JaganAnna AMMAVODI 2020-21 Rs 15000 Detailed Guidelines Action Plan Schedule Rc 28021

JaganAnna AMMAVODI 2020-21 Rs 15000 Detailed Guidelines Rc 28021. CSE AP has released the Detailed guidelines regarding the Jagananna Ammavodi for the year 2020-21. Step by Step procedure for identification of JAGANANNA AMMAVODI Studetns Parents Data and Online Data Entry in AMMAVODI Website. Here are the detailed guidelines explained in Telugu. Rc No ESE02- 28021/27/2020. AMMAVODI 2020-21 Detailed Action Plan - Guidelines Schedule

JaganAnna AMMAVODI 2020-21 Rs 15000 Detailed Guidelines Rc 28021

ఆర్.సి.నెం.ఇఎస్ఆ02- 28021/27/2020 - పిఎజ-సీఎస్ఎ, తేది : 09.12.2020 జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2020-21 విద్యా సంవత్సరంనకు అమలు పరచుటకు సూచనలు. 
విషయం : పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2020-21 విద్యా సంవత్సరంనకు అమలు పరచుటకు సూచనలు. 
నిర్దేశములు : 
1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-II) వారి ఉత్తర్వులు నెం. 79, తేది : 4.11.2019 
2) పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శివారి నోటు ఫైలు ఉత్తర్వులు నెం. ఇఎస్ఎ02 28021/27/2020- పిఎజ - సీఎస్ఎ, తేది: 07.12.2020

ఆదేశములు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలల్లోనూ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు, మరియు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లోనూ, జూనియర్ కళాశాలల్లోనూ మరియు అన్ని ప్రభుత్వ శాఖల గురుకుల పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ 1వ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులు వారికి కుల, మత, ప్రాంత, వివక్షత లేకుండా రూ. 15,000/- చొప్పున వార్షిక ఆర్థిక సహాయం అందించటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై నిర్దేశం ద్వారా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. 

2. పై కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం “జగనన్న అమ్మఒడి" కార్యక్రమంగా ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందగల తల్లులు లేదా గుర్తింపు పొందిన సంరక్షకుల అర్హతలను, వార్షిక ఆర్థిక సహాయం చెల్లింపు విధానాన్ని మరియు పర్యవేక్షణ విధానాన్ని ప్రభుత్వం పై ఉత్తర్వుల ద్వారా నిర్దేశించింది. ఆ మేరకు అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు, చెల్లింపు మొదలైన విధి విధానాలను ఆన్‌లైన్ ద్వారా చేపట్టవలసినదిగా కూడా ఆదేశించింది.www.apteachers.in 

3. ఇందుకు గాను ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులు మరియు గుర్తింపు పొందిన సంరక్షకుల్లో అర్హులైన వారి ఆధార్‌కార్డు వివరాలు, బ్యాంకు అకౌంటు నెంబరు మరియు ఐఎఫ్ఎస్ సీ కోడ్, రైస్ కార్డు వివరములు సేకరించవలసి ఉన్నది. ఈ వివరాలను గ్రామస్థాయిలో ఏర్పాటైన గ్రామ సచివాలయం ద్వారా, గ్రామస్థులందరికి మరియు పట్టణ స్థాయిలో వార్డు సచివాలయం ద్వారా, వార్డు సభ్యులందరికీ తెలియచేసి దానిలో ఆ సమాచారంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సామాజిక తనిఖీ ద్వారా సరిదిద్దుకోవలసి ఉన్నది.

4. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఈ ప్రక్రియ ద్వారా అమలు పరచటం కోసం పాఠశాల విద్యాశాఖ డిసెంబరు 9 నుండి డిసెంబరు 25 వరకు 'జగనన్న అమ్మఒడి' పేరిట ముందస్తు చర్యలు ఉద్యమస్థాయిలో చేపట్టడానికి నిశ్చయించింది. ఈ పథకం కింద అర్హత కలిగిన తల్లుల, సంరక్షకుల వివరాలను సేకరించటానికి, ఆ వివరాలను సామాజిక తనిఖీ ద్వారా ధృవీకరించుకోవటానికి, ఆ విధంగా ధృవీకరించుకున్న తరువాత తిరిగి ఆ సవరణలను ఆన్ లైన్ ద్వారా చేపట్టి అర్హుల జాబితాలను ప్రకటించటానికి పాఠశాల విద్యాశాఖ కాలపట్టిక(టైం లైన్)ను నిర్దేశించింది. 

5. పాఠశాల విద్యాశాఖ నిర్దేశించిన కాలపట్టిక (టైం లైన్) ప్రకారం, పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిన విధి విధానాల గురించి 09.12.2020న రాష్ట్ర, జిల్లా మరియు మండల స్థాయి విద్యాశాఖాధికారులతో మరియు ఇంటర్మీడియెట్ విద్య అధికారులతోను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పష్టమైన ఆదేశాలను జారీ చేయటం జరిగింది.www.apteachers.in.

 జగనన్న అమ్మఒడి ఆదేశాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

6.  పాఠశాల చైల్డ్ ఇన్ఫోను/ కళాశాల విద్యార్థుల జ్ఞానభూమి డేటాను , బియ్యం కార్డును, తల్లి/ సంరక్షకుల బ్యాంకు అకౌంటు, ఐఎఫ్ఎస్సీ కోడ్ మరియు ఆధార్ సీడింగన్ను అప్డేట్ చేయటం 

7. 2020-21 విద్యాసంవత్సరానికి గాను రాష్ట్రంలో యూడైస్ కోడ్ కలిగిన పాఠశాలలు 61,824 మరియు 3,617 జూనియర్ కళాశాలలలో 74,98,308 మంది విద్యార్థులు నమోదు కాబడి ఉన్నారు. ఈ పాఠశాలల్లో / కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాలు ఆన్ లైన్ లో చైల్డ్ ఇన్ఫోలో/ జ్ఞానభూమి పోర్టల్లో పొందుపరచబడ్డాయి. ఈ వివరాలలో పూర్తివివరాలు కలిగిన విద్యార్థుల వివరాలను బట్టి అర్హులైన తల్లుల సంరక్షకుల జాబితాను 6 అంచెల ప్రమాణం ప్రకారం పరిశీలించి 16.12.2020 నాటికి విడుదల చేయడం జరుగుతుంది. ఆ వివరాలను 'అమ్మఒడి' పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పాఠశాల/ కళాశాల మరియు గ్రామ/వార్డు సచివాలయం నందు నోటిసు బోర్డులో ప్రదర్శించాలి. 

8. ఆ విధంగా ప్రదర్శించిన సమాచారంపై అభ్యంతరాలు వచ్చినట్లయితే ఆ అభ్యంతరాలు రెండు విధాలుగా ఉండవచ్చును.
  • అ) తల్లి లేదా సంరక్షకుల ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ , ఐఎఫ్ఎస్ సీ కోడ్ సంబంధించిన అంకెలలో పొరపాట్లు. అటువంటివాటిని ప్రధానోపాధ్యాయుడు సరిచేయవలసి ఉంటుంది. 
  • ఆ) అనర్హత పట్ల అభ్యంతరాలను గ్రామ/ వార్డు సచివాలయాల శాఖవారు విడుదల చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా జాయింట్ కలెక్టర్ గారికి సమర్పించవలసి ఉంటుంది. వాటిని జాయింట్ కలెక్టర్ గారు పరిష్కరిస్తారు. 
9. గత సంవత్సరం విద్యార్థుల సంఖ్యతో సరిపోల్చినపుడు ఇంకనూ 3,39,342 విద్యార్థులు ఒకటో తరగతి నుండి పదో తరగతి దాకా వివిధ తరగతుల్లో నమోదు కావలసి ఉన్నది. అటువంటివారిని నమోదు/ అప్ డేట్ చేయవలసిన బాధ్యత ప్రధానోపాధ్యాయుడిది. కాబట్టి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 10.12.2020 నుండి 20.12.2020 మధ్య నమోదు/ అప్ డేట్ తప్పనిసరిగా చేయాలి. అలాగే ఇప్పటికే పాఠశాలల్లో నమోదైనప్పటికీ పూర్తి వివరాలు అడేట్ కాని విద్యార్థుల వివరాలను కూడా తప్పనిసరిగా అప్ డేట్ చేయాలి.www.apteachers.in 

10. ఆ విధంగా 10.12.2020 నుండి 15.12.2020 మధ్యకాలంలో అప్డేట్ అయిన విద్యార్థుల వివరాలను ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారికి 15.12.2020 సాయంకాలం 6 గంటలకు అందజేయడం జరుగుతుంది. వారు ఆ వివరాలను ఆరంచెల ప్రమాణం ప్రకారం పరిశీలించి అర్హులైన తల్లుల/ సంరక్షకులు జాబితాను 19.12.2020 సాయంత్రం 6 గంటల తర్వాత ఆ వివరాలను 'అమ్మఒడి' పోర్టల్లో ప్రకటిస్తారు. 

11. ఆ విధంగా ప్రకటించిన వివరాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామసచివాలయం అధికారులు 20-12-2020 నుండి 24-12-2020 దాకా నోటీసుబోర్డులో ప్రకటించాలి. వాటి పైన వచ్చే అభ్యంతరాలు పైన చెప్పినట్లే రెండు విధాలుగా ఉండవచ్చు.
  • అ) తల్లుల లేదా సంరక్షకుల ఆధార్ నంబరు, బాంక్ అకౌంటు నెంబరు లేదా ఐ.ఎఫ్.ఎస్.సి కోడ్ నంబర్లలో తప్పులు దొర్లి ఉండటం, లేదా, 
  • ఆ) అనర్హత పట్ల అభ్యంతరాలు. మొదటి తరహా అభ్యంతరాలను ప్రధానోపాధ్యాయుడు సరిదిద్దవలసి ఉంటుంది. రెండవ తరహా అభ్యంతరాలను గ్రామ వార్డు సచివాలయాలద్వార స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా జాయింట్ కలెక్టరు గారికి సమర్పించవలసి ఉంటుంది. వాటిని జాయింట్ కలెక్టరుగారు పరిష్కరిస్తారు. 
12. ఆ విధంగా మొదటి జాబితాలో 16-12-2020 న విడుదలచేసిన జాబితా, మరియు 20-12 2020 ద్వారా ప్రకటించిన జాబితాలను క్రోడీకరించి, సరిదిద్దిన అభ్యంతరాలతో అర్హులైన తల్లుల, సంరక్షకుల తుది జాబితాను 26-12-2020 నాటికి అమ్మఒడి పోర్టల్ ద్వారా ప్రకటించడం జరుగుతుంది. 

గ్రామసభ ఆమోదం
13. ఆ విధంగా ప్రకటించిన అర్హులైన తల్లుల/ సంరక్షకుల తుది జాబితాను 27.12.2020 నుండి 28.12.2020 లోగా గ్రామసభ/ వార్డుసభ ముందు పెట్టి వారి ఆమోదం పొందవలసి ఉంటుంది. 

ఆమోదించబడ్డ జాబితాలను ప్రధానోపాధ్యాయులకు/ ప్రిన్సిపాల్స్ పై అధికారులకు అందచేయటం 

14. ఆమోదించబడ్డ జాబితాలను గ్రామ, వార్డు సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకుడు సంబంధిత ప్రధానోపాధ్యాయునికి/ప్రిన్సిపాల్ కు 29.12.2020 నాటికి ఆన్ లైన్ ద్వారా అందచేయవలసి ఉంటుంది. 

15. సంబంధిత ప్రధానోపాధ్యాయుడు/ప్రిన్సిపాల్ ఆ జాబితాలను సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారి ద్వారా జిల్లా విద్యాశాఖాధికారికి 30.12.2020 లోగా అందచేయాలి.

16. జిల్లా విద్యాశాఖాధికారి ఆ జాబితాలను 30.12.2020 నాటికి జిల్లా కలెక్టరు వారి ఆమోదానికి సమర్పించవలసి ఉంటుంది. 

మరికొన్ని జాగ్రత్తలు 
17. తల్లుల మరియు సంరక్షకుల ఆధార్ కార్డు వివరాలను వారి అనుమతితో మాత్రమే సేకరించి నమోదు చేయాలి. 

18. తల్లి లేని పక్షంలో తండ్రి లేదా గుర్తింపు పొందిన సంరక్షకుడి వివరాలను సేకరించాలి. 

19. ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని అప్ డేట్ చేసేటప్పుడు పేరెంట్స్ కమిటీని తప్పకుండా సంప్రదించాలి.

జిల్లా స్థాయిలో అమ్మఒడి సహాయ కేంద్రం ఏర్పాటు 
20. పైన నిర్దేశించిన విధి విధానాల ప్రకారం చర్యలు సక్రమంగా చేపడుతున్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం కోసం మరియు ఈ ప్రక్రియలో ఎప్పటికప్పుడు తలెత్తే సందేహాలను సత్వరమే నివృత్తి చేయడం కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ప్రతి విద్యా డివిజన్ కు ఒక ఇన్ చార్జ్ ప్రతినిధిని నియమిస్తూ 24X7 ప్రాతిపదికన సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఈ సహాయ కేంద్రం బాధ్యతలను మోడల్ స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్ / ఎఎంఓకు అప్పగించాలి. ప్రతి జిల్లాలో ఉన్న 'ఐటి సెల్' సేవలను సాంకేతిక సహాయం కోసం వినియోగించుకోవాలి. మండల స్థాయిలో ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటరకు ఈ బాధ్యతను పూర్తిస్థాయిలో అప్పగించాలి. వీరు కాక, మరే ఇతర అధికారులైనా ఈ బాధ్యతలు నిర్వహించడానికి తగిన వారిగా భావించినట్లయితే వారికి కూడా అప్పగించవచ్చు. దీనికొరకు ప్రతి జిల్లా విద్యాశాఖాధికారి వారికి రూ. 25,000/- మంజూరు చేయబడుతుంది. 

రాష్ట్ర స్థాయి పర్యవేక్షకులు
21. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సక్రమంగా అమలు జరగటానికి తగిన చర్యలు తీసుకోవడం కోసం జిల్లాకు ఒకరు చొప్పున రాష్ట్ర స్థాయి అధికారులను పరిశీలకులుగా నియమించటం జరిగింది. వారి వివరాలు అనుబంధములో జతపరచటమైనది. 

రాష్ట్ర స్థాయి బాధ్యతలు
22. రాష్ట్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయటానికి సంచాలకులు పాఠశాల విద్యాశాఖకు తగిన సహాయ సహకారాలు అందించడం కోసం శ్రీ ఎ. సుబ్బారెడ్డి, అదనపు సంచాలకులు మరియు ఉపసంచాలకులు శ్రీ మువ్వా రామలింగం పాఠశాల విద్యాశాఖ వారిని ప్రత్యేక అధికారులుగా నియమించటమైనది. 

23. రాష్ట్రంలోని అందరు జిల్లా విద్యాశాఖాధికారులు,  జిల్లా వృత్తి విద్యాశాఖాధికారులు (డీవీఈవో) మరియు ప్రాంతీయ తనిఖీ అధికారులు - ఇంటర్మీడియెట్ విద్య, మరియు సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు, డివిజనల్, మండల విద్యాశాఖాధికార్లు, క్లస్టర్ రిసోర్సు పర్సన్లు మరియు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ఎయిడెడ్, వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల, సాంఘిక సంక్షేమ గురుకుల, గిరిజన సంక్షేమ గురుకుల, గిరిజన ఆశ్రమ, ఆంధ్రప్రదేశ్ గురుకుల, కేజీబీవీ, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలు, గుర్తింపు పొందిన మదర్సాలు, నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్ ఈ మరియు ఐసీఎస్ ఈ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాల్స్, రాష్ట్ర స్థాయి పరిశీలకులు పూర్తి శ్రద్ధతో పై విధి విధానాలను అత్యంత జాగరూకతతో అమలుచేయవలసినదిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది.

గమనిక: జగనన్న అమ్మఒడి కు సంబంధించి అర్జీలు/ అభ్యంతరాలను ఆన్ లైన్ ద్వారా మాత్రమే 'అమ్మఒడి' పోర్టల్ నందు నమోదు చేయవలెను. హార్డ్ కాపీల ద్వారా వచ్చిన అభ్యంతరాలు ఏ స్థాయిలోనూ స్వీకరించబడవు.
Download the Proceedings Copy