ట్రాన్స్ఫర్ అయిన CPS ఉద్యోగి తన ప్రాన్ ఖాతాను ట్రాన్స్ఫర్ చేసుకోవాలా?

ట్రాన్స్ఫర్ పొందిన ఉద్యోగి కొత్త ట్రెజరీ కి తన ప్రాన్ ఖాతాను ట్రాన్స్ఫర్ చేసుకోవాలా?  గత కొద్ది రోజులుగా బదిలీ పొందిన ప్రతీ CPS ఉద్యోగి తప్పని సరిగా తన ప్రాన్ ఖాతా ను ISS ఫారం ఉపయోగించి బదిలీ చేసుకోవాలి అని ఒక మెసేజ్ వాట్సాప్ తదితర సోషల్  మీడియా లో హల్ చల్ చేస్తుంది. దాని పై పూర్తి సమాచారం. Is it necessary for a CPS Employee to Transfer his / her PRAN in General Transfers?

Transferred CPS Employees - How to Transfer his PRAN ACCOUNT TO NEW DDO.

ట్రాన్స్ఫర్ అయిన CPS ఉద్యోగి తన ప్రాన్ ఖాతాను ట్రాన్స్ఫర్ చేసుకోవాలా?

ట్రాన్స్ఫర్ అయిన CPS ఉద్యోగి తన ప్రాన్ ఖాతాను ట్రాన్స్ఫర్ చేసుకోవాలా?. దీనికి సమాధానంగా ఈ మధ్య  సోషల్ మీడియా లో తిరుగుతున్న మెసేజ్ చూద్దాం. 

బదిలీ అయిన CPS ఉపాధ్యాయులు ఉద్యోగులు గమనించవలసిన అంశం
మీ PRAN ACCOUNT మీ పాత DDO కి , అలాగే sub treasury office కి లింక్ అయ్యి ఉంటుంది.
ఇప్పుడు మీరు మీ PRAN ACCOUNT ని కొత్త DDOకి,. కొత్త సబ్ ట్రెజరీ ఆఫీస్ కి లింక్ చేయాల్సి ఉంటుంది.
దీనికోసం మీరు inter sector shifting form నీ పూర్తిచేసి కొత్త డి డి ఓ గారి సంతకం చేయించి కొత్త సబ్ ట్రెజరీ ఆఫీసు లో ఇవ్వవలసి ఉంటుంది.
ఈ ఇంటర్ సెక్టార్ షిఫ్టింగ్ ఫాం పూర్తి చేయుటకు మీకు కొత్త డి డి ఓ రిజిస్ట్రేషన్ నెంబర్ (ఉదాహరణ-SGV01783F)
కొత్త సబ్ ట్రెజరీ రిజిస్ట్రేషన్ నెంబర్ (ఉదాహరణ: ఒక STO REGISTRATION NUMBER 4002666) కావాలి.
మీరు ఈ DDO REGISTRATION NUMBER,STO REGISTRATION NUMBER ను, Already అక్కడ పనిచేస్తున్న CPS ఉద్యోగుల PRAN ACCOUNT నుంచి పొందవచ్చు.
మీరు మీ ప్రాణ్ అకౌంట్ ఓపెన్ చేసి year wise స్టేట్మెంట్ చెక్ చేస్తే మీ అకౌంట్ కొత్త డి డి ఓ కి కొత్త ఎస్ టి ఓ కి లింక్ అయినది లేనిది చెక్ చేసుకోవచ్చు.
మీరు ఈ ప్రాసెస్ ను కంప్లీట్ చేస్తే, మిస్సింగ్ క్రెడిట్ నివారించుకోవచ్చు

ఐతే ఇప్పుడు వాస్తవాలు ఏంటో చూద్దాం. 
CPS  ఉద్యోగి బదిలీ అయినప్పుడు వారి ప్రాన్  ఖాతా ఏది వేరే గ బదిలీ చేసుకోవలసిన అవసరం. లేదు. Inter sector form నింపి ట్రెజరీ లో ఇవ్వమని తిరుగుతున్న సమాచారం పూర్తిగా తప్పుడు వార్త

CPS  ఉద్యోగి ఎటువంటి ఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే , ఒక నెల జీతం పడగానే ఆటోమేటిక్ గా వారి   కొత్త DDO కు ప్రాన్, మరియు ట్రెజరీ జతచేయబడతాయి.ఏ పి టీచర్స్ .ఇన్ వెబ్సైటు .

Inter Sector Form (ISS) Form అనేది ఉద్యోగి  వేరే సెక్టార్ కు (రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం మొదలైనవి)  తమ ఉద్యోగం మారినప్పుడు మాత్రమే ఉపయోగించాలి. సాధారణ బదిలీ సమయంలో ఏ విధమైన ఫారం లు ఉపయోగించవలసిన అవసరం లేదు. పొరపాటున ఇలా Inter Sector Form (ISS) Form  నింపి ట్రెజరీ మారడాన్ని force shifting అంటారు,ఇలా చేయడం వలన పాత క్రెడిట్స్ మన PRAN ఖాతా కి జమ కాక పోయే ఆస్కారం మెండుగా వుంది.

దయచేసి వాట్సాప్ లలో వచ్చే ప్రతిదీ FOLLOW అయ్యి ఇబ్బంది పడకండి.