SHOE Measurements for Students 2020 Instructions - File 16021

SHOE Measurements for Students 2020 Instructions - File 16021. Govt has taken a decision distribute Shoes to All Students Studying in Government Schools in AP.  File No.SS-16021/31/2020-MIS SEC-SSA  ఆర్.సి.నెం. ఎస్.ఎస్ 16021/4/2019 ఎం.ఐ.ఎస్. ఎస్.ఇ.సి.-ఎస్ఎస్ఏ తేది: 01/06/2020
విషయం:  సమగ్ర శిక్షా  - జగనన్న విద్యా కానుక' విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి నమోదు చేయుట గురించి.

SHOE Measurements for Students 2020 Instructions - File 16021

నిర్దేశములు: 
  1. 1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షా: ఆర్.సి.నెం. ఎస్.ఎస్ 16021/4/2019 ఎం.ఐ.ఎస్. ఎస్.ఇ.సి.-ఎస్ఎస్ఏ తేది : 18.03.2020 ఆదేశములు
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020- 21 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జగనన్న విద్యా కానుక' పేరుతో స్టూడెంట్ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
  • 2. ఇందులో భాగంగా ఒక్కో స్టూడెంట్ కిట్లో మూడు జతల యూనిఫాంలు, ఒక సెట్ నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు ఉంటాయి.
  • 3. ప్రతి విద్యార్థికి బూట్లు పంపిణీ చేసే ప్రక్రియలో భాగంగా గత సంవత్సరంలో జరిగిన బూట్ల సరఫరాలో ఎదురైన ముఖ్య సమస్య 'బూట్ల సైజు సరిగా ఉండకపోవడం', తద్వారా కొందరు విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు.
  • 4. ఈ సమస్యను అధిగమించడానికి విద్యార్థుల నుంచి స్వయంగా పాదకొలతలు తీసుకోవడానికి ఈ కింది సూచనలు పొందుపరచడమైనది.
బూట్ల సరఫరా కోసం విద్యార్థుల పాద కొలతలు నమోదులో పాటించాల్సిన సూచనలు
  • రాష్ట్రంలోని విద్యా, సంక్షేమ శాఖలకు చెందిన ప్రభుత్వ/ మండల పరిషత్ / జిల్లా పరిషత్, మున్సిపల్ కేజీబీవీ, మోడల్ స్కూల్స్/ ఆశ్రమ, రెసిడెన్షియల్/ ఎయిడెడ్ పాఠశాల్లో ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న అమ్మాయిల, అబ్బాయిల పాదాల కొలతలను తీసుకోవాలి.
  • ఇందుకోసం ప్రధానోపాధ్యాయులు/ తరగతి ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పార్ట్ టైమ్ ఇనస్ట్రక్టర్లు, స్థానికంగా ఉన్న సిబ్బంది బాధ్యత తీసుకోవాలి. 
  • ఈ బాధ్యత నిర్వహించినందుకు సంబంధిత ఉపాధ్యాయునికి తగిన పారితోషికం ఇవ్వబడుతుంది. 
  • ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల వివరాలు అవసరం లేదు. 
  • విద్యార్థుల పాదాల కొలతలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయుట. 
  • ఈ బాధ్యతను సీఆర్పీలకు అప్పగించడమైనది.
ముఖ్యంగా చేయవలసినవి
  • విద్యార్థులపాదాల కొలతలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవలసిన అంశము.. తర్వాతి సంవత్సరానికి అనుగుణంగా (వారి పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని) పాదాల కొలత సైజును పెంచి తీసుకోవాలి.
  • (:: ఉదాహరణకు ఒక విద్యార్థి పాదం ప్రస్తుత సైజు 5 ఇంచీలు ఉంటే కాస్త పెంచి 6 ఇంచీలు సైజుగా నమోదు చేయాలి.) 
  • ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి తమ పాఠశాల విద్యార్థులను 8.6.2020 మరియు 9.6.2020 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠశాలకు రప్పించాలి.
  • విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేటప్పుడు కోవిడ్- 19 ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా ఆచరిస్తూ భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, శానిటైజర్, హేండ్ వాష్ వంటివి తప్పక వినియోగించి తగు జాగ్రత్తలు వహించాలి. శానిటైజర్ వంటి వాటి కోసం పాఠశాల కాంపోజిట్ నిధులను వినియోగించుకోవాలి. 
  • పాఠశాలకు రాలేని, పాఠశాలకు దూరంగా ఉన్న విద్యార్ధుల, కేజీబీవీ/ మోడల్ స్కూల్స్/ ఆశ్రమ, రెసిడెన్షియల్ తదితర హాస్టల్లో చదివే బాలబాలికల పాదాల కొలతలు తీసుకోవడానికి జగనన్న గోరుముద్ద పథకం (మధ్యాహ్నభోజనం)లో భాగంగా విద్యార్థులకు డైరేషన్ (బియ్యం, చిక్కీ, గుడ్లు) అందిస్తున్న వాలంటీర్ల సాయం తీసుకొని, ఆ విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేలా సీఆర్పీలు చర్యలు తీసుకోవాలి.
నమోదు ఇలా 
విద్యార్ధుల పాదాల కొలతలన్నీ హెచ్ఎం లాగిన్లలో పొందుపరచాలి. 
హెచ్ఎం లాగిన్ ఓపెన్ చేయగానే పాఠశాల, విద్యార్థుల పేర్లు, తదితర వివరాలు ఉంటాయి.
  • 2.54 సెంటీమీటర్లు = 1 ఇంచ్
  • 5.08 సెంటీమీటర్లు = 2 ఇంచీలు
  • 7.62 సెంటీమీటర్లు = 3 ఇంచీలు
  • 10.16 సెంటీమీటర్లు = 4 ఇంచీలు
  • 12.7 సెంటీమీటర్లు = 5 ఇంచీలు
  • 15.24 సెంటీమీటర్లు = 6 ఇంచీలు
  • 17.78 సెంటీమీటర్లు = 7 ఇంచీలు
  • 20.32 సెంటీమీటర్లు = 8 ఇంచీలు
  • 22.86 సెంటీమీటర్లు = 9 ఇంచీలు
  • 125.4 సెంటీమీటర్లు = 10 ఇంచీలు
పాదాల కొలత తీసుకోవడం
  • స్థానికంగా ఉన్న ఫుట్‌వేర్ దుకాణాల్లో 'పాదాల కొలత సాధనం' తీసుకొచ్చి పాదాల కొలత తీసుకోవడం.
  • లేనిపక్షంలో ఒక అట్ట మీద స్కేలు/ టేపుతో కొలతలు గీసి జాగ్రత్తగా నమోదు చేయాలి.
  • హెచ్ఎం లాగిన్లలో పొందుపరిచినటువంటి స్కీలో 10.6.2020 లోగా నమోదు చేయాలి.
  • ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో తరగతి ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి.
  • ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.
  • ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్లో హెడ్మాష్టరు లాగిన్ ద్వారా కొలతలు నమోదు చేయాలి
  • ప్రధానోపాధ్యాయులు/ సీఆర్పీలు ఈ కార్యక్రమాన్ని కచ్చితంగా జరిగేలా బాధ్యత వహించాలి.
How to Take Shoe Measurements

0 comments:

Give Your valuable suggestions and comments