మా సమస్యల పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది : ఉద్యోగ సంఘాలు
ప్రభుత్వం నమ్మకం చేస్తుందన్న నమ్మకం మాకు ఉంది : ఉద్యోగ సంఘాలు
ఉద్యోగ సంఘాల సమస్యల ను దశల వారీగా పరిష్కరిస్తాం : బుగ్గన
అమరావతి:మేం పెట్టిన 71 డిమాండ్లపై మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మతో చర్చించాం. బుధవారం నుంచి డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీతో ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం-బండి, ఏపీ జేఏసీ ఛైర్మన్
AP : నిరసనలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము : ఉద్యోగ సంఘాలు
వెనక్కి తగ్గిన ఉద్యోగ సంఘాలు AP: కొన్ని రోజులుగా PRC విషయంలో ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ చర్చలు ఫలించాయి. ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి ఉద్యోగ సంఘాలు. ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించుకుంటున్నట్లు ప్రకటించాయి. త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన స్పష్టతనివ్వడంతో వీరు వెనక్కి తగ్గారు. మరోసారి సమావేశమై దశలవారీగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పింది.‘‘ఉద్యోగుల డిమాండ్లను మరోమారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఏపీ సచివాలయానికి సంబంధించి 11 అంశాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 85 అంశాలు నివేదించాం. సచివాలయంలో అదనపు పోస్టులను భర్తీ చేయాలని కోరాం. కోర్టు కేసులు ఎక్కువ అవుతున్నందున అదనపు పని భారం పెరిగింది. అసెంబ్లీ ఉద్యోగులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. జిల్లాల్లో ఉద్యోగులకు స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరాం. వీఆర్వోలకు పదోన్నతులు ఇచ్చినా గ్రేడ్-2 స్కెల్‌నే అమలు చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం’’ అని తెలిపారు.
దురుద్దేశంతో ఉద్యమ కార్యాచరణకు వెళ్లలేదు: బొప్పరాజు
‘‘మా సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 71 అంశాలపై కూలంకషంగా చర్చించాం. ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇస్తామని చెప్పింది. ప్రభుత్వ హామీతో ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. దురుద్దేశంతో ఉద్యమ కార్యాచరణకు వెళ్లలేదు. ఇవాళ్టి భేటీ మినిట్స్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నెల 7 నుంచి ఉద్యోగులంతా ఆందోళనతో ఉన్నారు. ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం’’ అని పేర్కొన్నారు.