MDM IMMS Monitoring by Grama Samakhya Members - Instructions

MDM IMMS Monitoring by Grama Samakhya Members - Instructions 
లేఖ సంఖ్య: 10/SERP-IB-గ్రామ సంఘాల పటిష్టత-పర్యవేక్షణ - మధ్యాహన్న భోజన పధకము -2018 -  

విషయము: SERP-IB/గ్రామ సంఘాల పటిష్టత  2021. గ్రామ సంఘాలు జగనన్న గోరుముద్ద పధకము -మధ్యాహన్న భోజన పథకము  ఆప్ ద్వారా పర్వేక్షణ చేయుట - సూచనలు జారి చేయుట గురించి,
సూచిక: L. Rc. No. ESEOP -27021/240/2010 - MDM CSE, డైరెక్టర్, న్కూల్ ఎడ్యుకేషన్,  

MDM IMMS Monitoring by Grama Samakhya Members - Instructions 


పైన తెలియ చేసిన సూచిక ప్రకారము ఆంధ్ర ప్రదేశ్ గారవ ముఖ్య మంత్రి గారు జగనన్న గోరుముద్ద మద్యహ్న భోజన పదకము అమలును కింది వారితో ఏర్పాటు అయిన 4 అంచెల విధానము ద్వారా పర్యవేక్షణ మరియు పరిశీలన చేయుటకు ఆదేశములు జారి చేయడం జరిగిందని డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ వారు తెలియచేసినారు.
  • పాఠశాల ప్రధానోపాధ్యాయుడు & తల్లుల కమిటీ - ప్రతి రోజు
  • సంక్షేమ  విద్య అసిస్టెంట్ /వార్డ్ సంక్షేమ అభివృద్ధి సెక్రటరీ - వారానికి మూడు సార్లు,
  • గ్రామ సంఘము - మూడు నెలలకు ఒక సారి 
  • పాఠశాల విద్య శాఖలోని అందరు అధికారులు - రాండం గ
ఈ క్రమములో పాఠశాల విద్యాశాఖ వారు IMMS (ఇంటిగ్రవిడ్ మానిటరింగ్ ఫర్ మిడ్ డేమీల్ - స్కూల్ సానిటేషన్ యాప్ ను తయారు చేసి క్షేత్ర స్థాయి సిబ్బంది అందరికి యాప్ వాడకము గురించి శిక్షణ ఇచ్చినారని తెలియ చేసినారు.

ఆగష్టు 16, 2021 నుండి పాఠశాలలు పునఃప్రారంభించుట వలన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు & తల్లుల కమిటీ, సంక్షేమ విద్య అసిస్టెంట్ /వార్డ్ సంక్షేమ అభివృద్ధి సెక్రటరీ మరియు శాఖాధికారులు జగనన్న గోరుముద్ద (మధ్యహ్న భోజన) పదకమును పర్యవేక్షణ చేయవలసి ఉన్నదని పై లేఖలో ఉటంకిస్తూ 4 అంచెల పర్యవేక్షణ విధానము ప్రకారము గ్రామ సమాఖ్య పదాధికారులు (OB సభ్యులు) పాఠశాలలను సందర్శించి జగనన్న గోరుముద్ద (మద్యహ్న భోజన) పదకమును మూడు నెలలకు ఒక సారి పర్యవేక్షణ చేయవలసి ఉన్నదని తెలిపినారు.

మరియు గ్రామ సమాఖ్య పరాధికారులు పాఠశాల మాపింగ్ జరనట్లయితే పాఠశాల ప్రధానోపాధ్యాయుడును కలిసి మాపింగ్ చేయించుకొనవలెనని తెలియచేస్తు గ్రామ సమాఖ్యల ప్రగతిని కింది చూపబడిన లింక్ ద్వారా పర్యవేక్షణ చేయబడునని తెలియచేసినారు.
లింక్ : http://jaganannagorumudda.ap.gov.in/MDM/StakeHolderviseReport.aspx
ఇందుమూలముగా, అందరు ప్రాజెక్ట్ డైరెక్టర్లు,DRDA-YSR కాంతి వరము మరియు అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్లు- TPMU వారు గ్రామ సంఘాల పదాధికారులను (OB సభ్యులు) పాఠశాలలను సందర్శించి జగనన్న గోరుముద్ద (మధ్యప్న భోజన పరకము పై వారి పరిశీలనలను/ ఫీడ్ బ్యాక్ ను IMMS యాప్ నందు వీలైనంత త్వరలో అప్లోడ్ చేయ వలసినదిగా గ్రామ సంఘాలకు తగు సూచనలు జరి చేయవలసినదిగా ఆదేశించడమైనది.