AMMAVODI 2022 Head Masters Understanding అమ్మఒడి పథకం పైన HMs కు ఒక అవగాహన

AMMAVODI 2022 Head Masters Understanding అమ్మఒడి పథకం పైన HMs కు ఒక అవగాహన
అమ్మఒడి పథకం పైన HMs కు ఒక అవగాహన:

AMMAVODI 2022 Head Masters Understanding అమ్మఒడి పథకం పైన HMs కు ఒక అవగాహన

అమ్మఒడి కి సంబందించి మనకు 3 జాబితాలు వచ్చినవి. అవి సచివాలయాలకి పంపటం జరిగింది . వాటి గురించి వివరణ చూడండి.

జాబితా-1: (List for eligible) ఇందులో మొదటి విడత అర్హుల పిల్లల అందరి వివరాలు ఉంటాయి. మీరు ఈ list లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. అందుకు అవసరమైన డాక్యుమెంట్ జిరాక్స్లు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన Grievance format లో సబ్మిట్ చేయాలి.

జాబితా-2:(List for ineligible/List of Candidates who require further verification on given remarks) ఇందులో రకరకాల కారణాలతో తాత్కాలిక అనర్హుల పిల్లల వివరాలు ఉంటాయి. మీరు ఈ list లో ఏ కారణముతో వారు అనర్హులయ్యారో వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. వారి వాదనకు తగిన డాక్యుమెంట్ ప్రూఫ్ జిరాక్స్లు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన Grievance format లో సబ్మిట్ చేయాలి.

జాబితా-3:(Re-confirmation/re verification required) ఇందులో వచ్చిన వివరాలు మరొకసారి verify చేయాలి. కావున మీరు పిల్లల ఆధార్ , తల్లి ఆధార్ , బ్యాంకు పాస్ బుక్, రేషన్ కార్డు xeroxలు మరియు ఫోన్ నెం. అన్నీ రెండు కాపీలు తీసుకోవాలి. అలాగే మీకు ఇవ్వబడిన Grievance format లో submit చేయాలి

3 రకాల ఫార్మ్స్ 
ఇందులో
1. అమ్మ ఒడి అర్హుల వివరముల సవరణ దరఖాస్తు (Amma Vodi Correction Form) లో List-I లో ఉన్న విద్యార్ధుల వివరాలు ఏవైనా తప్పు ఉన్న యెడల, అందులో ఫిల్ చేయవలెను.

2. అమ్మ ఒడి అభ్యంతరముల దరఖాస్తు (Amma Vodi Objections Form) లో List-II & List-III ఉండి అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.

3. అమ్మ ఒడి పధకం వర్తింపు కొరకు దరఖాస్తు (Amma Vodi Grievance Form) నందు అర్హులు అయ్యి ఉండి, List-I, List-II & List-III లో లేని విద్యార్ధులు అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.

పైన ఇవ్వబడిన అన్ని ఫార్మ్స్ కూడా సంబంధించినవారు పూర్తిచేసి గ్రామసచివాలయంలోని వాలంటీర్ కు లేదా వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు అందజేయాలి. ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఈ ఫార్మ్ లను వాలంటీర్ లతో వెరిఫికేషన్ చేయించి కౌంటర్ సిగ్నేచర్ తో మరియు రిమార్క్స్ తో మండల విద్యా శాఖాధికారి కార్యాలయంలో అందజేయాలి.

Note: This is not official communication. This is for information of Head Masters on AMMAVODI Formats and Lists. This is based on the Lists communicated in apps