Sports Day Conduct in Schools Guidelines Rc SSa-15024 AP
కొన్ని ముఖ్య సూచనలు:- 1. అందరు జిల్లా విద్యా శాఖ అధికారులు, ఎక్సఆఫీసియో జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారులు మరియు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు అధికారులందరూ క్రీడా దినోత్సవం ది.30.01.2020 తేదీన నిర్వహించుటకు విస్తృత ప్రచారం ఇవ్వవలెను.
- 2. మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవలెను.
- 3.క్రీడా దినోత్సవం జయప్రదంగా నిర్వహించుటకు జిల్లా స్థాయిలో అకడమిక్ మోనిటరింగ్ అధికారి మరియు కమ్యూనిటి మోబలైజేషన్ అధికారి బాధ్యత వహించవలెను.
- 4. మార్గదర్శక సూత్ర్ములు అన్ని పాఠశాలలకు పంపించి అందరు ప్రధానోపాధ్యాయులు కార్యక్రమము విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవలెను.
- 5. క్రీడా దినోత్సవం నిర్వహించడమే కాకుండా దీనికి సంబంధించిన పోటోలతో డాక్యుమెంటేషన్ సమగ్ర శిక్ష కార్యాలయమునకు అందజేయుటకు మండల విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవలెను.
- 6.క్రీడా దినోత్సవ నిర్వహణకు సహాయ గ్రాంటు సమగ్ర శిక్ష కార్యాలయము ద్వారా విడుదల చేయబడును.
మండల స్థాయిలో నిర్వహించవలసిన కార్యక్రమాలు:
- మండలములోని అన్ని పాఠశాలల భాగస్వామ్యం > పాఠశాల స్థాయిలో క్రీడా వారోత్సవాలు నిర్వహించాలి.
- పాఠశాల స్థాయిలో వివిధ విభాగాలలో ప్రతిభ కనబరచిన విద్యార్ధిని, విద్యార్ధులకు మండల స్థాయిలో పోటీలు నిర్వహించాలి. > ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయాలి.
- విద్యార్ధులను అన్ని పోటీలలో పాల్గొనేలా ప్రోత్సాహించాలి.
మండల విద్యాశాఖాధికారుల బాధ్యతలు:
- మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. > నిర్వాహక కమిటీ ఛైర్మన్ గా MEO ఉంటారు.
- సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ మండలములో కమిటీ కన్వీనర్ గా ఉంటారు.
- సీనియర్ ప్రధానోపాధ్యాయులు కమిటీ మెంబర్ గా ఉంటారు. > మండలములోని ముగ్గురు సీనియర్ PETలు మెంబర్లుగా ఉంటారు.
కమిటీ బాధ్యతలు:
- 1, క్రీడా దినోత్సవం నిర్వహించుటకు అన్ని వసతులతో కూడిన ఒక ఉన్నత పాఠశాలను గుర్తించవలెను.
- 2. క్రీడా దినోత్సవం నిర్వహణా రోజుకు వారం రోజుల ముందు ది.23.01.2020న ఒక ప్రకటన ద్వారా అన్ని పాఠశాలలకు సమాచారం ఇవ్వవలెను.
- 3. పాఠశాల స్థాయిలో సెలెక్ట్ కాబడిన విన్నర్స్ మరియు రన్నర్స్ జాబితాలను 28.01.2020 న మండల స్థాయి కమిటీకి అందించవలెను.
- 4. మండల స్థాయి కమిటీ ది.29.01.2020 మరియు 30.01.2020 తేదీలలో మండల స్థాయిలో పోటీలు నిర్వహించవలెను.
- 5. మండల స్థాయి కమిటీ ఆధ్వర్యంలో ది.30-01-2020 తేదీన క్రీడా దినోత్సవం సభలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు బహుమతులు ఇవ్వవలెను.
2019-20 సంవత్సరంలో ఈ క్రింది కేటగిరీలలో మండల స్థాయి, పాఠశాల స్థాయిలో పోటీలు నీర్వహించవలెను.
The current situation is extremely inconvenient for us all of us, a critical number of my partners have failed. Besides, I genuinely don't have any extra money, everything's planned for food. Exactly when I play blackjack for cash on this site https://www.9winz.com/blackjack. The standard concern is that the site has progress and rewards every day, so I am sure that the idea of the site is predictable.
ReplyDelete