SPD Clarification on JVK Vidya Kanuka Gol Mal Article published in Andhra Jyothi

SPD Clarification on JVK Vidya Kanuka Gol Mal Article published in Andhra Jyothi
విషయం : ఆంధ్రజ్యోతిలో 2021 ఏప్రిల్ 17వ తేదీన ప్రచురితమైన 'విద్యా కానుక'లో గోల్ మాల్!!
వార్త కథనానికి సంబంధించిన వివరణ.

SPD Clarification on JVK Vidya Kanuka Gol Mal Article published in Andhra Jyothi

విషయం : ఆంధ్రజ్యోతిలో 2021 ఏప్రిల్ 17వ తేదీన ప్రచురితమైన 'విద్యా కానుక'లో గోల్ మాల్!!
వార్త కథనానికి సంబంధించిన వివరణ.

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020- 21 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్రటిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక' పేరుతో విజయవంతంగా స్టూడెంట్ కిట్లను సరఫరా చేయడం జరిగింది.

దీనికి సంబంధించి అవినీతి జరిగిందంటూ 17 ఏప్రిల్ 2021న ఆంధ్రజ్యోతిలో 'విద్యా కానుక'లో గోల్ మాల్ !' శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది. ఆ కథనం ప్రకారం ఈ పథకంలో అవినీతి జరిగినట్లు ఆ విషయాన్ని ప్రస్తుత ఎస్పీడీ గౌరవ ముఖ్యమంత్రి గారికి మెయిల్ ద్వారా తెలియజేసినట్లు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత ఎస్పీడీ విద్యా కానుక' పథకానికి సంబంధించి సదరు పత్రికలో పేర్కొన్న విధంగా ఎటువంటి సమాచారం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపలేదు.

సాధారణంగా రాష్ట్రస్థాయి అధికారులకు సంబంధించిన వార్తా కథనాల ప్రచురణకు ముందే సంబంధిత అధికారుల నుండి ఆరోపణలకు సంబంధించిన వివరణను కచ్చితంగా తీసుకోవలసి ఉంటుంది. ఈ కథనం విషయంలో అటువంటి వివరణ కోసం సంబంధిత అధికారి ధృవీకరణ/ వివరణ తీసుకోవలసి ఉంటుంది. అయితే, ప్రస్తుత ఎస్పీడీని సంప్రదించకపోవడం పత్రిక నిబంధనలకు విరుద్ధం.
జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణలో మండల విద్యాశాఖాధికారులు సంబంధిత పాఠశాలలకు సరుకులను సరఫరా చేయడం జరిగింది. ఆ వివరాలను హెచ్ఎం లాగిన్ నందు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పొందుపరచడం జరిగింది. మండల విద్యాశాఖాధికారుల వద్ద ఉన్న రశీదులను అనుసరించి జిల్లా స్థాయిలో, జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు అధికారికంగా ధృవీకరించిన వివరాలు రాష్ట్ర కార్యాలయానికి చేరిన తర్వాత మాత్రమే చెల్లింపులు చేయడం జరిగింది.
'విద్యాకానుక'లో భాగంగా సరుకులను సరఫరా చేసిన ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని కూడా (Factory Verification), టాటా (TATA) ప్రాజెక్టు లిమిటెడ్, ఎఫ్.డి.డి..ఐ (FDDI) లాంటి ప్రముఖ సంస్థల ద్వారా నిర్ధారించడం జరిగింది. అదే విధంగా క్షేత్ర స్థాయిలో సరఫరా అయిన సరుకుల నాణ్యతని CPRE (Central for Paper Research and Evaluation), MSME (Ministry of Micro Small Medium Enterprises), Textile Committee. FDDI (Footwear Design and Development Institute) వంటి సంస్థల ద్వారా నాణ్యత పరీక్షలు (ల్యాబ్ టెస్ట్) నిర్వహించి టెండరులో పొందుపరిచిన నాణ్యతా నిబంధనల ప్రకారమే ఉన్నట్లు వారు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఖరారు చేయడం జరిగింది.

ఆర్థికశాఖ నుంచి సమగ్ర శిక్ష ఏఎస్పీడీకి ఎలాంటి షోకాజ్ నోటీసు, మెమో జారీ చేయలేదు.

కేజీబీవీల్లో చదివే పేద బాలికలకు పంపిణీ చేసే టాయిలెట్ కిట్ల టెండర్లు, కొనుగోళ్లకు సంబంధించి, 2019-20, 2020-21 విద్యా సంవత్సరాలలో సమగ్ర శిక్షాలో రాష్ట్ర కార్యాలయం నుంచి అసలు ఎటువంటి టాయిలెట్ కిట్ల టెండర్లు, కొనుగోలు చేయలేదు.
గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఎంతో పారదర్శకంగా, బాధ్యతాయుతంగా తీసుకుని తొలి విడత విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

సంబంధిత విభాగం నుంచి ముందస్తుగా నిజానిజాలు తెలుసుకోకుండా ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు పత్రికలో ప్రచురించడం జరిగింది. సదరు పత్రిక ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం ద్వారా విద్యాకానుక' కిట్ల సరఫరాకు సంబంధించి దుష్ప్రచారం చేస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. అంతేకాకుండా సదరు పత్రిక ఇటువంటి అవాస్తవమైన, నిరాధారమైన కథనాన్ని ప్రచురించినందుకు పరువు నష్టం చర్యలు తీసుకునే విషయమై ప్రభుత్వానికి కోరనున్నాము.
Download the Detailed Clarificaion Copy