Maternity Leave Rules in Telugu - మహిళా ఉద్యోగుల 180 రోజుల మెటర్నిటీ లీవ్ (ప్రసూతి సెలవు )

Maternity Leave Rules in Detail already discussed in our one of the previous Post. Here the Maternity Leave Rules are discussed in detailed in Telugu - మహిళా ఉద్యోగుల 180 రోజుల మెటర్నిటీ లీవ్ (ప్రసూతి సెలవు ) AP FR 101 ప్రకారం ప్రతీ మహిళా ఉద్యోగినికి నిబంధనలకు లోబడి 180 రోజులకు ప్రసూతి సెలవు పొందుటకు అర్హత ఉంది G.O. Ms No. 152 Fin (FRI) Dept Dated 5.2.2010

Maternity Leave Rules in Telugu - మహిళా ఉద్యోగుల  180 రోజుల మెటర్నిటీ లీవ్  (ప్రసూతి సెలవు ) 

డిపార్టుమెంటులు వారీగా మెటర్నిసెలవులు వర్తింపు గురించి తెలుసుకుందాం
  1. ఈ సెలవుల గురించి ప్రస్తావన AP Fundamental Rules లో రూల్ 101 లో కలదు.
  2. G.O. Ms No. 152 ఫైనాన్సు (FRI) డిపార్టుమెంటు తేది 5.2.2010 ద్వారా 2010 వేతన స్కేల్ ల ప్రకారం మెటర్నిటీ సెలవు ను ప్రతీ మహిళా ఉద్యోగినికి నిబంధనలకు లోబడి 180 రోజులకు పెంచడం జరిగింది.
  3. అలాగే AP Social Welfare Residential Educational Institutions APSWREI లో పని చేస్తున్న మహిళా ఉద్యోగునులు అందిఅర్కి ఈ సెలవు ను వర్తింప చేస్తూ GO Ms No 50 Social Welfare Department Dated 17.5.2014 న ఉత్తర్వులు జారీ చేసింది.
  4. అదే విధంగా GO Ms No 17 Finance Department Dated 31.1.2019 ద్వారా కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు కుడా ఈ సెలవులను వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు
  5. అలాగే గ్రామ వార్డ్ సచివాలయాలలో పని చేస్తున్న వార్డ్ సెక్రెటరీ లు అందరికి కూడా ఈ 180 రోజుల ప్రసూతి సెలవును వర్తింప చేస్తూ GO Ms No 4 Dated 25.9.2020 న GSWS Department ఉత్తర్వులు జారీ చేసింది.
ఐతే ఇప్పుడు ఈ ప్రసూతి సెలవు పొందుటకు నిబంధనలు గురించి తెలుసుకుందాం.
  1. వివాహిత అయిన ప్రతీ మహిళా ఉద్యోగి పెర్మనెంట్ అయిన , టెంపరరీ అయినా కాన్పుకు 2010 వేతన స్కేల్ ల ప్రకారం 180 రోజుల ప్రసూతి సెలవు కు అర్హులు
  2. GO.38 Finance and Planning Dated. 18-3-1992 ప్రకారం ఈ సెలవు సజీవంగా ఉన్న ఒక బిడ్డ కలవారికి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఎన్నవ కాన్పు అన్న దానితో సంబంధం లేకుండా, అప్పటికి ఒక్క బిడ్డ మాత్రమె సజీవంగా ఉన్న సందర్భంలో వారు ప్రసూతి సెలవు పొందవచ్చు.
  3. ఐతే GO.37 Finance and Planning Department Dated 26-2-1996 ప్రకారం Maternity Leave is allowed irrespective of the number of children born in the second confinement అని ఉంది. అనగా ఈ ఉత్తర్వులు ప్రకారం రెండవ కాన్పులో కవలలు లేదా ఎంత మంది పుట్టినా వారు ఆ కాన్పుకు ప్రసూతి సెలవుకు అర్ధులు
ఇప్పుడు మనం ఈ ప్రసూతి సెలవు వినియోగం గురించి ఉన్న నిబంధనలు తెలుసుకుందాం
  • ప్రసూతి సెలవు ఎప్పటినుండి ఇవ్వవచ్చు అన్న అంశంపై చాలామందికి అనుమానాలున్నాయి. ప్రసవం జరిగిన రోజు నుంచా, లేక అంతకు ముందు నుంచి ఉద్యోగిని అభ్యర్థన మేరకు ప్రసూతి సెలవులో వెళ్ళవచ్చా అను సంశయం చాలామంది కి రావటం సహజం.
  • మెటర్నిటీ లీవ్ ఎప్పటి నుండి పెట్టుకోవాలి అన్న విషయం పై జీవో లలో ఎక్కడా స్పస్తమైన ప్రస్తావన లేదు.
  • G.O.Ms.No. 38 Fin & Pig Dept. dt. 13-8-1992 ప్రకారం ఇద్దరి కంటె తక్కువ సంతతికల ఉద్యోగినుల Confinement కోసం ప్రసూతి సెలవు మంజూరు చేయవచ్చు అను నియమం వుంది.
  • Confinement అను పదమునకు పదకోశం (Dictionary) ప్రకారం మంచానపడి (Bedridden) , నిర్బంధం (Detention) , ప్రసవం (Delivery) అను మూడు అర్ధాలున్నాయి. కాన్పుకోసం ఆసుపత్రిలో చేరినా, కాన్పుకు ముందు అనారోగ్య పీడితురాలైనా అట్టి తేది నుంచి ప్రసూతి సెలవు మంజూరు చేయుటకు అభ్యంతరం వుండకూడదు.
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు , ప్రసూతి సమయానికి ఆరు వారాల ముందు నుండే ప్రసూతి సెలవు పెట్టుకునే అవకాశం ఉంది..
  • DSE L Dis No 1941/G2/90, Dated 11.6.1990 ప్రకారం మృత శిశువు ను ప్రసవించిన లేదా ప్రసవం అనంతరం శిశువు మరణించినా ప్రసూతి సెలవు ను వినియోగించు కోవచ్చు.
ఇప్పుడు ప్రసూతి సెలవు మరియు వాటిని ఇతర సెలవులతో కలిపి వినియోగం గురించి తెలుసుకుందాం

  • Subsidiary Rule 2, FR 101(a) ప్రకారం,శిశువు లేదా తల్లి ఆరోగ్య పరిస్థితి ని బట్టి వైద్య దృవపత్రం ఆధారంగా, ఇతర సెలవులతో కలిపి ప్రసూతి సెలవుకు (ముందు లేదా వెనక ) కలిపి వాడుకోవచ్చు.
  • FR 101 A (b) ప్రకారం ప్రసూతి సెలవు కాలాన్ని ఉద్యోగిని ఆర్జిత సెలవు , అర్ధ జీతం సెలవుల ఖాతా నుండి తగ్గించడానికి వీలు లేదు.
  • GO.463 PRIMARY & SECONDARY EDUCATION (H) DEPARTMEN Dated 4.5.1979 & మేమో 18136/SE Dated 12.1.2005 ప్రకారం విద్యా శాఖ వంటి వేసవి సెలవులు ఉండే వెకేషన్ డిపార్టుమెంటు లలో వేసవి సెలవుల మధ్య లో ప్రసవిస్తే , ప్రసవ తేది నుండి 180 రోజులు ప్రసూతి శెలవులు వాడుకోవచ్చు. అయితే వేసవిసెలవుల మధ్యలో ఈ ప్రసూతి సెలవు 180 రోజులు సెలవు పూర్తీ అయితే, రీ ఓపెనింగ్ నాడు విధులలో చేరాలి.
  • అదే విధంగా కొత్తగా జన్మించిన బిడ్డ అనారోగ్య స్థితి లో ఉన్న యెడల, వైద్య దృవపత్రం పై ఇతర సెలవులతో కలిపి వాడవచ్చు. G.O.Ms.No.2391, Fin., Dt.03.10.1960. అయితే ఇవి కేవలం వైద్య దృవపత్రం మీద మాత్రమే ఈ విధంగా ఇతర సెలవులతో కలిపి వినియోగించుకోవచ్చు అన్న విషయం గమనించాలి
  • అప్రయత్న గర్భస్రావం జరిగిన యెడల 6 వారాలకు మించ కుండ అబార్షన్ సెలవు కు అర్హత ఉంటుంది. ఐతే ఈ సెలవు గురించి ఇంకో వీడియో లో పూర్తిగా తెలుసుకుందాం.
ప్రసూతి సెలవు లో– జీత భత్యాలు- ఇంక్రిమెంట్లు - తదితర 
  • Subsidiary Rule -1 FR 101 ప్రకారం ప్రసూతి సెలవులో ఉన్న వారికి పూర్తీ జీతం చెల్లించాలి
  • AP Leave Rules 1933 పరిధిలో కి వచ్చే ఉద్యోగిని లు, Rule 10 - FR 44 ప్రకారం సెలవులో వెళ్ళే నాటికి వరకు పొందుతున్న అన్ని Compensatory భత్యాలు పొందవచ్చు
  • Memo. No. 49643-A2/111-FR-II-74-1 Date: 6-10-1974 పాయింట్ 1 , మరియు Lr 853/FR-2/2012 Dated 22.01.2013 లో ఆర్దిక శాఖ ఇచ్చిన వివరణ ప్రకారం ప్రసూతి సెలవు మద్యలో ఇంక్రిమెంట్ వచ్చినా కూడా సెలవులో ఇంక్రిమెంట్ ఇవ్వబడదు. ప్రసూతి సెలవు పూర్తి అయిన తరువాత విధులలో చేరిన తేది నుండి మాత్రమె ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుంది.
  • అనగా ఉదాహరణకి అక్టోబర్ లో ప్రసూతి సెలవులో వెళ్ళిన ఉద్యోగి కి నవంబర్ లో ఇంక్రిమెంట్ ఉన్న యెడల అది ఆ నవంబర్ లో ఇవ్వరాదు. ఈ ఇంక్రిమెంట్ తేది మారనప్పటికి, ఆ సంవత్సరానికి మానిటరీ బెనిఫిట్ మాత్రం , ఈ ప్రసూతి సెలవు పూర్తి చేసుకొని తిరిగి విధులలో ఏ తేదిన చేరితే ఆ తేది నుండి ఆ సంవత్సర ఇంక్రిమెంట్ ఇవ్వాలి.
  • అలాగే ప్రసూతి సెలవులో ఉన్న వారికి సెలవు మధ్యలో Automatic Advancement Scheme వచ్చినా, వారికి కూడా ఇంక్రిమెంట్ మంజూరు కు వర్తించిన రూల్స్ లేదా నిబంధనలే వర్తిస్తాయి.
  • Rc 29/C3-4/2003 Dated 25.1.2003 CSE ప్రకారం ప్రసూతి సెలవు మధ్యలో ప్రమోషన్ పొందిన వారు, సెలవు పూర్తీ అయిన తరువాత ప్రమోషన్ పోస్ట్ లో చేరవచ్చు.
  • అదే విధంగా ప్రసూతి సెలవులో ఉన్న వారు సెలవు మధ్యలో బదిలీ పొందిన యెడల వారు ప్రసూతి సెలవు పూర్తీ చేసుకున్న తరువాత కొత్త స్థానంలో విధులలో చేరవచ్చును
  • అలాగే ప్రబెషన్ కాలంలో కూడా ప్రసూతి సెలవు పెట్టుకొన వచ్చును. అయితే ప్రోబేషన్ కాలలో ప్రసూతి సెలవు పై వెళ్ళినచో , AP State Subordinate Service Rules ప్రకారం ఆ లీవ్ కాలమునకు ప్రొబేషన్ పొడిగించబడుతుంది .
ప్రసూతి సెలవు – మంజూరు – దరఖాస్తు వివరాలు 
  • ఈ ప్రసూతి సెలవు మంజూరు అధికారం, DDO లకు దఖలు పరచబడింది.
  • ఐతే GO MS No 84 Education Department Dated 17.9.2012 ద్వారా విద్యా శాఖ లో ఈ సెలవులు, మండల విద్యా శాఖ పరిధి అయితే MEO లు, ఉన్నత పాఠ శాల లు అయితే ప్రధాన ఉపాధ్యాయులు మంజూరు అధికారం ఇవ్వబడినది
  • మహిళా ఉద్యోగిని , తమ DDO కు వ్రాత పూర్వక అప్లికేషను, తగిన ఆధారాలతో సమర్పించి ప్రసూతి సెలవు మంజూరు చేయించుకోవాలి.
  • GO Ms No 219 Finance and Planning Dated 25.6.1984 ప్రకారం ఈ ప్రసూతి సెలవు దరఖాస్తు కు కనీసం RMP సర్టిఫికేట్ అయిన జతపరచాలి.
  • Maternity leave అప్లై చేయడానికి ప్రత్యేకంగా ఫార్మాట్ ఏమి లేదు, ఎప్పుడు డెలివరీ అవుతారో / అయ్యారో అని డాక్టర్ దగ్గర సర్టిఫికెట్ తీసుకొని, 6 months మెటర్నిటీ లీవ్ కావాలని అప్లై చేయాలి.
  • ఇది ఫస్ట్ ఇష్యూ లేదా సెకండ్ ఇష్యూ అని తెలియచేయాలి
  • 180 రోజుల సెలవులు అనంతరం, ముందుగానే DDO కు సమాచారం ఇచ్చి , విధులలో చేరాలి