VOWIFI Voice Over Wifi Calls Solution for Mobile Calls in No Network Areas
వైఫైతో ఫోన్ కాల్
నెట్‌వర్క్ కవరేజీ లేకున్నా పర్లేదు త్వరలో అందుబాటులోకి వోవైఫై
టెలికాం రంగాన్ని ఇటీవల కుదిపేసిన ‘కాల్ డ్రాప్’ సమస్యకు పూర్తిగా తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెట్‌వర్క్ కవరేజీ అంతంత మాత్రంగానే ఉన్నా.. వైఫై సహాయంతో వాయిస్ కాల్‌లు మాట్లాడే సదుపాయాన్ని మనదేశంలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు యోచిస్తున్నారు. ‘వోవైఫై’గా పిలిచే ఈ సాంకేతికత భారత టెలికాం రంగంలో మరో భారీ ముందడుగయ్యే అవకాశముంది.వోవైఫై అంటే?
- వోవైఫై పూర్తి పేరు ‘వాయిస్ ఓవర్ వైఫై’. అంటే వైఫై సహాయంతో వాయిస్ కాల్‌లు మాట్లాడటం. మనం ఉన్న ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ కవరేజీ ఎక్కువగా లేకున్నా, సిగ్నల్‌లో పదేపదే హెచ్చుతగ్గులున్నా కాల్ మాట్లాడటంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకుగాను ఈ సాంకేతికతను తీసుకొస్తున్నారు. ఆండ్రాయిడ్(గూగుల్), ఐవోఎస్(యాపిల్) ఇప్పటికే అమెరికాలో వోవైఫైని అనుమతిస్తున్నాయి.
- వోవైఫై కోసం ప్రత్యేకంగా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోనక్కర్లేదు. వైఫై ఉంటే చాలు. మామూలుగా డయల్ ప్యాడ్‌ను ఓపెన్ చేసి కాల్ చేసుకోవచ్చు. నెట్‌వర్క్ కవరేజీ బలహీనంగా ఉంటే వోవైఫై ఆధారంగా కాల్ కొనసాగుతుంది. మాట స్పష్టంగా వినబడుతుంది.
- సాధారణంగా మొబైల్ నెట్‌వర్క్ రద్దీగా ఉన్నప్పుడు కాల్‌లు కలవడం ఇబ్బందిగా మారుతుంది. కొన్నిసార్లు కలిసినా వాటంతటవే కట్ అవుతుంటాయి. సర్వీస్ ప్రొవైడర్లతోపాటు వినియోగదారులకూ తలనొప్పిగా మారిన ఈ కాల్ డ్రాప్ సమస్య వోవైఫై రాకతో తీరే అవకాశముంది.
- వైఫై అందుబాటులో ఉన్నప్పుడు ఉచితంగా కాల్‌లు చేసుకునే వెసులుబాటును ప్రస్తుతం వాట్సప్, స్కైప్, ఫేస్‌బుక్, మెసెంజర్ వంటి యాప్‌లు కల్పిస్తున్నాయి. మొబైల్ ఆపరేటర్లు వోవైఫైని వినియోగంలోకి తీసుకొస్తే వినియోగదారులు ఆ యాప్‌లలోకి ప్రవేశించకుండా నేరుగా వైఫైతో ఫోన్ మాట్లాడొచ్చు
0 comments:
Give Your valuable suggestions and comments