YSR EBC Nestham Scheme Details in Telugu - EBC నేస్తం

YSR EBC Nestham Scheme Details in Telugu - EBC నేస్తం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021-22 సంవత్సరానికిగానూ EBC నేస్తం అనే పథకానికి మార్గదర్శకాలు ముందుగా విడుదల చేయడం జరిగింది. ఆ మార్గదర్శకాల లో పథకం యొక్క విధి విధానాల్లో భాగంగా అర్హత, అనర్హత ప్రమాణాలు, వివిధ అధికారుల బాధ్యత, టైం లైన్ అన్ని కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఈబీసీ కమ్యూనిటీకి చెంది 45 నుండి 60 సంవత్సరాల మధ్య ఉంటూ వైయస్సార్ చేయూత, కాపు నేస్తం లో కవర్ అవ్వని మహిళలు అందరూ అర్హులు.

YSR EBC Nestham Scheme Details in Telugu - EBC నేస్తం

ఈబిసి నేస్తం లబ్దిదారులకు Caste , Income తప్పనిసరి. EWS/EBC certificate తప్పనిసరి కాదు. OC Caste మరియు Sub Caste ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.(కాపులకు వర్తించదు)

YSR EBC Nestham Scheme Details in Telugu - EBC నేస్తం
అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ (ఈబీసీ) మహిళలకు శుభవార్త
వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, నేతన్న నేస్తం మాదిరిగా మరో కీలక పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు మహిళలకు అందిస్తున్న పథకాన్ని ఈబీసీ మహిళలకూ వర్తింపజేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు.

ఈ మేరకు ‘ఈబీసీ నేస్తం’ పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
వచ్చే మూడేళ్లలో ఒక్కో మహిళా లబ్ధిదారుకు ఈసీబీ నేస్తం పథకం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు చొప్పున మొత్తం రూ. 45 వేలు నేరుగా వారి అకౌంట్లకే జమ చేయనున్నారు.

వచ్చే బడ్జెట్లోనే ఈ పథకానికి సంబంధించిన కేటాయింపులను కూడా జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా త్వరలోనే విడుదల కాబోతున్నాయి.
EBC Nestham అర్హత
కాపు నేస్తం పథకం లాగానే 6 స్టెప్ ప్రాసెస్ వర్తించే అవకాశం కలదు.
ఈబీసీ వర్గానికి చెందిన మరియు 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులు.
  • కుటుంబ ఆదాయం రూ. 10,000, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 / - రూపాయలు.
  • కుటుంబం యొక్క మొత్తం భూములు 3 ఎకరాల చిత్తడి నేల లేదా 10 ఎకరాల పొడి భూమి లేదా 10 ఎకరాల తడి మరియు పొడి భూమి కలిసి ఉండాలి.
  • కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ కాకూడదు
  • కుటుంబానికి 4 వీలర్ (టాక్సీ, ఆటో, ట్రాక్టర్లు మినహాయింపు) ఉండకూడదు
  • కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లించకూడదు.
  • పట్టణ ప్రాంతాల్లో ఆస్తి లేని కుటుంబం లేదా 750 అడుగుల కంటే తక్కువ నిర్మించిన ప్రాంతం.
EBC నేస్తం ఎలా దరఖాస్తు చేయాలి 
అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత క్రింది వివరాలు లబ్ధిదారులు సమర్పించాలి..
  • EBC సర్టిఫికేట్
  • ఆధార్ కార్డు.
  • గుర్తింపు ధృవీకరణ పత్రం .
  • నివాస దృవీకరణ పత్రం .
  • ఆదాయ ధృవీకరణ పత్రం లేదా రైస్ కార్డ్ లేదా బిపిఎల్ సర్టిఫికేట్.
  • దరఖాస్తుదారుడి పాస్పోర్ట్ సైజు ఛాయాచిత్రం..
  • బ్యాంక్ ఖాతా వివరాలు.
EBC నేస్తం పథకం తరచుగా అడిగే ప్రశ్నలు సమాధానాలు
EBC నేస్తం ఎవరికీ వర్తిస్తుంది?
ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్ర కులాల లో ఉన్నటువంటి 45 నుంచి 60 ఏళ్ళ లోపు మహిళలకు వర్తిస్తుంది.
ఏ డేట్ నాటికి వయసును నిర్ధారిస్తారు?
సెప్టెంబర్ 29 2021 నాటికి 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉండాలి.

EBC Nestham పథకం అర్హతలు ఏంటి?
OC కులాలలో రైస్ కార్డు కలిగి BPL కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఆర్థికంగా వెనుక బడిన అగ్ర కులాల మహిళలలన్దరికి ఈ పథకం వర్తిస్తుంది. అయితే దిగువ ఇవ్వబడిన అనర్హతల జాబితాలో ఉండరాదు.

ఈ పథకం అనర్హతలు ఏమిటి?
లబ్ధిదారులు ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన వారు, ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారులు కారాదు. అదే విధముగా మునిసిపల్ ప్రాంతంలో 1000 చ.అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండరాదు. ౩ ఎకరాల తడి భూమి, 10 ఎకరాల పొడి భూమి, తడి పొడి కలిపి 10 ఎకరాలు మించరాదు. 4 వీలర్ ఉండరాదు. (ట్రాక్టర్, ఆటో, మ్యాక్సీ క్యాబ్ కు మినహాయింపు ఉంది.) ౩౦౦ యూనిట్స్ ప్రతి నెల విద్యుత్ బిల్లు మించరాదు.

ఈ పథకం లబ్దిదారులకు ఆదాయ పరిమితి ఎంత ?
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నెల 10000 , పట్టణ ప్రాంతాల్లో 12000 ప్రతి నెల మించరాదు.

ఈ పథకానికి అంగన్వాడీ , ఆశ కార్యకర్తలు అర్హులా?
లేదు.

ఈ పథకం దరఖాస్తు గడువు ఎప్పటివరకు ఉంది?
అక్టోబర్ 7 వరకు గడువు ఉంది.

ఈ పథకానికి ఏ డాకుమెంట్స్ కావాలి?
ఆధార్, రైస్ కార్డు , ఇన్కమ్ మరియు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ తప్పనిసరి. వీటితో పాటు సరైన బ్యాంక్ అకౌంట్ మరియు పాస్ పుస్తకం కావాలి. EWS/ఈబీసీ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు.

ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
నేరుగా సచివాలయం లో లేదా మీ వాలంటీర్ సహకారంతో అప్లై చేయవచ్చు.