APSWREIS 5th Class Admission Notification 2021-22 APGPCET-2021 Admissions for 5th Class APSWREIS

APSWREIS 5th Class Admission Notification 2021-22 APGPCET-2021 Admissions for 5th Class APSWREIS
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, (APSWREIS) తాడేపల్లి, అమరావతి 5వ నందు తరగతి ప్రవేశము కొరకు ప్రకటన . Notification No. Acad/13021(31)/9/2020, Dt.15-06-2021. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2021-22 సంవత్సరమునకు గాను ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతి (ఇంగ్లీష్ మాద్యమము)లో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

APSWREIS 5th Class Admission Notification 2021-22 APGPCET-2021 Admissions for 5th Class APSWREIS

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2021-22 సంవత్సరమునకు గాను ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతి (ఇంగ్లీష్ మాద్యమము)లో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. అర్హులైన అభ్యర్ధులు తమ దరఖాస్తులను తేది: 17-06-2021 నుండి 07-07-2021 వరకు https://apgpcet.apcfss.in ద్వారా ఆన్ లైన్ లో సమర్పించాలి. 

ప్రవేశ పరీక్ష తేదీని తదుపరి దరఖాస్తుదారుల రిజిస్టర్డ్ సెల్ ఫోనుకు మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.
అభ్యర్ధులకు సూచనలు:

I) ప్రవేశమునకు అర్హత : 
  • 1. వయస్సు: యస్.సి. మరియు యస్.టి (SC/ST) విద్యార్ధులు తేది. 01-09-2008 నుడి 31-08-2012 మద్య జన్మించిన వారై వుండాలి, ఓ.సి., బి.సి., యస్. సి. కన్వర్టెడ్ క్రిస్టియస్ (B.C-C) విద్యార్ధులు తేది.01-09-2010 నుండి 31-08-2012 మద్య జన్మించిన వారై వుండాలి. 
  • 2. విద్యార్ధులు తమ స్వంత జిల్లాలో మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత జిల్లాలలో, 2019-20 విద్యా సంవత్సరములో 3వ తరగతి మరియు 2020-21 విద్యా సంవత్సరములో 4వ తరగతి నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి. 
  • 3. ఆదాయ పరిమితి: అభ్యర్ధి యొక్క తల్లి, తండ్రి / సంరక్షకుల సంవత్సరాదాయము (2020-21) రూ.1,00,000/ మించి ఉండరాదు.
11) రిజర్వేషన్ల వివరాలు :
  • 1) అన్ని గురుకుల విద్యాలయాల్లో S.C - 75%, S.C. కన్వర్టడ్ క్రిస్టియన్లు - 12%, S.T - 6%, FB.C - 5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి. 
  • 2) ప్రత్యేక కేటగిరి (ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లల్లు, వెట్టి చాకిరీ నుండి బయట పడ్డ పిల్లలు, జోగినులు, బసవిన్లు, అనాధలు, అత్యాచార బాధితులు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు) క్రింద 15% సీట్లు కేటాయించబడినవి. 
  • 3) వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి. 
  • 4) ఏదైనా కేటగిరిలో సీట్లు భర్తీ కాని యెడల, వాటిని S.C. కేటగిరి విద్యార్ధులకు కేటాయిస్తారు. 
185 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల వివరములు పట్టిక - A నందు ఇవ్వబడినవి. పట్టిక కొరకు ఇక్కడ క్లిక్ చేయండి Click  Here 

గమనిక:
ఇతర సమాచారము కొరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారులను (District Co-ordinators) లేదా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయముల ప్రధానాచార్యుల వారిని సంప్రదించగలరు.
II) దరఖాస్తు చేయు విధానం:
  • 1)ఆన్లైన్ లో మాత్రమె ఆసక్తి కల విద్యార్థులు https://apgpcet.apcfss.in ద్వారా దరఖాస్తులు సమర్పించవలయును.
  • 2)తేది 17-06-2021 నుండి 07-07-2021 వరకు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించడము జరుగుతుంది. తేదీ 07-07-2021 తరువాత దరఖాస్తులు స్వీకరించడము జరగదు.
  • 3) విద్యార్ధులు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గాని (లేదా) దగ్గరలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా గాని దరఖాస్తులు సమర్పించవలయును.
  • 4) దరఖాస్తు చేయుటకు ఎటువంటి రుసుమును చెల్లించనవసరములేదు.
  • 5) ఆన్ లైన్ దరఖాస్తులో విద్యార్ధి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకొన్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.
  • 6) ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత, ఎటువంటి మార్పులకు 
  • అవకాశము ఉండదు. 
IV) ఎంపిక విధానము :
2021-22 విద్యా సంవత్సరమునకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశము కొరకు దరఖాస్తు చేసుకొన్న బాలురు మరియు బాలికలకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో వారు సాధించిన మార్కుల ఆధారంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో సీట్లు కేటాయించడము జరుగుతుంది. ప్రవేశ పరీక్ష తేదీని తదుపరి దరఖాస్తుదారుల రిజిస్టర్డ్ సెల్ ఫోనుకు మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అధ్వర్యంలో నిర్వహించబడుతున్న విద్యాలయముల వివరములు, జిల్లా సమన్వయ అధికారుల (District Co-ordinators) ఫోన్ నెంబర్లు మరియు ఈ విద్యాలయములలో విద్యార్ధులకు అందిస్తున్న సౌకర్యాల వివరాలు పట్టికలు - A, B, C లనందు తెలపబడినవి.

MOBILE NUMBERS OF DISTRICT CO-ORDINATORS OF APSWREI SOCIETY

DISTRICT and MOBILE NUMBER 
  • SRIKAKULAM 7995562112
  • VIZIANAGARAM 7995562113
  • VISAKHAPATNAM 7995562114
  • EAST GODAVARI 7995562115
  • WEST GODAVARI 7995562116
  • KRISHNA 8008003622
  • GUNTUR 7995562118
  • PRAKASAM 7995562119
  • NELLORE 7995562120
  • CHITTOOR 7995562127
  • ANANTAPUR 9949354106
  • YSR KADAPA 7995562124
  • KURNOOL 7995562125
THE FOLLOWING FACILITIES WILL BE PROVIDED TO THE STUDENTS:
  • Free Education, Free boarding and lodging. 
  • 4-pairs of Uniforms, 2-pairs of shoes, 3-pairs of socks, belt for each student, Bedding Material, Note Books, Plate, Glass & Katoras. Computer Labs & Science labs. Cosmetic charges. Hair cutting charges for boy students.
  • Computer Education 
  • Digital Class Rooms.