JVK Vaarotsavaalu Day Wise Schedule - జగనన్న విద్యా కానుక వారోత్సవాలు


JVK Vaarotsavaalu Day Wise Schedule - పాఠశాల విద్యాశాఖ - 'జగనన్న విద్యా కానుక వారోత్సవాలు' నిర్వహణ కొరకు- జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు - జారీ ఆర్.సి.నం. Spl/JVK/2020 తేది: 20.11.2020

JVK Vaarotsavaalu Day Wise Schedule 

విషయం: పాఠశాల విద్యాశాఖ - 'జగనన్న విద్యా కానుక వారోత్సవాలు' నిర్వహణ కొరకు- జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు - జారీ. 
నిర్దేశం: 1. ఆర్.సి.నం. Spl/JVK/2020 తేది: 16.11.2020

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జగనన్న విద్యాకానుక' పథకంలో భాగంగా 2020-21 విద్యా సంవత్సరానికి అన్ని ప్రభుత్వ యాజమాన్య, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న అందరు విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది.
  • ఇందులో భాగంగా ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం, ఒక సెట్ | నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, 3 మాస్కులతో పాటు బ్యాగును కిట్ రూపంలో అందించడం జరిగింది.
  • వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచే నాటికే 'జగనన్న విద్యాకానుక' పథకం 
  • మరింత మెరుగైన ప్రణాళికతో ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించింది.
  • ఇందులో భాగంగా 'జగనన్న విద్యాకానుక' వారోత్సవాలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత పథకానికి సంబంధించి అన్ని వస్తువుల నాణ్యత, పంపిణీ విధానాన్ని పరిశీలించడం, ఇందులో ఎదురైనటువంటి చిన్నచిన్న లోపాలను సరిదిద్దుకోవడం, వీటన్నింటిని అధిగమిస్తూ వచ్చే విద్యా సంవత్సరంలో మరింత పక్కా ప్రణాళికతో 'జగనన్న విద్యా కానుక' కిట్లను సరఫరా చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవడం 'జగనన్న విద్యాకానుక' వారోత్సవాల ముఖ్యోద్దేశ్యం. ఇందులో భాగంగా నవంబరు 23 నుంచి నవంబరు 28 వరకు వారం రోజులు పాటు అన్ని పాఠశాలల్లో 'జగనన్న విద్యా కానుక' వారోత్సవాలు నిర్వహించాలి.

'జగనన్న విద్యాకానుక వారోత్సవాలు'లో చేయాల్సిన కార్యక్రమాలు

  • 23.11.20 (సోమవారం) | విద్యార్థులకు, తల్లిదండ్రులకు 'జగనన్న విద్యాకానుక' గురించి 
  • అవగాహన కల్పించడం. ప్రతి విద్యార్థికి స్టూడెంట్ కిట్ అందిందా, లేదా పరిశీలించడం. బయోమెట్రిక్ అథంటికేషన్ తనిఖీ చేయడం. 
  • 24.11.20 (మంగళవారం) విద్యార్థులు యూనిఫాం కుట్టించుకున్నారో లేదో పరిశీలించడం. కుట్టు కూలీ ఖర్చులు నేరుగా తల్లుల ఖాతాకు ప్రభుత్వం వేస్తున్న విషయాన్ని తెలపడం. యూనిఫాం కొలతలు గురించి, దుస్తులు కుట్టించుకోవడంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం.
  • 25.11.20 (బుధవారం) విద్యార్థులు బూట్లు వేసుకునే విధానం, సాక్సులు ఉతుక్కోవడం వంటి వాటిపై అవగాహస కల్పించడం. బూట్లు కొలతల్లో ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దడం. 
  • 26.11.20 (గురువారం ) పాఠ్య పుస్తకాలకు, నోటు పుస్తకాలకు, వర్క్ బుక్కులకు అట్టలు వేసుకునేలా, పుస్తకాలను ఉపయోగించుకోవడం పట్ల అవగాహన కల్పించడం. 
  • 27.11.20 (శుక్రవారం ) బ్యాగులు వాడే విధానం, పాఠశాల బ్యాగు బరువు తగ్గించే విధానం గురించి చర్యలు, అవగాహన కల్పించడం. బ్యాగుల విషయంలో ఏవైనా సూచనలు ఉన్నట్లయితే సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావడం.
  • 28.11.20 (శనివారం) 'జగనన్న విద్యాకానుక' కిట్ లో అన్ని వస్తువులు అందాయా లేదా | అని తెలుసుకోవడం. బయోమెట్రిక్ సరిగా ఉందో లేదో పరిశీలించడం, జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావడం.
  1.  ఈ వారం రోజులలో కుట్టు కూలీ ఇవ్వవలసిన పిల్లలకు బయోమెట్రిక్ అథంటికేషన్ అయిన వెంటనే కుట్టు కూలీ డబ్బులు వేయడం సులభమవుతుంది. కాబట్టి ఆ పని పూర్తి చేయాలి.
  2. విద్యార్థుల యూనిఫాం కుట్టు కూలీ నిమిత్తం 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు జతకు రూ. 40 చొప్పున 3 జతలకు రూ. 120లు, 9,10 తరగతుల విద్యార్థులకు జతకు రూ.80 చొప్పున 3 జతలకు రూ.240లు నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం అందిస్తుందన్న విషయాన్ని విద్యార్థులకు, వారి ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయాలి.
  3. హెచ్ఎం లాగిన్లలో పిల్లల కుట్టుకూలీ జమకాని పిల్లల తల్లుల ఆధార్ డేటాను వెరిఫికేషన్ చేయాలి. వివరాలు తప్పుగా ఉంటే కుట్టు కూలీ జమ కాదు. 
  4. అంతేకాకుండా బూట్లు సైజులు విషయంలో, మార్పు చేయడం వంటి సమస్యలను పరిష్కరించడం మొదలైన అంశాలు పూర్తి చేయడం. జిల్లా అధికారులు ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చొరవ చూపాలి. బూట్లు, బ్యాగులు మార్పిడికి సంబంధించి ఆయా జిల్లాల్లో సరఫరాదారులకు చెందిన ఏజెంట్ల నంబర్లను 'ఆర్.సి.నం. SS-16021/8/2020- MIS SEC - SSA, dt: 23.10.2020' ద్వారా ఆదేశాలు ఇవ్వడమైనది. వారిని సంప్రదించి పరిష్కారం చేయాలి. వీటితో పాటు వచ్చే విద్యా సంవత్సరంలో మరింత 'జగనన్న విద్యా కానుక' కార్యక్రమం నిర్వహించడం కోసం ప్రతి పాఠశాలలో ఈసారి గమనించిన సమస్యలు, లోటుపాట్లు, పరిష్కారాలు, సూచనలు, సలహాల నివేదిక రూపంలో జిల్లా అధికారికి అందజేయాలి.
  5. జిల్లా అధికారులు రాష్ట్ర కార్యాలయానికి నివేదిక పంపించాలి.
  6. పై అంశాలను జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు, జిల్లా ఉప విద్యా శాఖాధికారులు, సీఎంవోలు, జిల్లా సెక్టోరియల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు వారివారి స్థాయిల్లో వ్యక్తిగత బాధ్యత వహించవలసిందిగా ఆదేశించడమైనది.