పార్ట్ -2 ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు

ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు పార్ట్ -2 సందేహాలు - సమాధానాలు https://www.apteachers.in

ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు పార్ట్ -2 

ప్రశ్న : నేను 24 సం||ల స్కేలు తీసుకున్న తర్వాత ఎన్టిటి నుండి ఎస్ఏగా పదోన్నతి పొందాను. నాకు ఇంకా 13 సం||ల సర్వీసువుంది. పదోన్నతి పోస్టులో 6 సం॥లు 12 సం||ల స్కేళ్ళు ఇస్తారా?
జవాబు : జిఓఎంఎన్ నం. 68 ఆర్థిక; తేది. 12.06.2015 ప్రకారం 24 సం||ల స్కేలు పొందిన తర్వాత పదోన్నతి పొందితే పదోన్నతి పోస్టులో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీంకి అర్హత ఉండదు. అంటే 6, 12 తదితర స్కేళ్ళు మంజూరు చేయబడవు.

ప్రశ్న : ఎఱటిగా 24 సం||ల స్కేలు పొందిన ఉపాధ్యాయుడు ఎస్ఏగా పదోన్నతి పొందితే అతని ఇంక్రిమెంట్ కొన సాగుతుందా?
జవాబు : 24 సం||ల స్కేలు పొందిన తర్వాత పదోన్నతి పొంది నప్పుడు అతని వేతనం ఎస్ఆర్ 22ఎ(1) ప్రకారం నిర్ణయించబడుతుంది. క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ తేదీనాడు ఎస్ఆర్ 31(2) ప్రకారం వేతన పునస్థీకరణ చేయబడుతుంది. అనగా క్రింది కేడర్ లో ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుంది.

ప్రశ్న : 18 సం||ల ఇంక్రిమెంట్ పొందిన తరువాత ప్రమోషన్ వస్తే పదోన్నతి పోస్టులో ఏఏ స్కేళ్ళకు అర్హత ఉంటుంది.
జవాబు : ఆర్థికశాఖ లేఖ సంఖ్య 14531/140/పిసి-2/ 2008 -2; తేది. 18.02.2009 ప్రకారం అర్హతలుంటే పదోన్నతి పొందిన పోస్టులో అన్ని రకాల ఆటోమేటిక్ అడ్వాన్స్మంట్ స్కేళ్ళని పొందవచ్చు.

ప్రశ్న : నేను స్పెషల్ టీచర్ గా రూ.398/-ల వేతనంపై 15.11. 1990నుండి 07.03.1990 వరకు పనిచేశాను. జిఓ 28; తేది.01.03.2019 నాకు వర్తిస్తుందా?
జవాబు : వర్తిస్తుంది.


ప్రశ్న : డిపార్ట్ మెంట్ టెస్టులు పాస్ కాకపోయినా 24 సం||ల స్కేలు మంజూరు చేశారు. తదుపరి పదోన్నతి పొందగా ఎఫ్ ఆర్ 223(1) ప్రకారం వేతన నిర్ణయం చేశారు. 24 సం||ల స్కేలు రద్దుచేసి 22(బి) ప్రకారం వేతన నిర్ణయం చేయ వచ్చా?
జవాబు : మీకు అర్హత లేకుండా మంజూరు చేసిన 24 సం||ల స్కేలు రద్దు చేయాలి. అనంతరము ఎస్ఆర్ 22(బి) ప్రకారం వేతన నిర్ణయం చేయవచ్చు.


ప్రశ్న : మున్సిపల్ పాఠశాలలో పదోన్నతి పొందినప్పుడు హాజరు పట్టిలో ఎవరిపేరు ముందు రావాలి?
జవాబు : పదోన్నతి జాబితాలో ముందున్న వారే సీనియర్ అవుతారు. కాబట్టి ఆ ప్రకారమే హాజరు పట్టిలో పేర్లు రాయవలసి వుంటుంది. -

ప్రశ్న : ఒక ఉపాధ్యాయుడు రిఫరల్ కంటి ఆసుపత్రిలో కాటరాక్ట్ చేయించుకొన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ కు దరఖాస్తు చేయగా రీయింబర్స్ మెంట్ వర్తించదని అంటు న్నారు. వాస్తవమేనా?
జవాబు : వాస్తవమే. జిఓ ఆర్ టి నం.345 హెల్త్ & ఫ్యామిలీ డిపార్ట్ మెంట్; తేది. 21.08.2018 ప్రకారం 204 వ్యాధులను మెడికల్ రీయింబర్స్మెంట్ పరిధి నుండి తొలగించి, హెల్త్ కార్డులకే పరిమితం చేశారు. వాటిలో కాటరాక్ట్ కూడా ఉన్నందున మెడికల్ రీయింబర్స్ మెంట్ వర్తించదు.