Agency Scheduled Area Visakha Dist School Asst Promotions Seniority Lists
జిల్లా విద్యాశాఖాధికారి విశాఖపట్నం వారి కార్యాలయము
పత్రికా ప్రకటన
ఇందు మూలముగా విశాఖపట్నం జిల్లా షెడ్యూల్డ్ ప్రాంతములో విధులు నిర్వహిస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతికి సంబంధించిన సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖాధికారి వారి వెబ్ సైట్ (deovsp.net) నందు పొందుపరచడమైనది. మరియు సదరు జాబితాలో తెలియజేయబడిన ఉపాధ్యాయులు సేవా పుస్తకము మరియు విద్యార్హతలు, మరియు కుల ధృవీకరణ పత్రములతో పరిశీలనార్ధము పూర్తి వివరములతో తేది 18.07.2019 ఉదయం 10.00 గం.ల కు జిల్లా విద్యాశాఖాధికారి, విశాఖపట్నం వారి కార్యాలయము నందు హాజరు కావలసిందిగా కోరడమైనది. మరియు సదరు సీనియారిటీ జాబితాలో ఏమైనా అభ్యంతరములున్నచో పూర్తి ఆధారములతో అప్పీళ్లను కార్యాలయపు పనివేళలలో తేది 18.07.2019 లోగా సమర్పించవలసినదిగా కోరడమైనది. నిర్ణీత గడువులోగా సమర్పించని అప్పీళ్ళు పరిశీలింపబడవని జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీ బి.లింగేశ్వర రెడ్డి గారు తెలియజేసినారు.
Revised Seniority Lists: