AP Grama Volunteer Job Chart Duty Chart Work Details
- వలంటీరుగా నియమితులయ్యే వారు తమకు కేటాయించిన ప్రతి 50 ఇళ్ల వద్దకు తరుచూ వెళ్లి ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలకు అనుగుణంగా వారి స్థితిగతులపై సమాచారం సేకరించాలి. సేకరించిన సమాచారాన్ని గ్రామ– వార్డు సచివాలయం లేదా సంబంధిత అధికారికి అందజేయాలి.
- తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి అందే వినతులు, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామ–వార్డు సచివాలయంతో పాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి పని చేయాలి. అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంలో, సంబంధిత సమస్య పరిష్కారంలో సంధానకర్తగా వ్యవహరించాలి. వివిధ శాఖలకు అందే వినతుల పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా పనిచేయాలి.
- తమ పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయాన్ని వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేయాలి.
- 50 కుటుంబాల పరిధిలో సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత ఉండి, వారికి ఆ పథకం అందనప్పుడు దానిపై వారికి అవగాహన కలిగించి, లబ్ధిదారునిగా ఎంపికకు సహాయకారిగా ఉండాలి.
- గ్రామ– వార్డు సచివాలయం ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు హాజరవుతూ.. తనకు కేటాయించిన 50 ఇళ్ల వారి సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్‌ను తయారు చేసి అధికారులకు అందజేయాలి.
- ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు, ఇతరత్రా సహాయం పొందిన కుటుంబాల జాబితాను తన వద్ద రికార్డు రూపంలో ఉంచుకోవాలి.
- తన పరిధిలోని 50 కుటుంబాల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా.. విద్య, ఆరోగ్య పరంగా ఎప్పటికప్పుడు వారికి చైతన్యం కలిగించాలి. వృత్తి నైపుణ్యాల గురించి తెలియజేస్తుండాలి.
- తన పరిధిలోని ఇళ్లకు సంబంధించి రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి కాల్వల పరిశుభ్రత, మంచినీటి అవసరాల పరిష్కారం కోసం పనిచేయాలి.