India Post Payments Bank (IPPB) announced today it has launched a service for updating mobile number in Aadhaar as a Registrar for Unique Identification Authority of India (UIDAI). Now a resident Aadhaar holder can get his mobile number updated in Aadhaar by the postman at his door step. The service will be available through the extensive network of 650 IPPB branches and 146,000 postmen and Gramin Dak Sevaks that have been enabled to provide a range of banking services equipped with smart phones and biometric devices.
How to UPDATE Mobile Number in Aadhar at Home - ఇంటి వద్దే ఆధార్ మొబైల్ నెంబరు అప్‌డేట్ సేవలు
Currently, IPPB is only providing mobile update service and will very soon also enable child enrolment service through its network. IPPB has ensured readiness for rolling out these Aadhaar services across all branches/districts through a national infrastructure of trained postmen/ Gramin Dak Sewaks.
ఇంటి వద్దే ఆధార్ మొబైల్ నెంబరు అప్‌డేట్ సేవలు
ఆధార్ కార్డుదారులకు శుభవార్త. ఇక నుంచి ఆధార్ హోల్డర్ తన ఇంటి వద్దనే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ ను అప్‌డేట్ చేసుకోవచ్చు. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఎఐ) ఆధార్ లో మొబైల్ నంబర్ ను అప్‌డేట్ చేయడానికి కొత్త సేవలను ప్రారంభించినట్లు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబి) నేడు(జూలై 20) ప్రకటించింది. ఆధార్ హోల్డర్ ఇంటి వద్దే మొబైల్ నంబర్ ను పోస్ట్ మాన్ ఆధార్ లో అప్‌డేట్ చేయనున్నట్లు ఐపిపీబి ఒక ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న 650 ఐపిపీబి బ్రాంచీలు, 1,46,000 పోస్ట్ మెన్ లు, గ్రామీణ్ డాక్ సేవక్ ల ద్వారా ఈ సేవలు అందనున్నాయి.ప్రస్తుతం, ఐపీపీబి మొబైల్ అప్‌డేట్ సేవలను మాత్రమే అందిస్తోంది. అతి త్వరలోనే ఐపీపీబి నెట్ వర్క్ ద్వారా పిల్లల నమోదు సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేట్ తో పాటు, పోస్ట్ మెన్ లు, గ్రామీణ్ డాక్ సేవకులు అనేక బ్యాంకింగ్ సేవలను అందిస్తారు. "ఆధార్ సంబంధిత సేవలను సులభతరం చేయడానికి యుఐడీఎఐ తన నిరంతర ప్రయత్నంలో భాగంగా పోస్ట్ మాన్, గ్రామీణ్ డాక్ సేవకుల ద్వారా నివాసితుల ఇంటి వద్దే మొబైల్ అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. అనేక యుఐడీఎఐ ఆన్ లైన్ అప్ డేట్ సదుపాయాలతో పాటు అనేక ప్రభుత్వ సంక్షేమ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు" అని యుఐడీఎఐ సిఈఓ సౌరభ్ గార్గ్ తెలిపారు.