District Wise Logins for AMMA Vodi Students DATA Entry
- SRIKAKULAM, VIZIANAGARAM, VISAKHAPATNAM EAST GODAVARI - Click Here To Login
- WEST GODAVARI, KRISHNA, GUNTUR - Click Here To Login
- PRAKASAM, NELLORE, KADAPA - Click Here To Login
- KURNOOL, ANANTAPUR, CHITTOOR - Click Here To Login
AMMA VODI Online Website Step by Step Detailed Process at APCFSS Rc 242
ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019 తేది : 22.11.2019
- విషయం : పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20 విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు.
నిర్దేశములు :
- 1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-II) వారి ఉత్తర్వులు నెం. 79, తేది : 4.11.2019
- 2. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 16.11.2019 ఆదేశములు
- 'జగనన్న అమ్మ ఒడి' కార్యక్రమం అమలులో భాగంగా అర్హులైన తల్లుల/ సంరక్షకుల జాబితాను సిద్ధం చేసేందుకు పై సూచిక 2లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
- పరిపాలన సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకుని, పై సూచిక 2 లోని ఆదేశములకు కొనసాగింపుగా ఈ దిగువ సూచనలను ఇవ్వడమైనది.
- పై సూచిక 1లోని ఆదేశాలను అనుసరించి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 17.11.2019 నుండి 21.11.2019 మధ్య కాలంలో తమ తమ పాఠశాలలోని విద్యార్థుల వివరములను చైల్డ్ ఇన్ఫోనందు నమోదు/ నవీకరణ చేయడమైనది.www.apteachers.in ఆ విధంగా చైల్డ్ ఇన్ఫోలోని విద్యార్థుల వివరములు 21.11.2019న ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారికి అందించడమైనది.
- ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారి ద్వారా తల్లుల లేదా సంరక్షకుల వివరాలను జతపరచటం 1. ఎపి ఆన్ లైన్ ద్వారా తమకు అందిన చైల్డ్ ఇన్ఫోను ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు రేషన్ కార్డుల జాబితాతో మరియు ప్రజాసాధికార సర్వే సమాచారంతో సరిపోల్చి తెల్ల రేషన్ కార్డులో ఉన్న తల్లుల లేదా సంరక్షకుల వివరాలను సేకరించి ఆ మొత్తం సమాచారాన్ని ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు విద్యార్థి వారీగా అనుసంధానం చేస్తారు.
- 2. ఈ కార్యక్రమం 23.11.2019 నాటికి పూర్తి చేసి ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు ప్రతి ప్రధానోపాధ్యాయుడికి 'లాగ్ ఇన్ ఐడి' మరియు 'పాస్ వర్డ్ ద్వారా 24.11.2019న అందచేస్తారు.
- 3. ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు ప్రధానోపాధ్యాయుడికి అందచేసే ఈ సమాచారం పాఠశాలలోని తరగతి విద్యార్థుల వారీగా ఉంటుంది.
- 4. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా అందిన వివరాలను సరిపోల్చుకొనుట, నమోదు చేయుట మరియు ధృవీకరించుకొనుటకు విద్యార్థుల, తల్లి/ సంరక్షకుల పేరు, ఆధార్ నంబరు మరియు బ్యాంకు ఆ 'హార్డ్ కాపీ'లను సంబంధిత విద్యా, సంక్షేమ సహాయకుడు/ క్లస్టర్ రిసోర్సు పర్సన్ తమ మండల విద్యాశాఖాధికారికి నేరుగా అందచేయాలి. ఖాతా వివరములను 24.11.2019 లోపు సేకరించి, ఆన్ లైన్ లో నమోదు చేయుటకు సిద్ధంగా ఉండవలెను.
- 5. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా తమకు అందిన సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. తరగతి వారీగా విద్యార్థుల వివరములు సరిపోల్చుకుంటూ వారి తల్లి/ సంరక్షకుడు వివరములను (తల్లి/ సంరక్షకుని పేరు, ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా వివరములు) నమోదు చేయాలి. ఒకవేళ ఆ వివరములన్నీ ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా తమకు అందిన సమాచారంలో ముందుగానే పొందుపరచి ఉంటే వాటిని ధృవీకరించుకోవాలి. ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకోవాలి. (వాడుక సూచికను జతపరచడమైనది) ఆ విధంగా వివరములు నమోదు పరిచిన తరువాత విద్యార్థుల స్వగ్రామాల మరియు మండలాల వారీగా సంబంధిత విద్యార్థుల మరియు తల్లులు/ సంరక్షకుల జాబితాను సదరు మండల విద్యాశాఖాధికారికి పంపవలసి ఉంటుంది.
- 6. 100 లోపు విద్యార్థులు గల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ సమాచారాన్ని 25.11.2019 లోగా విద్యార్థుల స్వగ్రామాలకు సంబంధించిన మండల విద్యాశాఖాధికారి వారికి పంపాలి. 101 నుండి 300 లోపు విద్యార్థులు గల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ సమాచారాన్ని 26.11.2019 లోగా విద్యార్థుల స్వగ్రామాలకు సంబంధించిన మండల విద్యాశాఖాధికారి వారికి పంపాలి. 300 లకు పైగా విద్యార్థులు గల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ సమాచారాన్ని 27.11.2019 లోగా విద్యార్థుల స్వగ్రామాలకు సంబంధించిన మండల విద్యాశాఖాధికారి వారికి పంపాలి.www.apteachers.in ప్రధానోపాధ్యాయుడు ధృవీకరించిన సమాచారం వారివారి స్వగ్రామానికి సంబంధించిన మండల విద్యాశాఖాధికారికి స్వయంచాలకంగా (ఆటోమేటిగ్గా) చేరుతుంది.
- 7. ఆ విధంగా మండల విద్యాశాఖాధికారి వారికి రాష్ట్రంలోని వివిధ పాఠశాలల నుంచి ఆ మండలంలోని గ్రామాలకు సంబంధించిన విద్యార్థుల, తల్లి/ సంరక్షకుల వివరములు చేరుతాయి. మండల విద్యాశాఖాధికారి తమకు చేరిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారి సిబ్బంది ద్వారా గ్రామాల వార్డులు వారీగా జాబితాలను ముద్రించి సంబంధిత గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకునికి అందజేయాలి. ఒకవేళ గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకుడు అందుబాటులో లేని యెడల ఆ గ్రామ జాబితాలను సంబంధిత క్లస్టర్ రిసోర్సు పర్సను అందజేయాలి.
- 8. గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకుడు/ క్లస్టర్ రిసోర్సు పర్సన్ మండల విద్యాశాఖాధికారి ద్వారా తనకందిన జాబితాలను సంబంధిత గ్రామ, వార్డు వాలంటీర్లకు అందచేయాలి. వారి ద్వారా ఆ సమాచారాన్ని ఆయా కుటుంబాలకు వివరించి తద్వారా ఆ సమాచారంలో లేని వివరాలు అనగా తల్లుల పేర్లు, తెల్ల రేషను కార్డు వివరాలు, ఆధార్ నెంబరు, బాంకు అకౌంటు నెంబరు, ఐఎఫ్ఎస్ సీ కోడు నెంబరు మొదలైన వివరాలను సేకరించాలి. ఆ సమాచారంలో తెల్ల రేషను కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద | అర్హత కలిగిన కుటుంబాలకు చెందిన వారు అవునో కాదో ఆరు అంచెల పరిశీలన (సెక్స్ స్టెప్ వాలిడేషన్) ద్వారా ధృవీకరించుకోవాలి. ఈ కార్యక్రమమంతా 30.11.2019 లోపు పూర్తి చేయాలి.
- 9. ఆ విధంగా గ్రామ/ వారు వాలంటీర్లు క్షేత్రస్థాయిలో నమోదు చేసిన/ ధృవీకరించిన సమాచారాన్ని అనగా ఆ 'హార్డ్ కాపీ'లను సంబంధిత విద్యా, సంక్షేమ సహాయకుడు/ క్లస్టర్ రిసోర్సు పర్సన్ తమ మండల విద్యాశాఖాధికారికి నేరుగా అందచేయాలి.
- 10. తదుపరి కార్యాచరణ ప్రణాళికపై ఉత్తర్వులు తదుపరి కార్యావర్తనముల ద్వారా తెలియజేయబడతాయి.
- 11. రాష్ట్రంలోని అందరు జిల్లా విద్యాశాఖాధికారులు మరియు సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లు, డివిజనల్, మండల విద్యాశాఖాధికార్లు, క్లస్టర్ రిసోర్సు పర్సన్లు మరియు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, రాష్ట్ర స్థాయి పరిశీలకులు పూర్తి శ్రద్ధతో పై విధి విధానాలను అత్యంత జాగరూకతతో అమలుచేయవలసినదిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది.
అయ్యా,
ReplyDeleteనా పేరు మతుర్తి ఉషారాణి, నేను ప్రభుత్వం ప్రకటించిన "అమ్మ ఒడి" పధకానికి దరఖాస్తు చెయ్యగా నా పేరు మీద 4 విల్లర్ ఉన్నదని, అందువల్ల నేను అర్హురాలిని కాను అని వివరించారు. నాకు ఇప్పటి వరకు ఎలాంటి 4 విల్లర్ లేదు.
స్కూల్ యాజమాన్యం నన్ను గ్రామా సచివాలయం వెళ్లి వారి ద్వారా మార్పు చేసుకొమ్మని చెప్పారు. గ్రామా సచివాలయం వెళ్లి అడుగగా R T O ఆఫీస్ కి వెళ్లి వారి ద్వారా 4 విల్లర్ లేనట్టుగా ధ్రువ పత్రం తెచ్చుకోమన్నారు. R T O ఆఫీస్ కి వెళ్లి అడుగగా 4 విల్లర్ ఉన్నదని గ్రామా సచివాలయం వారు చెప్పారు కావునా బండి నెంబర్ తెచ్చుకోమని , తమ వద్ద డేటా ఉండదని తెలిపారు. తిరిగి గ్రామా సచివాలయంకి వెళ్లి అడుగగా తమ వద్ద కూడా డేటా ఉండదని స్కూల్ యాజమాన్యం ని వెళ్లి అడుగుమని చెపుతున్నారు. స్కూల్ యాజమాన్యం ని వెళ్లి అడుగగా మా దగ్గర కూడా డేటా ఉండదని అంటున్నారు.
దయచేసి నా సమస్యను అర్ధం చేసుకొని నాకు సలహా/ సూచనలు ఇవ్వవలసిందిగా పార్ధిస్తున్నాను.
good Jagananna Amma Vodi information.
ReplyDeleteDear sir we have so many of invalid account number child details at my school, they did not show in account updation format to rectify them. so now they did not get amount into their accounts.. can this be resolved in coming days
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteSPANDHA LO KUDA APPLY CHESANU
ReplyDeleteMake lack of attendance and vachindi. Malli school login vachinapudu update cheyinchukovacha?
ReplyDelete