Punishments -శిక్షలు - అభిశంసన (Censure) - పదోన్నతి నిలుపుదల శిక్ష (With holding Promotion) - జీతం నుంచి తిరిగి రాబట్టుట (Recovery)

Punishments Punishments - శిక్షలు రకాలు  - అభిశంసన (Censure) - పదోన్నతి నిలుపుదల శిక్ష (With holding Promotion) - జీతం నుంచి తిరిగి రాబట్టుట (Recovery) for Employees - AP CCA Rules

Punishments -శిక్షలు - అభిశంసన (Censure) - పదోన్నతి నిలుపుదల శిక్ష (With holding Promotion) - జీతం నుంచి తిరిగి రాబట్టుట (Recovery)

శిక్షలు  

1. అభిశంసన / మందలింపు (Censure) శిక్ష పదోన్నతులకు అనరత - కాలపరిమితి:
ప్రభుత్వ ఉత్తర్వులు G.O.Ms.No:187 సాధారణ పరిపాలన (సర్వీసులు (బి) శాఖ తేది 25-4-1985 లోని పేరా 11 యందు తెలిపిన విధంగా, అభిశంషన (Censure) శిక్షకు గురియైన ఉద్యోగిని పదోన్నతికి సిఫార్సు చేయకూడదు. ఒక వేళ అతనికి విధించిన శిక్ష గడువు పూర్తి అయిన సందర్భాలలో, అతని ప్రమోషన్ గురించి అర్హతల మేరకు డి.పి.సి. పరిశీలించవచ్చు.

ప్రభుత్వ ఉత్తర్వులు G.O.Ms.No:53 సాధారణ పరిపాలన (సర్వీసులు (సి) తేది 4-2-1997 ప్రకారం , అభిశంషన (Censure) శిక్షకు గురియైన ఉద్యోగి ఒక సంవత్సరం పాటు పదోన్నతి | బదిలీపై నియామకము (Appointment by Transfer) పొందుటకు అర్హుడు కాదు. ఈ అంశం రాష్ట్ర స్థాయి ఉద్యోగ శ్రేణి (Selection Posts) మరియు క్రింది స్థాయి ఉద్యోగ శ్రేణి (Non Selection Posts) కు వర్తిస్తుంది.
2. పదోన్నతి నిలుపుదల శిక్ష (With holding Promotion)
ఒక ఉద్యోగి పదోన్నతి నిలుపుదల శిక్షకు గురియైన సందర్భాలలో, అట్టి శిక్ష అమలులో వున్న కాలంలో పై స్థాయి ఉద్యోగానికి పదోన్నతి అవకాశం కోల్పోతాడు. అలాంటి శిక్ష విధించే ఉత్తర్వులలో, శిక్ష కాలపరిమితిని గురించి, అలాంటి శిక్ష ఎంతకాలం అమలులో వుంటుందన్న విషయం తప్పని సరిగా తెలియజేయాలి. అలాంటి కాలపరిమితి, కనీసం ఒక సంవత్సరంగా వుండాలి. ఈ సూత్రం, సెలెక్షన్ పోస్టులకు, నాన్ సెలెక్షన్ పోస్టులకు వర్తిస్తుంది. 
(G.O.Ms.No:342 G.A.D dated 4-2-1997, Govt. Memo No: 34633/ Ser.C/99 G.A(Ser.C) department dated: 4-11-1999, G.O.Ms.No:257 G.A.D.dt: 10-6-1999) 
3. జీతం నుంచి తిరిగి రాబట్టుట (Recovery) శిక్ష పదోన్నతుల పై ప్రభావం:
ప్రభుత్వ ఉద్యోగి తన పదవీ కాలంలో, విధి నిర్వహణ సందర్భాలలో, తన నిర్లక్ష్య వైఖరి వల్లగాని, ఉత్తర్వుల ఉల్లంగించుట వల్లగాని, ప్రభుత్వానికి, సంస్థలకు నష్టం కల్గించాడనే కారణంపై, అట్టి నష్టాన్ని భర్తీ చేయుటకు, అతని జీతం నుంచి రాబట్టుకొనుటకు (Recovery) ఉత్తర్వులు జారీ చేస్తు శిక్ష విధించిన యెడల, అట్టి ఉద్యోగి కనీసం ఒక సంవత్సరం పాటు పదోన్నతులకు అనర్హుడుగా పరిగణించ బడతాడు. ఈ విషయమై జారీ చేయు ఉత్తర్వులలో అలాంటి శిక్ష కాలపరిమితిని గురించి తెలియ జేయవలసి వుంది. అలాంటి నష్టానికి కారకుడైన ఉద్యోగి, ఆ సొమ్మును పూర్తిగా తిరిగి చెల్లించినప్పటికి, అతని పేరును పదోన్నతులకోసం ఒక సంవత్సరం పాటు సిఫార్సు చేయకూడదు.
Ref: 
  • (G.O.Ms.No:342 G.A.D dated 4-2-1997, Govt. Memo No: 34633/ Ser.C/99 G.A(Ser.C) department dated: 4-11-1999, 
  • G.O.Ms.No:257 G.A.D.dt: 10-6-1999)
ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని ఉద్యోగి నుంచి తిరిగి రాబట్టటం (Recovery) వేరు, చేసిన నేరానికి శిక్ష విధించటం వేరు కాబట్టి వాటిని ఒకే నేరానికి రెండు శిక్షలుగా భావించకూడదని Govt. W.O. Note: 17213/ Ser.C/66-1 G.A.D 1-7-1996 ద్వారా విశదీకరించింది.