Age Limit for Compassionate Appointments - Min and Max Age for Compassionate Appointments

Age Limit for Compassionate Appointments - Min and Max Age for Compassionate Appointments. There are a lot of doubts on Minimum Age and Maximum AGe limit for compassionate appointments. What should be the minimum and maximum age. Here are the Detailed clarifications with reference to government orders on Age limit for Compassionate appointments. In General Min age is 18 Years and Max age is 42 years. Read the details below

Age Limit for Compassionate Appointments - Min and Max Age for Compassionate Appointments

కారుణ్య నియామకములు కనిష్ట మరియు గరిష్ట వయస్సు:
  • కారుణ్య నియామకములు నేరుగా నియమించేవి (Direct recruitment) గా నిర్ణయిస్తూ ప్రభుత్వ మెమో నెం. 536/Ser.A/96-1 GA(Ser.A) తేదీ. 09.10.1996 ద్వారా ఉత్తర్వులు జారీ చేయబడ్డవి. కావున ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1996 నియమ నిబంధనలు ఈ విషయములో వర్తిస్తాయి.
  • పై నిబంధనలలో గల రూలు 12(V) మేరకు 18 సంవత్సరాలు తక్కువగాను మరియు 34 సంవత్సరాలకు మించి వయస్సు ఉన్న వారు నియమకమునకు అనర్హులు.
  • కానీ ఒకవేళ చనిపోయిన ఉద్యోగిపై ఆధారపడిన పిల్లలు మైనర్లు అనగా 16 సంవత్సరాలు ఉన్నట్లు అయితే, అట్టి విషయము ఉద్యోగి చనిపోయిన వెంటనే, ఉద్యోగము కొరకు ధరఖాస్తు చేయవలసి ఉంటుంది. తదుపరి మైనారిటీ తీరి 18 సంవత్సరాలు నిండి మేజరు అయిన వెంటనే ఉద్యోగము కొరకు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. అనగా 18 సంవత్సరాల వయస్సును నిండిన తరువాతే, కారుణ్య నియామకం కోసం పరిగణించబడుతుంది ( G.O. Ms. No. 165 GA (Ser.A), తేదీ. 20.03.1989 మరియప్రభుత్వ మెమో నెం. 60681/Ser.A/2003-1 తేదీ: 12-8-2003
  • గరిష్ట వయస్సు విషయమై, G.O. Ms. No. 132, GA (Ser.A) department, తేదీ. 15.10.2018 ద్వారా 42 సంవత్సరాలుగా ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసినది. SC/ST/PHC అభ్యర్ధు లకు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1996 నందలి 12 V (b) (i) (ii) నందు తెలియజేసిన విధముగా అదనపు వయస్సు 42 సంవత్సరములకు అదనముగా పొందుటకు అర్హులు. పై హెచ్చించిన గరిష్ట వయస్సు, యూనిఫారం సర్వీసు యందు పని చేయు పోలీసు ఉద్యోగులకు, అబ్కారి, అగ్ని మాపకదళం, అటవీశాఖా మరియు రవాణా శాఖ ఉద్యోగులకు వర్తించదు. కానీ అట్టి ఉత్తర్వులు తేదీ. 30.09.2021 వరకు అమలులో ఉంటుందని పేర్కొని ఉన్నారు తదనంతరము గరిష్ట వయస్సు 34 సంవత్సరములుగా ఉండును. కావున గరిష్ట వయస్సు ఏ తేదీ వరకు అమలులో ఉంటుందో ప్రభుత్వ ఉత్తర్వులను జాగ్రత్తగా పరశీలించవలసి ఉంటుంది.
  • సర్వీస్ లో ఉంటూ చనిపోయిన ఉద్యోగి భర్త / భార్య (Spouse) కు కారుణ్య నియామకములో ఉద్యోగము ఇచ్చుటకు అన్ని కులముల వారికి గరిష్ట వయస్సు 45 సంవత్సరములుగా నిర్ణయిస్తూ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసి ఉన్నది. (G.O. Ms. No. 144 GA (Ser.D) department, తేదీ. 15.06.2004).
  • ఉద్యోగము కోసం ధరఖాస్తు చేసుకున్న నాటికవయస్సు నియమ నిబంధనలు మేరకు ఉన్నప్పటికీ, అతనికి ఉద్యోగము ఇచ్చు ఉత్తర్వులు జారీ చేయు నాటికి గరిష్ట వయస్సు మించినప్పటికీ అతనికి / ఆమెకు ఉద్యోగము కల్పించవచ్చును.
  • ధరఖాస్తుదారుని యొక్క కనిష్ట మరియు గరిష్ట వయస్సు ను లెక్కించుటకు ఉద్యోగి చనిపోయిన సంవత్సరము లోపల ఏ తేదీనైతే ధరఖాస్తు చేసినారో, ఆ తేదీ నుండి వయస్సును లెక్కించవలసి ఉంటుంది.
  • చనిపోయిన ఉద్యోగి భర్త / భార్య (Spouse) విషయములో గరిష్ట వయస్సు లెక్కించుటకు ప్రభుత్వ ఉత్తర్వులు సర్క్యులర్ మెమో నెం. 3731/Ser.A/202-3 GA (Ser.A) Department తేదీ. 11.12.2003 మేరకు గరిష్ట వయస్సు ఉద్యోగి చనిపోయిన సంవత్సరము లోపల ధరఖాస్తు చేసిన సంవత్సరములోనే జూలై నెల ఒకటవ తేదీ నుండి లెక్కించవలసి ఉంది