పాఠశాలల పునః ప్రారంభం - మార్గదర్శకాలు AP Schools reopening Instructions

పాఠశాలల పునః ప్రారంభం - మార్గదర్శకాలు AP Schools reopening Instructions  As per the instructions of District Educational Officer Krishna District

పాఠశాలల పునః ప్రారంభం - మార్గదర్శకాలు

  • 2-11-20 నుండి 9 & 10, 23-11-20 నుండి 6,7 & 8 వ, 14-12-20 నుండి 1-5 తరగతులుప్రారంభించి 30-4-21 వరకు కొనసాగించాలి. 
  • 1-11-20 న ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ను పరిగణలో తీసుకుంటూ , పాఠశాల నిర్వహణ కొరకు నిర్దిష్ట ప్రణాళిక ను తయారు చేసుకోవాలి.
  • విద్యార్థుల తల్లి తండ్రుల అంగీకారంతో విదార్థులను పాఠశాలకు అనుమతించాలి.
  • తరగతిగది నందు 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండే విధంగా ప్రణాళికను తయారు చేసుకోవాలి. 
  • 9వ తరగతి విద్యార్థులకు రోజు మార్చిరోజు, 10 విద్యార్థులకు ప్రతి రోజూ పాఠశాలకు హాజరు అగునట్లు సూచనలు ఇవ్వాలి.
  • బోధన, బోధనేతర సిబ్బందికి కోవిడ్ -19 జాగ్రత్తలపై తగిన శిక్షణ ఇవ్వాలి. 
  • మాస్క్ ధరించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని మాత్రమే పాఠశాలలోకి అనుమతించాలి
  • విద్యార్థులు, ఉపాధ్యాయులు. ఇతర సిబ్బంది పాఠశాలకు హాజరయ్యే సమయంలో తప్పకుండా ధర్మల్ స్కానింగ్ చేసిన తరువాతనే అనుమతించాలి. 
  • ప్రార్థనా సమావేశంను తరగతి గదిలో మాత్రమే నిర్వహించాలి.అందులో తప్పనిసరిగా కోవిడ్-19 జాగ్రత్తలపై ప్రతిజ్ఞ, ప్రకృతి ప్రతిజ్ఞ, విద్యార్థి భద్రతా ప్రతిజ్ఞ ను తప్పనిసరిగా చేయించాలి
  • గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశంలో మాత్రమే భోధనా కార్యక్రమమం నిర్వహించాలి (పాఠశాల ఆట స్థలంలో నైనా సరే విద్యార్థులను దూరంగా కూర్చోబెట్టి బోదించాలి)
  • ప్రతి గంటకి ఒక మారు టాయిలెట్స్ ను తప్పనిసరిగా శుభ్రపరిచి శానిటైజ్ చేయించాలి. 
  • టాయిలెట్స్ నందు తగినంతగా నీరు, బకెట్ లు, మగ్ లు, లిక్విడ్ సోప్ అందుబాటులో ఉంచాలి. 
  • విద్యార్థులను ఎట్టి పరిస్థితిలోనూ గుంపులుగా కలవనీయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
  • విద్యార్థులు తప్పనిసరిగా వ్యక్తిగతంగా మాస్క్, వాటర్ బాటిల్ ని ఉపయోగించుకునే విధంగా ప్రోత్సహించాలి. 
  • మధ్యాహ్నభోజన విరామం విద్యార్థులందరికి ఒకేసారి కాకుండా, కొద్ది కొద్ది మంది చొప్పున అనుమతించాలి. 
  • బోధన బోధనేతర సిబ్బంది ప్రతిరోజూ బయో మెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేసేలా చూడాలి 
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు, WHO, UNICEF వారి సలహాలు తప్పక పాటిస్తూ పాఠశాలను జాగ్రత్తగా నిర్వహించ వలెనని ప్రధానోపాధ్యాయులను, పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించడమైనది