Supply of Shoes to School Students - Measuring Students Sizes - Online Details

Rc.No.16021,Dt.18.03.2020 Supply of Shoes to School Students - Jagananna Vidyaa Kaanuka 2021 . ఆర్.సి.నెం, ఎస్.ఎస్ 16021/4/2019 ఎం.ఐ.ఎస్, ఎస్.ఇ.సి. - ఎస్ఎస్ఏ తేది : 18.03.2020 Supply of Shoes to School Students - Measuring Students Sizes - Online Details
విషయం : సమగ్ర శిక్షా - జగనన్న విద్యా కానుక - విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల
పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి నమోదు చేయుట గురించి

Supply of Shoes to School Students - Measuring Students Sizes - Online Details

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక' పేరుతో స్టూడెంట్ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
  • 2. ఇందులో భాగంగా ఒక్కో స్టూడెంట్ కిట్లో మూడు జతల యూనిఫాంలు, ఒక సెట్ నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, బ్యాగు ఉంటాయి.
  • 3. ప్రతి విద్యార్థికి బూట్లు పంపిణీ చేసే ప్రక్రియలో భాగంగా గత సంవత్సరంలో జరిగిన బూట్ల సరఫరాలో ఎదురైన ముఖ్య సమస్య 'బూట్ల సైజు సరిగా ఉండకపోవడం', తద్వారా కొందరు విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు.
  • 4. ఈ సమస్యను అధిగమించేందుకు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టరు వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం కింది సూచనలు పొందుపరచడమైనది. బూట్ల సరఫరా కోసం విద్యార్థుల పాద కొలతలు నమోదులో పాటించాల్సిన సూచనలు
  • విద్యార్థుల పాదాల కొలతలను ఆన్ లైన్ ద్వారా నమోదు చేయుట. ఈ బాధ్యతను సీఆర్పీలకు అప్పగించడమైనది.
  • ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న అమ్మాయిల, అబ్బాయిల పాదాల కొలతలను తీసుకోవాలి.
  • ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థుల వివరాలు అవసరం లేదు.
  • విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశము.. తర్వాతి సంవత్సరానికి అనుగుణంగా (వారి పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని) పాదాల కొలత సైజును పెంచి తీసుకోవాలి.
  • (:: ఉదాహరణకు ఒక విద్యార్థి పాదం ప్రస్తుత సైజు 5ఉంటే కాస్త పెంచి 6 సైజుగా నమోదు చేయాలి)
  • ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో తరగతి ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి. ప్రధానోపాధ్యాయులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్లో హెడ్మాష్టరు లాగిన్ ద్వారా కొలతలు నమోదు చేయాలి. ప్రధానోపాధ్యాయులు/ సీఆర్పీలు ఈ కార్యక్రమాన్ని కచ్చితంగా జరిగేలా బాధ్యత వహించాలి.
  • హెచ్ఎం లాగిన్లలో పొందుపరిచినటువంటి స్క్రీన్ లో 26.03.2020 లోగా నమోదు చేయాలి.