Visakha District D.S.C-2008 SGT (CONTRACT) LIST FOR CERTIFICATE VERIFICATION

జిల్లా విద్యాశాఖాధికారి విశాఖపట్నం వారి కార్యాలయము :: పత్రికా ప్రకటన

Visakha District D.S.C-2008 SGT (CONTRACT) LIST FOR CERTIFICATE VERIFICATION

డి.ఎస్.సి.2008 అభ్యర్థులకు తెలియజేయునది ఏమనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు డి.ఎస్.సి.2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్.జి.టి పోస్టులలో మినిమమ్ టైమ్ స్కేల్ (రూ. 21,230/-) నందు నియమించుటకు ఆదేశములు ఇచ్చియున్నారు. ఈ కార్యాలయమునకు గతములో ఒప్పుగోలు పత్రము ( Willingness) సమర్పించిన వారి జాబితా, మరియు నింపవలసిన చెక్ లిస్టు ఈ కార్యాలయపు వెబ్ సైట్ deovsp.net నందు పొందుపరచడమైనది. ఆయా అభ్యర్థులు వారు పొందిన ర్యాంకుల ఆధారముగా ఈ క్రింద తెలియజేసిన తేదీలలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో మరియు రెండు జెరాక్స్ కాపీలతో నింపబడిన చెక్ లిస్టుతో పరిశీలన నిమిత్తము జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము, విశాఖ వేలీ స్కూల్ జంక్షన్ దగ్గర, విశాఖపట్నం నందు ఉదయం 10.00 గం.లకు హాజరు కావలసినదిగా జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీ బి.లింగేశ్వర రెడ్డి వారు కోరడమైనది.
ర్యాంక్ 306 TO 1918 - Dt 25.06.2021 (110 మంది అభ్యర్థులు) 
ర్యాంక్ 1921 నుండి 8659 వరకు తేది 26.06.2021 (119 మంది అభ్యర్థులు)