పార్ట్ -6 ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు

పార్ట్ -6  ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు  
సందేహాలు - సమాధానాలు - 130(696-700)

పార్ట్ -6  ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు 


696.❓సందేహం:

నేను ఉన్నత చదువుల కోసం 78 రోజులు జీత నష్టపు సెలవు పెట్టాను.ఆ కాలానికి ఇంక్రిమెంట్ వాయిదా వేశారు.వాయిదా పడకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలి??
సమాధానం:
FR-26 ప్రకారం 6 నెలల వరకు ఇంక్రిమెంట్ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికార0 CSE గారికి మాత్రమే ఉన్నది.కాబట్టి మీరు CSE గారికి దరఖాస్తు చేసుకోగలరు.

697.❓సందేహం:
డైస్ నాన్ కాలం అంటే ఏమిటి??
సమాధానం:
FR.18 మరియు APLR-1933 లోని రూల్ 5 ప్రకారం 5ఇయర్స్ కి మించి గైర్హాజరు అయిన ఉద్యోగి, తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు గా భావించాలి.తిరిగి ఉద్యోగం లో చేరాలి అంటే ప్రభుత్వం యొక్క అనుమతి కంపల్సరీ.
FR.18 ప్రకారం డైస్ నాన్ కాలం ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ తదితర సందర్భాలకు సర్వీసు గా పరిగణించబడదు.కనుక ఈ కాలానికి సెలవు మంజూరు చేయటo,వేతనం చెల్లించటం అనే ప్రశ్నలు ఉత్పన్నం కావు.

698.❓సందేహం:
అనారోగ్యం కారణాలతో ఉద్యోగం చేయలేకపోతున్నాను.నా తమ్ముడు డిగ్రీ, బీ. ఈ. డి చదివాడు.నా ఉద్యోగం తమ్ముడు కి ఇప్పించవచ్చునా??
సమాధానం:
టీచర్ ఉద్యోగం వేరే వారికి నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు.కానీ జీఓ.66 తేదీ:23.10.2008 ప్రకారం నిబంధనలకు లోబడి మీరు అనారోగ్యం కారణంగా శాశ్వతంగా విధులు నిర్వహి0సలేరని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేసన్ కింద రిటైర్మెంట్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ స్థాయి కి మించకుండా కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది.

699.❓సందేహం:
నేను,నా భార్య ఇద్దరం టీచర్ల0.హెల్త్ కార్డుకి ప్రీమియం నా జీతం ద్వారా చెల్లించుచున్నాను.నా భార్య హెల్త్ కార్డులో వారి తల్లిదండ్రులు పేర్లు చేర్చుకోవచ్చా??
సమాధానం:
చేర్చుకోవచ్చు. మహిళా టీచర్లు కూడా ఆధారిత తల్లిదండ్రులు పేర్లు హెల్త్ కార్డులో చేర్చుకోవచ్చు.

700.❓సందేహం:

EOL కాలాన్ని వాలoటరీ రిటైర్మెంట్ కి పరిగణనలోకి తీసుకుంటారా??
సమాధానం:
EOL కాలాన్ని అర్హత గల సెలవు గా లెక్కించరు.కానీ వ్యక్తిగత కారణాల తో eol ఐతే 36 నెలల వరకు, అనారోగ్య కారణాలతో ఐతే ఎంతకాలం ఐనా EOL కాలాన్ని పెన్షన్ లెక్కింపు కి అర్హత సెలవుగానే పరిగణిస్తారు.