కేబినేట్ సమావేశంలో సిపిఎస్ రద్దు పై తీర్మానం చెయ్యాలి- FAPTO

సెప్టెంబర్ 6వ తేదీన జరుగబోయే కేబినేట్ సమావేశంలో సిపిఎస్ రద్దు పై చర్చించి తీర్మానం చెయ్యాలి - FAPTO. 
Letter to Ministers of Andhra Pradesh from FAPTO on Abolish of CPS. FAPTO represented All the Ministers of AP in an open letter for discussing in Cabinet Meeting and Take a decision for Abolish of CPS and restoration of OPS to All employees.

కేబినేట్ సమావేశంలో సిపిఎస్ రద్దు పై తీర్మానం చెయ్యాలి- FAPTO


శ్రీయుతులు ..................
ఆంధ్రప్రదేశ్.
ఆర్యా !

  • 01.09. 2004 నుండి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం రద్దు అయ్యి కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం అమలులోకి వచ్చింది. అప్పటివరకు ఉద్యోగి రిటైర్మెంట్ అయిన నెలలో తీసుకున్న జీతంలో సగం పెన్షన్ గా ఇచ్చేవారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంలో ఉద్యోగులు జీతం నుండి 10శాతం అంతే మొత్తం ప్రభుత్వం జమ చేసినా మొత్తం సొమ్ము ఎన్ఎస్డీఎల్ ద్వారా షేర్ మార్కెట్ లోకి వెళ్ళడం వల్ల రిటైర్ అయిన తర్వాత కనీస పెన్షన్ గ్యారెంటీ లేకుండాపోయింది. | మన రాష్ట్రంలో 1,86,000మంది సిపిఎస్ పథకంలో ఉన్నారు. వారు రిటైర్ అయిన తర్వాత కనీస పెన్షన్ గ్యారెంటీ లేక వారు, వారి కుటుంబ సభ్యులు వృద్ధాప్యంలో కనీస ఆర్ధిక భద్రత కోల్పోయారు. | బ్రిటిష్ కాలం నుండి పెన్షన్ ఉంది. ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత గౌరవంగా జీవనం గడిపేందుకు యాజమాన్యం పెన్షన్ చెల్లించాలని సుప్రీంకోర్టు 1982లోనే తీర్పునిచ్చింది. కావున ఉద్యోగుల ప్రయోజనాలు ఫణంగా పెట్టి కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు చేయాలని కోరుతున్నాం.
  • ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంలో ప్రభుత్వం చెల్లించే 10% వాటా రాబోయే సంవత్సరాల్లో వేలకోట్లు రూపాయలుగా మారి ఖజనాపై భారంపడే పరిస్థితి ఉంది.
  • ప్రజల్లో భాగమైన ఉద్యోగుల సంక్షేమం చూడాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ (డిఫైన్డ్ పెన్షన్) విధానం పునరుద్దరించాలని కోరుతున్నాము.
  • రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేయాలని అనేక రూపాల్లో ప్రాతినిధ్యాలు, నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు వేలాదిమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ ఆందోళనలు తెలియజేశారు.
  • ప్రజల్లో భాగమైన ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఆవేదనను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వంలో కేబినేట్ మంత్రివర్యులుగా ప్రధానభూమిక పోషిస్తున్న మీరు సెప్టెంబర్ 6వ తేదీన జరుగబోయే కేబినేట్ సమావేశంలో సిపిఎస్ రద్దు చేయాలనే విజ్ఞప్తిపై చర్చించాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పాత పెన్షన్ పునరుద్దరించేందుకు తగిన చర్యలు తీసుకుని ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన ఉండాలని కోరుతున్నాం. ..