AP Integrated Educational Rules 1966 APER 1966

AP Integrated Educational Rules 1966 APER 1966

AP Integrated Educational Rules 1966 APER 1966 

 ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషనల్ రూల్స్-1966:
(ANDHRA PRADESH INTIGRATED EDUCATIONAL RULES-1966):
పాఠశాల నిర్వహణ-కొన్ని ముఖ్య విషయాలు:
  • A.E.R Rule-46(A): ప్రవేశ సం॥లో ఆగస్టు-31 నాటికి 5సం॥(5+) వయస్సు కలిగియున్న విద్యార్ధులను ఒకటో తరగతిలో చేర్చుకోవాలి.
  • A.E.R-46(B): అనుబంధం 10 ప్రవేశ దరఖాస్తు ద్వారా పాఠశాలలో విద్యార్ధులను చేర్చుకోవాలి.
  • A.E.R Rule 42(C): ఒక విద్యా సం॥లో పాఠశాల ఖచ్చితంగా 220 పనిదినాలు కలిగియుండాలి.
  • A.E.R.-46(J): పాఠశాలను విడిచి వేరొక పాఠశాలకు పోవునపుడు,వేరొక పాఠశాల నుండి ఈ పాఠశాలలో చేరినపుడు రికార్డు షీటు నిర్వహించాలి.
  • A.E.R-45: ఒక నెలరోజులు దాటిననూ,సెలవు లేకుండా పాఠశాలకు హాజరుకాని విద్యార్ధులను పాఠశాల రోలు నుండి తొలగించవచ్చును.
  • A.E.R-35: విద్యార్ధుల హాజరును,ఉదయము, మధ్యాహ్నం మొదటి పీరియడ్ ఆఖరున పుర్తిచేయాలి.
  • A.E.R Rule123(B): ఉపాధ్యాయుల హాజరుపట్టిని అనుబంధం-4 ఫారాలున్న పేజీలనువాడాలి.
  • A.E.R-33: ప్రధానోపాధ్యాయులు విద్యా సం॥ ప్రారంభంలోనే పాఠశాల సిబ్బంది యొక్క రోజువారీ కార్యక్రమాలను "జనరల్ టైం టేబుల్" ద్వారా తెలియజేయాలి.ఆఫీస్ రూంలోనూ,ప్రతి తరగతి గదులోనూ టైం టేబుల్ ను వ్రేలాడదీయాలి.
  • Rc.No.527/E2/97,Dt:16-07-1997: పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహోపాధ్యాయులు,ఇతర సిబ్బంది తప్పనిసరిగా అసెంబ్లీ(Prayer) కు హాజరుకావాలి.లేట్ పర్మిషన్లు ఉపాధ్యాయులకు వర్తించవు.
  • A.E.R Rule 77: ప్రతి ఉపాధ్యాయునికి కనీసం 24 పీరియడ్లు కేటాయించాలి.