Primary 1-5th Classes Bridge Course Schedule and Instructions for Teachers

Primary 1-5th Classes Bridge Course Schedule and Instructions for Teachers. Govt of AP, EDN Department has decided to Live Telecast the Video Lessons for Students through DoorDarshan. Here are the Detailed Schedule and instructions for Primary Level 1-5th Class Video Lessons Schedule for Bridge Course and Instructions for Teachers and Parents Committee. Role of Primary School Teachers in Bridge Course through DD Live.

Primary 1-5th Classes Bridge Course Schedule and Instructions for Teachers

 ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు మరియు ప్రాథమికోన్నత పాఠశాలలలో పనిచేస్తూ ప్రాథమిక (1-5) తరగతులకు బోధించే ఉపాధ్యాయుల పాత్ర:
  • విద్యార్థుల యొక్క ఫెర్ఫార్మెన్స్ ఆధారంగా బ్రిడ్జి కోర్సు లెవెల్ - 1, లెవెల్ - 2 పుస్తకాలను 9 .06.2020 లోపల విద్యార్థుల కు అందజేయాలి.
  • టీవీ ద్వారా నిర్వహించే బ్రిడ్జి కోర్సుల ప్రణాళికను అనుబంధం - 1లో సూచించిన విధంగా తల్లిదండ్రులకు , విద్యార్థులకు, తల్లిదండ్రుల కమిటీలకు 9.6.2020 లోపల తెలియచేయాలి
  • విద్యార్థులలో భారీ డిజిటల్ విభజన ఉన్నందున, టీవీ పాఠాలు లేదా మొబైల్ నెట్ వర్క్ లకు ప్రాప్యత లేని పిల్లలకు నేర్చుకోవటానికి వీలుగా, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వారానికి ఒకసారి, అంటే ప్రతి మంగళవారం 16.06.2020 నుండి వారికి క్షేత్ర సహకారం మరియు మార్గదర్శకత్వం ఇవ్వడానికి పాఠశాలకు హాజరు కావాలి. 
  • 16.06.2020 నుండి ప్రతి మంగళవారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరవుతారన్న విషయాన్ని విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియచేస్తూ, విద్యార్థుల నోటు పుస్తకాలను, వర్కుషీట్లను ఆరోజు సరిచూసే నిమిత్తం పాఠశాలకు పంపించాలన్న సమాచారాన్ని అందజేయాలి. మరియు వారికి ఏమైనా సందేహాలు ఉన్నట్లైన ఉపాధ్యాయుల వద్ద నివృత్తి చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియచేయాలి.

సాధారణ సూచనలు

  • పాఠ్యాంశాలను చక్కని అవకాశంగా సద్వినియోగపరచుకోవాలి.
  • ఉపాధ్యాయులందరూ వారి హాజరును మాన్యువల్ గా నమోదు చేయవలెను.
  • ఉపాధ్యాయుల కొరకు నిర్వహించే వెబినార్లు పాఠశాల సమయం తర్వాత వీక్షించాలి.
  • టివీ లు మరియే ఇతర డిజిటల్ సాధనాలు అందుబాటులో లేని విద్యార్ధులకు వారు వారానికి ఒకసారి పాఠశాలకు వచ్చినప్పుడు ఆ వారానికి సంబందించిన పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు వారికి వివరించి చెప్పవలెను.
  • విద్యార్ధులు వారి వర్క్ షీట్స్ ను వారి యొక్క తల్లి / తండ్రి / సంరక్షకుడు ద్వారా గాని, వారే స్వయంగాగాని పాఠశాలకు ఉపాధ్యాయుడు హాజరైన రోజు నాడు వచ్చి ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం పొందవలెను.
  • వీడియో తరగతుల ద్వారా విద్యార్ధులకు ఇవ్వబడిన వర్కుషీట్స్ ను వారు సరిగా చేస్తున్నారో లేదో ఉపాధ్యాయులు విధిగా పరిశీలించాలి.
  • ఉపాధ్యాయులు సరిచేసిన వర్కుషీట్లను రికార్డుల రూపంలో తదుపరి తనిఖీ కొరకు నిర్వహించాలి.
  • విద్యార్థులు లేదా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ద్వారా తీసుకొచ్చిన వర్కుషీట్లను ఉపాధ్యాయులు మూల్యంకనం చేయాలి.

Detailed Primary Bridge Course DD Video Lessons Schedule