DSC 2018 Visakha District SGT Vacancies 24th Sep 2020
డి.ఎస్.సి-2018 పరీక్ష నందు ఎంపిక కాబడిన ఎస్.జి.టి లకు విద్యా సంచాలకులు పాఠశాల విద్య, ఆంధ్రప్రదేశ్ అమరావతి వారి ఆదేశముల మేరకు తేది 25.09.2020 న మరియు 26.09.2020 న వసంత విద్యా విహార్ పాఠశాల (VBV School) గురుద్వారా జంక్షన్, విశాఖపట్నం నందు ఉదయం 10.00 గంటల నుండి కౌన్సిలింగ్ నిర్వహించబడునని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ బి. లింగేశ్వర రెడ్డి గారు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.ఇందులో భాగంగా మైదాన ప్రాంతమునకు ఎంపిక కాబడిన అభ్యర్ధులకు తేది 25.09.2020 న మరియు ఏజెన్సీ ప్రాంతమునకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు తేది 26.09.2020 న కౌన్సిలింగ్ నిర్వహించబడును.
అదేవిధముగా నగరపాలక సంస్థ విశాఖపట్నం మరియు ట్రైబల్ వెల్ఫేర్ పాడేరు యాజమాన్యములకు ఎంపిక కాబడిన అభ్యర్ధులు ఆయా యాజమాన్యముల షెడ్యుల్ ప్రకారము కౌన్సిలింగ్ నిర్వహించబడును.
కావున మైదాన ప్రాంతమునకు ఎంపిక కాబడిన అభ్యర్ధులు తేది 25.09.2020 న మరియు ఏజెన్సీ ప్రాంతమునకు ఎంపిక కాబడిన అభ్యర్ధులు తేది 26.09.2020 న ఉదయం 10.00 గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి వారు ఇచ్చిన చెక్ లిస్టు మరియు మూడు ఫోటో లతో హాజరు కావాలని కోరడమైనది.
DSC 2018 Visakha District SGT Vacancies 24th Sep 2020">Download the Vacancies List
0 comments:
Give Your valuable suggestions and comments