Compassionate Appointments for Married Daughters - Eligibility - వివాహిత కుమార్తెలు - కారుణ్య నియమకము:

Compassionate Appointments for Married Daughters - Eligibility - వివాహిత కుమార్తెలు - కారుణ్య నియమకము: There are lots of doubts on Compassionate Appointments for Married Daughters. Whether married daughters are eligible to apply for compassionate appointments. If So, what are the conditions.  Dependent Widowed/deserted daughter without receiving any property from husband, only legal heir of the deceased employee and if spouse is not willing to avail benefit

Compassionate Appointments for Married Daughters - Eligibility - వివాహిత కుమార్తెలు - కారుణ్య నియమకము:

వివాహిత కుమార్తెలు - కారుణ్య నియమకము:

వివాహిత కుమార్తెను కారుణ్య నియామకము చేపట్టే విషయములో ప్రభుత్వ మెమో నెం. 40610/A.1/Admn.II/2004, Fin (Admn.ll), తేదీ. 20.03.2004 మరియు ప్రభుత్వ మెమో నెం. 80863/Ser.C/A1/2005-1, GAD (Ser.G), తేదీ. 06.08.2005 లో ఇచ్చిన నిబంధనలను / సూచనలను జాగ్రత్తగా పరిశీలించి నియామకము చేయవలసి ఉన్నది 

వివాహిత కుమార్తెలను కారుణ్య నియమకములో ఉద్యోగము కల్పించు విషయములో, రాష్ట్ర ఆడిట్ శాఖ సంచాలకులు (Director of State Audit) తెలిపిన సంశయాలకు వివరణ ఇస్తూ ప్రభుత్వము మెమో నెం. 406/10/A.1/Admn.II/2004, Fin (Admn.ll), తేదీ. 20.03.2004 ద్వా రా ఈ క్రింది విధముగా ఉత్తర్వులు జారీ చేసినది.

వివాహిత కుమార్తెలు - కారుణ్య నియమకము 
ముఖ్యాంశాలు: 
  • a) భార్య / భర్త (spouse) అనర్హులుగా ఉన్నా, లేక అయిష్టంగా ఉన్నా లేక ఆ కుటుంబములో అవివాహితులుగా చిన్న వారు గాని, పెద్దవారు గాని లేని సందర్భములో,
  • b) ఉద్యోగములో ఉంటూ చనిపోయిన తండ్రి / తల్లి పై వివాహిత కుమార్తె పూర్తిగా ఆధారపడి
  • జీవిస్తు న్న సందర్భములో.
  • c) పై రెండు షరతులకు లోబడి ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తు న్న వివాహిత కుమాలలో,
  • ఒక్కరికి ఉద్యోగ అవకాశము కల్పించవచ్చు.
  • d) పై ప్రభుత్వ ఉత్తర్వులు పేరా 2 ప్రకారము కుమార్తెకు వివాహము అయిన వెంటనే, ఉద్యోగి అయినా నిరుద్యోగి అయినా, ఆమె భర్త నిరుద్యోగి అయినా కూడా ఆమె తల్లిదండ్రు లపై ఆధారపడి జీవిస్తున్న వ్యక్తి కాదు. వివాహిత కుమార్తె పూర్తిగా తండ్రి / తల్లి పై పోషణ నిమిత్తము ఆధార పడి జీవిస్తూ ఉండాలి. భర్త ఆచూకీ సంవత్సరాల తరబడి తెలియకున్నా, లేక అతను చనిపోయినా, భర్త ఏ విధమైనా ఆస్థిపాస్తులు వదిలి ఫైళున్నా, కేవలము వివాహిత కుమార్తె తల్లి / తండ్రి పై ఆధారపడి వారి పోషణలో ఉన్న సందర్బాలలో మాత్రమే కారుణ్య నియమాకాలకు అర్హులు. వివాహిత కుమార్తె కారుణ్య నియామకం విషయమై ప్రభుత్వము నెం. 80863/Ser.G/A1/2005-1, GAD (Ser.G), తేదీ. 06.08.2005 ద్వా రా వివరణ ఇస్తూ , మరణించిన ప్రభుత్వ ఉద్యోగి జీవిత భాగస్వామిని చూసేందుకు వివాహిత కుమార్తెకు కారుణ్య నియామకం అందించబడుతుంది. కానీ, ప్రభుత్వ ఉద్యోగి యొక్క జీవిత భాగస్వామి సజీవంగా లేనప్పుడు, వివాహిత కుమార్తెకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యం పనిచేయదు. అందువల్ల, ప్రభుత్వ ఉద్యోగి చనిపోయి మరియు జీవిత భాగస్వామి కూడా జీవించి లేనటువంటి సందర్భములలో కారుణ్య నియామకాన్ని వివాహిత కుమార్తెలను పరిగణించలేము.
ఉద్యోగములో ఉంటూ చనిపోయిన ఉద్యోగి అవివాహిత కుమార్తె, కారుణ నియామకము కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత, పాలనపర జాప్యము వలన సకాలములో ఉద్యోగ ఉత్తర్వులు జారీకాని సందర్భములో, ఈ లోగా ఆమె వివాహము చేసుకొన్ననూ, ఆమె కారుణ్య నియమకానికి అర్హ్పు రాలు (ప్రభుత్వ మెమో నెం. 55769 Ser.A/93-3, GA(Ser.A) Department తేదీ. 27.01.2000).