Compassionate Appointment in case of Minor Kids - Minor Children Compassionate Appointment Rules. Compassionate appointment rules for the children who are minor at the time of decease/death of employee.
పిల్లలు మైనర్ ఐన సందర్భంలో కారుణ్య నియామక ప్రక్రియ.
Compassionate Appointment in case of Minor Kids - Minor Children Compassionate Appointment Rules
పిల్లలు మైనర్ ఐన సందర్భంలో
- ఉద్యోగి చనిపోయిన/లేక అనారోగ్యరీత్యా (Medical invalidation) పదవీ విరమణ చేసిన ఉద్యోగి కుటుంబ సభ్యులలో ఉద్యోగార్హత కలిగిన వ్యక్తి 18 సంవత్సరాలు నిండి మేజరు కానప్పటికీ, మైనరుగా వున్నప్పటికీ సహేతుకమైన కాల వ్యవధిలోగా అంటే 16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ ఉద్యోగానికి అర్హుడు. కాని 18 సంవత్సరాలు నిండిన తర్వాతే ఉద్యోగం ఇస్తారు. ఈ విషయం అనగా మైనారిటీగా వున్న విషయం (16 సంవత్సరాలు) ఉద్యోగి చనిపోయిన వెంటనే, ఉద్యోగం దరఖాస్తు విషయం తెలియజేస్తూ దరఖాస్తు చేయవలసి యుంది.
- మైనారిటీ తీరి 18 సంవత్సరాలు నిండి మేజర్ ఐన వెంటనే ఉద్యోగం అర్థిస్తూ అధికారులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. GO Ms No 165 (GA. (Ser.A) Department, dated 20-3-1989 read with Govt. Memo, No, 618/Ser.A/78-17/GAD Dated. 17-12-1979 and GO.Ms No. 349 ( A. (Ser.A) dept. dated 12-6-1984
- ప్రభుత్వ ఉత్తరువులు (Govt. Memo. No. G18 (Ser.A)/18 - 1/ GAD 1:7-12-1979 లోని పేరా 13లో తెలిపిన మేరకు ఉద్యోగార్ది మైనరు అనే విషయం (16 సంవత్సరాలు) వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలి.
- ఉద్యోగార్డికి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ, కడపటి శ్రేణి (Last grade Service) లోని ఉద్యోగం, నియమ నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వవచ్చునని, 18 సంవత్సరాలు వచ్చే వరకు పూర్వ సర్వీసు పరిగణనలోనికి తీసుకొనరాదని G.O.Ms. No. 349/G.A. (Ser. A) dept., dated 12-4-1984 ద్వారా తెలియజేశారు. అర్హమైన కేసులలో ఉద్యోగ నియామకం చేస్తూ, నియమ నిబంధనల సడలింపు చేయుటకు శాఖాధికారికి వ్రాయవలసి యుంది. అట్టి నియామకం తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే చేయాలి. నియమ నిబంధనలు సడలిస్తూ శాఖాధిపతి నుంచి ఉత్తరుపులు వచ్చిన తర్వాతనే రెగ్యులర్ నియామకం చేయాలి. [G.O.Ms. No. 349 G.A. (Ser.A) dept., dt. 12-6-1984 and G.O. Ms. No. 165 G.A. (Ser.A) department, dated 20-3-1989).
చనిపోయిన ఉద్యోగి కుటుంబ సభ్యులలో సంపాదనాపరులు ఎవ్వరూ లేనప్పుడు, భార్య / భర్త కారుణ్య నియమక అవకాశాన్ని వినియోగించుకోనప్పుడు, మైనర్లుగా ఉన్న పిల్లలు, అర్హత గల వ్యక్తులు లేనప్పుడు, కొన్ని షరతులకు లోబడి అట్టికుటుంబానికి పారితోషకము (exgratia) చెల్లించే అవకాశము ప్రభుత్వము కల్పించినది (G.O.Ms.No.114, GA (Ser.A) Department, తేదీ : 21.08.2017).
- నాల్గవ తరగతి ఉద్యోగులు - రూ. 5,00,000/
- నాన్ గెజిటెడ్ ఉద్యోగులు – రూ. 8,00,000/
- గెజిటెడ్ ఉద్యోగులు - రూ. 10,00,000/
Will update more details soon.