పార్ట్ -3 ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు

ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు పార్ట్ -3 .

ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు పార్ట్ -3 సందేహాలు - సమాధానాలు https://www.apteachers.in

ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు పార్ట్ -3 


ప్రశ్న : నేను యస్జిటి గా ఉద్యోగంలో చేరి 8,16 సం||ల స్కేళ్ళు పొంది తదుపరి స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందాను. ఎన్ఏ కేడర్ లో 6,12,18 సం||ల స్కేలు తీసుకుని పెన్షన్ ప్రతిపాద నలు పంపంగా ఎ.ఎ.ఎస్. గరిష్టంగా 4సార్లు మాత్రమే తీసు కోవాలని, కావున అదనంగా చెల్లించిన సొమ్ము రికవరీ కొరకు యాభైవేలు నిలిపివేస్తూ పెన్షన్ ప్రతిపాదనలు ఆమోదిస్తూ ఏ.జి. కార్యాలయం వారు ఉత్తర్వులు పంపారు సమంజసమేనా?

జవాబు : సరియైనది కాదు. ఆర్థిక శాఖ లేఖ నం.1453/140/పిసి-2/2008-2; తేది. 18.04.2009 ప్రకారం కనీసం 3 తీసుకోవాలనేదే ఎ.ఎ.ఎస్. ఉద్దేశ్యం తప్ప గరిష్ట పరిమితి లేదు అని పేర్కొన్నారు. కావున ఏ.జి. వారి అభ్యంతరం సరియైనది కాదు.


ప్రశ్న : యస్జిటి ఉపాధ్యాయుడు వైద్య కారణములపై సెలవుపెడితే మెడికల్ సర్టిఫికెట్ ఎం.బి.బి.ఎస్. డాక్టర్ మాత్రమే ఇవ్వాలని ట్రెజరీ వారు అభ్యంతరం తెలియజేస్తున్నారు. సరియైనదేనా?
జవాబు : ఆంధ్రప్రదేశ్ ఫండమెండ్ రూల్స్ రూల్ 74కు సంబంధించిన అనెక్సర్-2 నందలి రూల్ 16 ప్రకారం నాన్ గెజిటెడ్ ఉద్యోగికి రిజిష్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ వైద్య దృవపత్రం ఇస్తే సరిపోతుంది.


ప్రశ్న : నేను యస్జిటిగా 18.06.2019కి 24 సం||ల సర్వీసు నిండు తుంది. డిపార్ట్ మెంట్ టెస్టులు పాస్ అయివున్నాను. తదుపరి ప్రమోషన్లలో నాకు ప్రమోషన్ వచ్చే అవకాశం వుంది. 24 సం||ల న్కేలు పొందితే వచ్చే నష్టం తెలియజేయ గలరు.
జవాబు : మీరు 24 సం||ల స్కేలు తీసుకొని పదోన్నతి పొందితే పదోన్నతి పోస్టులో ఎస్ఆర్ 22 ఎ(i) ప్రకారం ఒక ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది. పదోన్నతి తదుపరి మీకు 6 సం||లలోపు సర్వీసవుంటే 24 సం||ల స్కేలు తీసుకున్నా, తీసుకోకపోయినా ఎలాంటి తేడా వుండదు. ఇది లాభనష్టాలతో బేరీజు వేసే అంశం కాదు.

ప్రశ్న : నేను 4 నెలలు మెడికల్ లీవు పెట్టి జాయిన్ అయ్యాను. ఇంక్రిమెంట్ లీవు మధ్యలో వుంది. ఇంక్రిమెంట్ ఎప్పుడు మంజూరు చేస్తారు. అరియర్ ఎప్పటినుండి ఇస్తారు?
జవాబు : ఇంక్రిమెంట్ తేదీనాడు క్యాజువల్ లీవు మినహా మిగిలిన ఏ సెలవులో వున్నా ఆర్థిక లాభం తిరగి విధులలో చేరిన తేదీ నుండి మాత్రమే చెల్లిస్తారు. అరియర్స్ ప్రసక్తి లేదు.

ప్రశ్న : నాకు ముగ్గురు బిడ్డలు చైల్డ్ కేర్ లీవు మొదటి బిడ్డకు వాడుకోలేదు. మిగిలిన ఇద్దరి పిల్లలకు వాడుకోవచ్చా? ఇద్దరు పిల్లలు ఉన్నవారికి మాత్రమే అంటున్నారు. వాస్తవమేనా?
జవాబు : జిఓ నం. 132 ఆర్థిక, తేది. 06.07.2016 ప్రకారం ఇద్దరు పిల్లలకు రెండు నెలల చైల్డ్ కేర్ లీవు వాడుకోవచ్చు అని మాత్రమే ఉంది. ఇద్దరు పిల్లలు మాత్రమే కలిగి వుండాలని లేదు. కావున మీరు మిగిలిన ఇద్దరు పిల్లలకు వాడుకోవచ్చు.


ప్రశ్న : ఇరువురు ఉపాధ్యాయులు యస్జిటి నుండి స్కూల్ అసిస్టెంట్ గా ఒకేసారి వేరు వేరు సబ్జెక్టులలో పదోన్నతి పొందారు. హెచ్ఎం సీనియార్టీ లిస్ట్ లో ఎవరిపేరు ముందు చేర్చాలి?
జవాబు : ఎడిస్ నం. 2907/23-2/05 డిఎస్ఏ; తేది. 28.02.2006 ప్రకారం ఫీడర్ క్యాటగిరీ అయిన యస్జిటిలో ఎవరు సీనియర్ అయితే వారే స్కూల్ అసిస్టెంట్ సీనియార్టీలో ముందుంటారు.

ప్రశ్న : నేను 24 సం||ల సర్వీసు పూర్తిచేసే సమయానికి డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ కాలేదు. తదుపరి పాసైవున్నాను. అప్పటినుండి 24 సం||ల స్కేలు మంజూరు చేయవలసినదిగా దరఖాస్తు చేయగా ట్రెజరీవారు తిరస్కరించుచున్నారు. సరియైనదేనా?
జవాబు : సరియైనది కాదు. జిఓ ఎంఎస్ నం. 270 జిఏడి; తేది. 30.04.1984 ప్రకారం మీరు డిపార్ట్మెంట్ పరీక్ష వ్రాసిన మరుసటి రోజు నుండి మీకు ఆ స్కేలు ఇవ్వాలి.