పార్ట్ -5 ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు

ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు పార్ట్ -5 . Question and Answers of AP Employees and Teachers Service Matters Part -5

ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు పార్ట్ -5 


ప్రశ్న : నేను 24 సం||ల స్కేలు తీసుకున్న తర్వాత ఎన్ఏ పదోన్నతి పొందాను. నాకు 6 సం||ల స్కేలు ఇవ్వ లేదు. 12 సం||ల స్కేలు వస్తుందా? తెలుపగలరు.
జవాబు అవకాశం లేదు. జిఓ ఎంఎస్ నం. 68 ఆర్థిక; తేదీ.12.06.2015నందు The employees after availing the benefit of SPP-II are not eligible for the Automatic Advancement Scheme on their further promotion అని పేర్కొనబడింది. దీని ప్రకారం మీరు క్రింద పోస్టులో 24 సం||ల స్కేలు తీసుకున్నందున ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేళ్ళు రావు.
ప్రశ్న : నేను 2005లో నేరుగా స్కూల్ అసిస్టెంట్ గా విధులలో చేరాను. 2017లో నాకు 12 సం||ల సర్వీసు పూర్తి అయినది. నేను డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కాలేదు. అప్పటికి నా వయస్సు 49 సం||లు. నాకు 12 సం||ల స్కేలు వస్తుందా? 12 సం||ల స్కేలుకి వయస్సు మినహాయింపు వర్తించదంటున్నారు. వాస్తవమేనా?
జవాబు : మీకు 12 సం||ల స్కేలు వస్తుంది. జిఓ ఎంఎస్ నం. 225 జిఏడి; తేదీ. 18.05.1999 ప్రకారం ఒక్క ప్రమోషన్ కూడా తీసుకోని వారికి 45 సం||ల వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెన్ల నుండి మినహాయింపు వర్తిస్తుంది. ఇదే విషయాన్ని ఆర్థిక శాఖ మెమో నం.21073/193/PC-II/2009; తేదీ. 21.02.2009 పేరా 4నందు కూడా నిర్ధారణ చేయడం జరిగింది. 

ప్రశ్న : ఒక ఉపాధ్యాయుడు 13 రోజులు కోవిడ్ కారణంగా సెలవు పెట్టారు. ఆ వైద్య ఖర్చులకు మెడికల్ రీయింబర్స్మెంట్ పెట్టారు. అతను 13 రోజులకు సమైక్యాంధ్ర సంపాదిత సెలవు వాడుకొనవచ్చునా?
మెడికల్ రీయింబర్స్మెంట్ క్లైమ్ చేసినందున సమైక్యాంధ్ర సెలవు వాడుకొనరాదని అభ్యంతరం తెలుపుతున్నారు. సరియైనదేనా?
జవాబు : నగదుగా మార్చుకోవటం మినహా మిగిలిన సందర్భంలో సమైక్యాంధ్ర సంపాదిత సెలవు సాధారణ సంపాదిత సెలవు మాదిరిగానే వాడు కోవచ్చు. అందువలన సమైక్యాంధ్ర సంపాదిత సెలవును వైద్య కారణములపై వాడుకొనవచ్చు. 

ప్రశ్న : ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల ఖర్చు ఎంత చెల్లిస్తారు? పెన్షనర్ చనిపోతే ఎంత చెల్లిస్తారు?
జవాబు : జిఓ ఎంఎస్ నం. 91 జిఏడి; తేదీ. 13.04.2016 ప్రకారం ఉద్యోగి మరణిస్తే రూ.15000/-లు అంత్య క్రియల ఖర్చుగా చెల్లిస్తారు. పెన్షనర్ చనిపోతే జిఓ ఎంఎస్ నం.39 ఆర్థిక, తేదీ. 08.03.2016 ప్రకారం రూ.15000/-లు లేదా నెల పెన్షన్లలో ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు. -

ప్రశ్న : ఒక ఉపాధ్యాయుడు మెడికల్ ఇన్వాలిడేషన్ తీసుకోవాలనుకుంటున్నారు. వారి కుమారునికి ఉద్యోగం రావాలంటే ఇంకా 5 సం||ల సర్వీసు ఉండాలం టున్నారు. ఆ సర్వీసు ఎప్పటి నుండి లెక్కిస్తారు.
జవాబు : జిఓ ఎంఎస్ నం.182 జిఏడి; తేదీ. 22.05.2014 ప్రకారం ఆ ఉద్యోగి అభ్యర్ధనను మెడికల్ బోర్డు అప్రూవ్ చేసిన తేదీ నుండి 5 సం||ల సర్వీసు ఉండాలి. 

ప్రశ్న : ఉపాధ్యాయుడు సస్పెన్షనల్ ఉన్నప్పుడు పెరిగిన డిఏ సబ్సిస్టెన్స్ అలవెన్సను లెక్కిస్తారా?
జవాబు : లెక్కిస్తారు. సర్యులర్ మెమో నం.13262/507/FR.II| 2009; తేదీ. 26.08.2009 ప్రకారం సస్పెన్షన్లో ఉండగా పెరిగిన డిఏ సబ్సిస్టెన్స్ అలవెనక్కు లెక్కిస్తారు. 

ప్రశ్న : నేను 1994 డిఎస్సీ ద్వారా ఎంపిక కాబడి అప్రెంటీస్ టీచర్‌గా సర్వీసులో చేరాను. రెండవ సంవత్సరంలో నాకు 29 రోజులు వైద్య కారణము లపై అర్ధజీతపు సెలవు మంజూరు చేసారు. ఆ సెలవును సెలవు ఖాతాలో తగ్గించలేదు. ప్రస్తుత ఎంఇఓ గారు ఆ సెలవును తగ్గించాలని, అదనంగా మంజూరు చేసిన సెలవుకు జీత నష్టపు సెలవుగా పరిగణిస్తామని అంటున్నారు. సరియైనదేనా?
జవాబు : కాదు. జిఓ ఎంఎస్ నం. 134 విద్య, తేదీ. 10.06.1996నందు అప్రెంటీస్ ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉపాధ్యా యులకు వర్తించే అన్ని సెలవులతో పాటు FR.II ప్రకారం 30 రోజులు అర్ధజీతపు సెలవులు వర్తిస్తాయని పేర్కొన్నారు. కావున మీకు మంజూరు చేసిన సెలవు సరియైనదే. సెలవు ఖాతాలో తగ్గించ నవసరం లేదు.