున్న విద్యార్థుల జాబితా)లో ఉన్న సమాచారాన్ని గ్రామ/ వార్డు సచివాలయాల వారీగా జాబితాలను సామాజిక తనిఖీ కొరకై గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర 07.12.2019 లోపు ప్రదర్శింపజేయవలెను. (ఆ) అభ్యంతరాల స్వీకరణ మరియు తుది జాబితా తయారు 
  • 3. ఈ విధంగా గ్రామ/ వార్డు సచివాలయంలో ప్రదర్శించిన ప్రొఫార్మా-1లో ఉన్న అర్హుల ముసాయిదా జాబితా పై ఫిర్యాదులు, అభ్యంతరాలను 14.12.2019 లోగా సేకరించి ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తూ అర్హత గలిగిన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ముసాయిదా జాబితాను అప్డేట్ చేస్తూ ఉండాలి. (ఇ) గ్రామ సభ ఆమోదం 
  • 4. ఈ విధంగా అప్ డేట్ చేసిన ముసాయిదా జాబితాను ..12.2019 నుండి 18.12.2019 మధ్య కాలంలో గ్రామ సభ ఆమోదానికై ప్రవేశపెట్టి సంబంధిత గ్రామసభ ఆమోదాన్ని పొందాలి. ప్రొఫార్మా -2 (అ) క్షేత్రస్థాయి పరిశీలన 
  • 5. గ్రామ సచివాలయ విద్యా, సంక్షణ సహాయకుడు, మండల విద్యాశాఖాధికారి ద్వారా తనకందిన ప్రొఫార్మా-2 (తెల్ల రేషను కార్డు వివరాలు లేని అలల మరియు సంరక్షకుల వివరాలతో కూడుకున్న విద్యార్థుల జాబితా.) జాబితాలను సంబంధిత గ్రామ, వార్డు వాలంటీర్లకు అందచేయాలి. ఈ సమాచారాన్ని గ్రామ/ వార్డు వాలంటీర్లు వారి పరిధిలోని ఆయా కుటుంబాలకు వివరించి తద్వారా ఆ సమాచారంలో లేని వివరాలు అనగా తల్లుల పేర్లు, తెల్ల రేషను కార్డు వివరాలు, ఆధార్ నెంబరు, బాంకు అకౌంటు నెంబరు, ఐఎఫ్ఎస్ సీ కోడు నెంబరు మొదలైన వివరాలను సేకరించాలి. ఆ సమాచారంలో తెల్ల రేషను కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద | అర్హత కలిగిన కుటుంబాలకు చెందిన వారు అవునో కాదో 'జగనన్న విద్యా దీవెన' పథకంలో ఉన్న ఆరు అంచెల పరిశీలన (సిక్స్ స్టెప్ వాలిడేషన్) ద్వారా ధృవీకరించుకోవాలి. ఈ కార్యక్రమమంతా 08.12.2019 లోపు పూర్తి చేయాలి. 
  • 6. ఆ విధంగా గ్రామ/ వార్డు వాలంటీర్లు క్షేత్రస్థాయిలో ప్రొఫార్మా-2లో నమోదు చేసి ధృవీకరించిన సమాచారం ఉన్న 'హార్డ్ కాపీ'లను సంబంధిత విద్యా, సంక్షేమ సహాయకుడికి అందజేయవలెను. అతను ఆ సమాచారాన్ని తమ మండల విద్యాశాఖాధికారికి నేరుగా అందచేయవలెను. (ఆ) సామాజిక తనిఖీ కొరకు ప్రదర్శింపజేయుట 
  • 7. ఈ విధంగా ప్రొఫార్మా-2లో ధృవీకరించిన సమాచార హార్డు కాపీలను అనుసరించి సవరించిన/ నమోదు చేసిన సమాచారాన్ని మండల విద్యాశాఖాధికారి వారు తమ లాగిన్లలో అప్ డేట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అప్ డేట్ చేసిన సమాచారాన్ని గ్రామాల వారీగా అర్హులైన తల్లుల/ సంరక్షకుల ముసాయిదా జాబితాను తయారు చేసి సంబంధిత గ్రామ /వార్డు సచివాలయంలో 11.12.2019 నాటికి సంబంధిత గ్రామ వార్డు సంక్షేమ, విద్యా సహాయకుని ద్వారా సామాజిక తనిఖీకై ప్రదర్శింపజేయాలి. (ఇ) అభ్యంతరాల స్వీకరణ మరియు తుది జాబితా తయారు 
  • 8. ఈ విధంగా గ్రామ, వార్డు సచివాలయంలో ప్రదర్శించిన అర్హుల ముసాయిదా జాబితాపై ఫిర్యాదులు, అభ్యంతరాలను 14.12.2019 లోగా సేకరించి ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తూ అర్హత గలిగిన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ముసాయిదా జాబితాను అప్డేట్ చేస్తూ ఉండాలి. (ఈ) గ్రామ సభ ఆమోదం 
  • 9. ఈ విధంగా అప్ డేట్ చేసిన ముసాయిదా జాబితాను 15.12.2019 నుండి 18.12.2019 మధ్య కాలంలో గ్రామ సభ ఆమోదానికై ప్రవేశపెట్టి సంబంధిత గ్రామసభ ఆమోదాన్ని పొందాలి. 
  • 10. ఈ విధంగా గ్రామ సభ ఆమోదం పొందిన తుది జాబితాలను ప్రతి మండల విద్యాశాఖాధికారి 22.12 2019 లోపు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి ఆమోదానికై పంపాలి. ప్రతి జిల్లా విద్యాశాఖాధికారి తమకు మండల విద్యాశాఖాధికారుల ద్వారా అందిన జాబితాలను ఎప్పటికప్పుడు పరిశీలించి ఆమోదించాలి. ఈ విధంగా జిల్లాలోని అందరు మండల విద్యాశాఖాధికారుల నుండి వచ్చిన జాబితాలను ఆమోదించిన పిదప సదరు మొత్తం జాబితాలను జిల్లా కలెక్టర్ వారి ఆమోదానికి 24.12.2019న సమర్పించాలి. నిధుల విడుదల 
  • 11. మండల విద్యాశాఖాధికారులకు ఈ కార్యక్రమ నిర్వహణ ఖర్చుల నిమిత్తం గరిష్ఠంగా రూ. 5000/- జిల్లా విద్యాశాఖాధికారికి సమగ్ర శిక్షా డి.పి.ఓ పను నుండి తక్షణమే విడుదల చేయాలని ఆదేశించడమైనది. 
  • 12. తదుపరి కార్యాచరణ ప్రణా? కపై ఉత్తర్వులు తదుపరి కార్యావర్తనముల ద్వారా తెలియజేయబడతాయి. 
  • 13. రాష్ట్రంలోని అందరు జిల్లా విద్యాశాఖాధికారులు మరియు సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లు, డివిజనల్, మండల విద్యా శాఖధికార్లు, క్లస్టర్ రిసోర్సు పర్సన్లు మరియు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాద్యాయులు, రాష్ట్ర స్థాయి పరిశీలకులు పూర్తి శ్రద్ధతో పై విధి విధానాలను అత్యంత జాగరూకతతో అమలుచేయవలసినదిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది. 
  • 14. మరియు ఈ అంశంపై సమగ్రమైన ఆదేశాలను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లుకు 02.12.2019న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా తెలియజేయడమైనది
For Clear Details Please Download the Copy provided below.
Download the Latest Instructions Copy