Who are considered as Dependents for Compassionate Appointments - Eligible Dependents. While coming to Compassionate Appointments, the question often raises, who are considered as dependents. Who are eligible to apply for Compassionate appointments. Who can apply for compassionate appointments Know the Details here
Who are considered as Dependents for Compassionate Appointments - Eligible Dependents
మరణించిన ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తున్న అతని / ఆమె కుటుంబ సభ్యులు అనగా?
కారుణ్య నియామకాలు-అర్హత కలిగిన కుటుంబ సభ్యులెవరు? కుటుంబంలో సంపాదనా పరులు (Earning Member) ఇతరత్రా ఎవ్వరూ లేనప్పుడు కారుణ్య నియామకాల పథకం క్రింద, మరణించిన ఉద్యోగిపై పూర్తిగా ఆదారపడి జీవిస్తున్న వారిలో అర్హతలు కలిగిన ఈ క్రింద తెలియజేసిన వారికి నియమ నిభంధనల మేరకు జూనియర్ అసిస్టెంట్ పోస్టు స్కేలుకు మించకుండా ఏదైనా ఉద్యోగం కల్పించవచ్చు. కాని రికార్డు అసిస్టెంటు పోస్టు స్కేలు, జూనియర్ అసిస్టెంటు పోస్ట్ స్కేలుకన్నా తక్కువ అయినప్పటికీ, రికార్డు అసిస్టెంట్ పోస్టును నేరుగా నియమించుట (Direct Recruitment) కు నిబంధనలు అనుమతించనందు వల్ల, మరియు కారుణ్య నియామకాలు నేరుగా నియమించు పద్ధతి (Direct Recruitment)లో చేస్తారు గనుక రికార్డు అసిస్టెంటు పోస్టులో కారుణ్య నియామకాలు చేయరాదు. [Government Memo. No. 536/Ser.A/96-1 G.A. Department, dated 9-10-1996] ఈ క్రింద తెలిపిన ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులను కారుణ్య నియామకాల ఉద్యోగాలకు పరిగణించవచ్చు. (G.O.Ms. No.687 G.A. (Ser) Dept., dt. 31-10-1997] (కొన్ని నిబంధనల మేరకు):
- మరణించిన ఉద్యోగి భార్య/భర్త, ఒకవేళ వారికి ఉద్యోగం ఇష్టం లేకపోయిన, లేక ఇతరత్రా అనర్హులైన సందర్భంలో మరణించిన ఉద్యోగి భార్య తన సంతతిలో తను కోరుకున్న కుమారుడు/కూతురు (Govt. Memo. No.140733/Ser.A/2003-1 GAD, dt. 14-11-2003] పై ప్రభుత్వ ఉత్తరువులలో (Para 3) తల్లి (Mother) అనే పదం ఉపయోగించారు. తండ్రి అనే పదం ఉపయోగించలేదు. కాని జనరల్ రూలు 2(31) క్రింద వివరణ యిస్తూ (Explanation) ఎక్కడైతే ఏ లింగం అంటే పురుష లేక స్త్రీ లింగం తెలియజేశారో అవసరం మేరకు దాని వ్యతిరేక లింగంకు కూడా వర్తిస్తుందని తెలియజేశారు. (The Words importing either gender in there or special rules shall be taken to include those of other gender if circumstances so require) కావున తండ్రి విషయంలో కూడా వర్తిస్తుందని భావించాలి.
- a) మరణించిన ఉద్యోగి భార్య / భర్త లేదా ఒకవేళ వారికి ఉద్యోగము ఇష్టము లేకపోయినా, లేక ఇతరత్రా అనర్హులు అయిన సందర్భములో వారి సంతానములో వారు కోరుకున్న కుమారుడు / కుమార్తె. ( ప్రభుత్వ మెమో నెం. 140733/Ser .A/2003-1, తేదీ:14-11-2003.
- b) అవివాహిత కుమారుడు / కుమార్తె.
- c) మరణించిన ప్రభుత్వ ఉద్యోగి యొక్క చట్టబద్ధమైన వారసుడైన వివాహితుడైన కుమారుడిని, కుటుంబంలో సంపాదించే ఇతర సభ్యులు లేని పక్షములో కారుణ్య నియామకం కోసం పరిగణించవచ్చును (ప్రభుత్వ మెమో నెం. .23327/Ser.G/2007-2, తేదీ :19-09-2007).
- d) అవివాహితుడిగా మిగిలిపోయిన మరణించిన ప్రభుత్వ ఉద్యోగి యొక్క సోదరుడు/ సోదరి ని కారుణ్య నియామకం కోసం పరిగణించబడవచ్చు (ప్రభుత్వ మెమో నెం. 60681/Ser.A/2003-1 తేదీ: 12-8-2003).
- e) మరణించిన ప్రభుత్వ ఉద్యోగి యొక్క దత్తపుత్రు డు లేదా కుమాయ కారుణ్య నియామకం కోసం పరిగణించబడవచ్చు కానీ ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తేదీకి కనీసం ఐదు సంవత్సరాల ముందు దత్తత చట్టబద్ధంగా జరిగి ఉండాలి (ప్రభుత్వ మెమో నెం. 60681/Ser.A/2003-1 తేదీ: 12-8-2003.
- f) మరణించిన ఉద్యోగి కుటుంబములో పెద్ద కుమారుడు, కుటుంబము నుండి విడిపోయి స్వతంత్రముగా సంపాదిస్తూ, వేరేగా ఉన్న సందర్భములో దివంగత ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తు న్న ఇతర అర్హతగల సంతతిని ఉద్యోగములో నియమించవచ్చు (ప్రభుత్వ మెమో నెం. 60681/Ser.A/2003-1 తేదీ: 12-8-2003).
- అనారోగ్య కారణాలపై పదవీ విరమణ చేసిన - (Medical Invalidation) ఉద్యోగి అర్హత గల కుటుంబ సభ్యులు.