JAGANANNA VIDYA KANUKA JVK 2022 - List of JVK KIT Items Proceedings Instructions Details Here

JAGANANNA VIDYA KANUKA JVK 2022 - List of Items Proceedings Instructions Details Here. Govt of AP Education Department has released the detailed proceedings regarding distributing the Jagananna Vidya Kanuka Kits going to be distributed to Students for the academic year 2022-23. JVK KIT 2022 Distribution Guidelines has been released. All the Heads of the institutions have to follow the guidelines for JVK Kits 2022. Check out the Item wise specifications, Guidelines below. Jagananna Vidya Kanuka Scheme Details for 2022. Jagananna Vidya Kanuka Official Guidelines 2022– JVK Eligibility, JVK Benefits, &JVK Documents 2022. 

JAGANANNA VIDYA KANUKA JVK 2022 - List of JVK KIT Items Proceedings Instructions Details Here

ఆర్.సి.నెం. SS-16021/50/2021-CMO SEC-SSA
తేది: 10-06-2022

సమగ్ర శిక్షా 'జగనన్న విద్యా కానుక - 2022-28' విద్యార్ధులకు కిట్లను క్షేత్రస్థాయిలో పంపిణీ కొరకు - సమగ్ర శిక్షా - మార్గదర్శకాలు జారీ చేయుట.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2022 - 23 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, మండల ప్రజాపరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, గురుకులాలు, ఆశ్రమ, ఎయిడెడ్, మోడల్, కేజీబీవీ, రిజిస్టర్డ్ మదర్సాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక' పేరుతో స్టూడెంట్ కిట్ల సరఫరా ప్రారంభించబడింది.

జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్రశిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు ఈ క్రింది ఏర్పాట్లను తప్పనిసరిగా అమలు చేయవలెను. 
  1. జిల్లా స్థాయిలో జగనన్న విద్యాకానుక కోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి. 
  2. జగనన్న విద్య కానుక సప్లయర్స్ నుండి వస్తువుల డెలివరి షెడ్యూల్ ను తీసుకుని సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు / మండల విద్యాశాఖాధికారి వారికి ఏ రోజు ఏ వస్తువులు అందుతాయో సమాచారం అందించాలి. 
  3. జగనన్న విద్యాకానుక వస్తువులకు సంబంధించి డెలివరీ చలానాలను తప్పనిసరిగా పొందవలెను.
  4. ప్రతి రోజు జిల్లాలో విద్యాకానుక వస్తువుల స్వీకరణ గురించి నివేదిక పంపించవలెను. 
  5. యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, వుక్స్ మరియు డిక్షనరీలు స్కూల్ కాంప్లెక్సులకు చేర్చి పాఠశాల పున:ప్రారంభానికి ముందుగా 'స్టూడెంట్ కిట్' తయారు చేయాలి.

ముఖ్యంగా గమనించవలసిన విషయాలు . 
  1. 'జగనన్న విద్యాకానుక'లో భాగంగా మూడు జతల యూనిఫాం క్లాత్, వర్క్ బుక్స్, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు& రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు, నిఘంటువులను కిట్ రూపంలో అందించవలసి ఉంటుంది.
  2. 'జగనన్న విద్యాకానుక'లో భాగంగా నోటు పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు మరియు ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు స్కూల్ కాంప్లెక్సులకు, యూనిఫాం క్లాత్ మండల విద్యాశాఖాధికారి కార్యాలయాలకు, డిక్షనరీలు జిల్లా కేంద్రాలకు అందజేస్తారు.
  3. జగనన్న విద్యాకానుక కిట్లోని వస్తువులు జిల్లా / మండల విద్యాశాఖాధికారి కార్యాలయాలకు / స్కూల్ కాంప్లెక్సులకు వచ్చే ముందు జిల్లా కంట్రోల్ రూమ్ సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు/ మండల విద్యాశాఖాధికారి వారికి సమాచారం అందిస్తారు.
  4. 'జగనన్న విద్యాకానుక' కార్యక్రమం విజయవంతం చేయడంలో భాగంగా మండల పరిధిలో మండల విద్యాశాఖాధికారి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, సిబ్బంది పరస్పర సహకారంతో పని చేయాలి. సమష్టి బాధ్యతగా తీసుకోవాలి. 
  5. అందుకున్న వివిధ వస్తువులకు సంబంధించిన వివరాలను స్కూల్ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులకు అందించబడిన వారి లాగిన్ నందు నమోదు చేయాల్సి ఉంటుంది.
నమూనా:
క్ర.సం.
జిల్లా
మండల విద్యాశాఖాధికారి కార్యాలయం/ స్కూల్ కాంప్లెక్సు పేరు
వస్తువు పేరు
చలానాలో ఉన్న వస్తువుల సంఖ్య
అందుకున్న వస్తువుల సంఖ్య
తేది
  • కిట్ కు సంబంధించిన వస్తువులు అందినవి అందినట్లు స్కూల్ కాంప్లెక్సు పరిధిలో ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారులు నమోదు చేసిన వివరాలను (ఎన్ని వచ్చాయి? ఇంకా ఎన్ని అందాలి?) ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు గమనిస్తూ ఉండాలి.
  • సప్లయర్స్ నుంచి వచ్చిన వస్తువులన్నింటిని పరిశీలించాలి. 
  • సప్లయర్స్ ఇచ్చే మూడు చలానాల్లో సంతకం చేసి కార్యాలయ ముద్ర వేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ చలానా ఒకటి స్కూల్ కాంప్లెక్సులో, మరొకటి జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో, మూడో చలానా రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. 
  • సప్లయర్స్ సరఫరా చేసిన వస్తువులను భద్రపరచడానికి స్కూల్ కాంప్లెక్సులో లేదంటే దగ్గరలోని భద్రతా ప్రమాణాలు కలిగిన పాఠశాలలలో భద్రపరచాలి. 
  • సంబంధిత మండల కేంద్రానికి చేరిన వస్తువులను భద్రపరిచే గది వెలుతురు తగిలేలా, ఎలుకలు, చెదలు వంటివి లేకుండా తడి, చెమ్మ లేకుండా , వర్షం నీరు రాకుండా ఉండేలా భద్రతా ప్రమాణాలు కలిగిన పాఠశాలలో భద్రపరచాలి. 
  • ప్రతి మండల విద్యాశాఖాధికారి కార్యాలయం | స్కూల్ కాంప్లెక్సులకు చేరిన మెటిరీయల్ నందలి అన్ని వస్తువులు పరిశీలించవలసి ఉంటుంది. (ఉదాహరణకు: నోటు పుస్తకాలకు సంబంధించి వైట్ నోట్ బుక్స్, రూల్డ్ నోట్ బుక్స్, బ్రాడ్ రూల్డ్, గ్రాఫ్ పుస్తకాలు ఇలా అన్ని రకాల నోటు పుస్తకాలు - పరిశీలించాలి. అలాగే తరగతుల వారీ అన్ని సైజుల బ్యాగులు, బెల్టులు మరియు బూట్లు, సాక్సులు, యూనిఫాం క్లాత్ పరిశీలించాల్సి ఉంటుంది. 
  • డెలివరీ చలనాలో సైజులు వారీ ఉన్న సంఖ్యతో, అందుకున్న వస్తువుల సంఖ్య సరిపోయిందా లేదా పరిశీలించాల్సి ఉంటుంది.) 
  • ప్రతి మండల విద్యాశాఖాధికారి కార్యాలయం/ స్కూల్ కాంప్లెక్సుకు వస్తువుల కార్టన్లు / సంచులు | ప్యాకెట్ల రూపంలో చేరుతాయి. అందులో ప్రతి రకానికి సంబంధించి కనీసం ఒక కార్టన్ | సంచి | ప్యాకెట్ పూర్తిగా పరిశీలించాలి.
  • యూనిఫాం క్లాత్ మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి బేల్ రూపంలో చేరుతాయి. .
  • స్కూల్ కాంప్లెక్సుకు అందజేసిన వస్తువుల్లో ఏవైనా పాడైనవి, చినిగినవి గుర్తించిన యెడల సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారికి వెంటనే తెలియజేయాల్సి ఉంటుంది. 
  • మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి చేరిన వస్తువుల్లో ఏవైనా పాడైనవి, చినిగినవి గుర్తించినట్లయితే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి / సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ వారికి వెంటనే తెలియజేయాల్సి నోటు పుస్తకాలు ఉంటుంది.
  •  బ్యాగులు అందిన తర్వాత 'అనుబంధం-1'లో పేర్కొన్న విధంగా తరగతి వారీగా వస్తువులన్నీ సెట్లుగా చేసి బ్యాగులో పెట్టించాలి. 
  • ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో, నిర్దేశించిన విధంగా విద్యార్థులకు వెంటనే అందజేయగలిగేలా కిట్లు సన్నద్ధంగా ఉంచాలి. 
  • తరగతి వారీగా ఏ విద్యార్థికి ఏయే వస్తువులు ఎన్నెన్ని ఇవ్వాలో 'అనుబంధం-1'లో పొందుపరచడమైనది. 
  • ఈ కార్యక్రమం అమలు కోసం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు మరియు కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలి. 
  • ఈ కార్యక్రమం సమిష్టి బాధ్యతగా భావించాలి. 
JVK 2022 NOTE BOOKS నోటు పుస్తకాలకు సంబంధించి
  • సప్లయర్స్ నుంచి స్కూల్ కాంప్లెక్సులకు నేరుగా వస్తువులు అందుతాయి. 
  • బాక్సుల్లో నోటు పుస్తకాలు స్కూల్ కాంప్లెక్సులకు చేరుతాయి. 
  • ఒక్కో బాక్సులో ఒకే రకానికి చెందిన నోటు పుస్తకాలు ఉంటాయి. 
  • వైట్ నోట్ బుక్స్, రూల్డ్ నోట్ బుక్స్, బ్రాడ్ రూల్డ్, గ్రాఫ్ పుస్తకాలు ఇలా నాలుగు రకాల నోటు పుస్తకాలు ఉంటాయి. 
  • వీటికి సంబంధించిన కవర్ పేజీల ఫొటోలు ఇక్కడ ఇవ్వడమైనది. 
  • నోటు పుస్తకాలు సంబంధిత స్కూల్ కాంప్లెక్సుకు చేరగానే సరిపోయినంత వస్తువులు వచ్చాయా లేదా సరి చూసుకోవాలి. లేని విద్యాశాఖాధికారులకు తెలియజేయాలి. 
  • రవాణా సమయంలో నోటు పుస్తకాలు ఏవైనా చినిగినవా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అటువంటి పరిస్థితుల్లో వాటిని రిజెక్ట్ చేసి సంబంధిత మండల విద్యాశాఖాధికారికి తెలియజేయాలి.
  • మరియు 'జగనన్న విద్యాకానుక' యాప్ నందు నమోదు చేయాలి. 
  • తర్వాత రాష్ట్ర కార్యాలయానికి సమాచారం నిమిత్తం spdapssapeshi@gmail.comకు ఈమెయిల్ పంపాలి. 
యూనిఫాం సంబంధించి 
  • యూనిఫాం క్లాత్ మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి వచ్చే ముందు సప్లయర్స్ సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. 
  • మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి సరిపోయినన్ని వస్తువులు వచ్చాయా లేదా సరి చూసుకోవాలి. 
  • యూనిఫాంకు సంబంధించిన ప్యాక్ కవర్ పైన బాలికలకు సంబందించినవైతే 'Girls' అని బాలురకు సంబంధించినవైతే ‘Boys' అని, దీంతోపాటు తరగతి అంకె ముద్రించి ఉంటుంది. ఎవరిదైతే వారి దగ్గర 'టిక్' మార్క్ ముద్రించి ఉంటుంది. 
  • బేల్ లో యూనిఫాం ప్యాకెట్లు ఉంటాయి. 
  • ఒక్కొక్క బేల్ లో ఎన్నెన్ని ప్యాకెట్లు ఉంటాయో ముద్రించి ఉంటుంది. 
  • ఒక్కో బేల్ లో ఒకే తరగతికి చెందిన యూనిఫాం క్లాత్ ప్యాకెట్ రూపంలో వస్తుంది. 
  • ఒక్కో ప్యాకెట్లో 3 జతలకు సరిపడే యూనిఫాం క్లాత్ ఉంటుంది. 
  • ఒకటి నుండి 5వ తరగతి బాలికలకు, అన్ని తరగతుల బాలురకు ప్యాకెట్లో రెండు క్లాత్ పీసులు ఉంటాయి. 
  • 6-8 తరగతుల బాలికలకు 3 క్లాత్ పీసులు ఉంటాయి.
  • తరగతి వారీగా షర్టింగ్, సూటింగ్, చున్నీకి సంబంధించిన కొలతలు కూడా ముద్రించి ఉంటాయి. యూనిఫాం బేల్ లో ఒక్కో తరగతికి చెందిన క్లాత్ కొలతలు సరిగా సరిపోయాయా లేదా అనేది బేల్ లో ఒక ప్యాకెట్ తీసుకుని చెక్ చేయాలి.
  • (ఉదా: పై కొలతల్లో పేర్కొన్నట్లు ఒకటో తరగతి అబ్బాయి సూటింగ్ క్లాత్ 1.05 మీటర్లు,
  • షర్టింగ్ క్లాత్ 1.47 మీటర్లు ఉండాలి. 
  • పై పేర్కొన్న కొలతల ప్రకారం ఉందా లేదా అనేది కొలవాలి. 
  • అలానే అన్ని తరగతులకు చెందిన బాలబాలికల క్లాత్ కొలతలు సరిగా ఉన్నాయా లేదా అనేది స్నేలు/ టేపుతో కొలిచి పరిశీలించాలి) రవాణా సమయంలో యూనిఫాం ఏవైనా చినిగినవా లేదా పాడైనవా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. 
  • ముఖ్యంగా గమనించవలసిన విషయాల్లో యూనిఫాం క్లాత్ యొక్క రంగు ఇచ్చిన నమూనాతో సరిపోలి ఉందా లేదా అని చూసుకోవాలి. 
  • క్లాత్ నాణ్యత బాగాలేకపోయినా, రంగు మారినా, చినిగిపోయినా రిజక్ట్ చేసి వెనక్కి పంపవచ్చు. 
  • రిజక్ట్ చేసిన సమాచారాన్ని సంబంధిత మండల విద్యాశాఖాధికారి/ సీఎంవో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ వారికి సమాచారం ఇవ్వాలి. మరియు 'జగనన్న విద్యాకానుక' యాప్ నందు నమోదు చేయాలి. 
  • తర్వాత రాష్ట్ర కార్యాలయానికి సమాచారం నిమిత్తం ఆpdapssapeshi@gmail.com కు ఈమెయిల్ పంపాలి.


బ్యాగులకు సంబంధించి 
సప్లయిర్స్ నుంచి స్కూల్ కాంప్లెక్సులకు నేరుగా బ్యాగులు అందుతాయి. 
  • బాలబాలికలకు ఒకే రకం బ్యాగులు అందజేయబడతాయి. 
  • 3 సైజుల్లో (స్మాల్, మీడియం, లార్జ్) ఉంటాయి. 
  1. ఎ) 1,2,3 4వ తరగతులకు స్మాల్ సైజు బ్యాగు 
  2. బి) 5, 6, 7వ తరగతులకు మీడియం సైజు బ్యాగు 
  3. సి) 8,9,10వ తరగతులకు లార్జ్ సైజు బ్యాగు అందించబడుతుంది. 
  • సరిపోయినన్ని వస్తువులు స్కూల్ కాంప్లెక్సుకు వచ్చాయా లేదా సరి చూసుకోవాలి. 
  • రవాణా సమయంలో బ్యాగులు ఏవైనా చినిగినవా, పాడైనవా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. 
  • ముఖ్యంగా గమనించవలసిన విషయాల్లో బ్యాగు నందు డబుల్ జిప్పులు, షోల్డర్, డబుల్ రివిట్స్, షోల్డర్ స్టాప్ ఫోమ్, హ్యాండిల్, బ్యాగు ఇన్నర్ క్లాత్ సరిగా ఉన్నాయో లేదో నమూనాకు సరిపోలి ఉందా? లేదా? అని చూసుకోవాలి. 
  • 2 లేదా 3 బేల్లోని బ్యాగులు చెక్ చేయాలి. 
  • వాటిల్లో నాణ్యత బాగాలేకపోయినా, చినిగిపోయినా రిజక్ట్ చేసి వెనక్కి పంపవచ్చు. 
  • రిజక్ట్ చేసిన సమాచారాన్ని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సంబంధిత మండల విద్యాశాఖాధికారికి తెలియజేయాలి. మరియు 'జగనన్న విద్యాకానుక' యాప్ నందు నమోదు చేయాలి. తర్వాత రాష్ట్ర కార్యాలయానికి సమాచారం నిమిత్తం Spdapssapeshi@gmail.comకు ఈమెయిల్ పంపాలి.

JVK 2022 BELTS బెల్టులకు సంబంధించి
సప్లయిర్స్ నుంచి స్కూల్ కాంప్లెక్సులకు నేరుగా అందుతాయి. బెల్టులు నాలుగు రకాలు అందజేయబడతాయి.
  1. (ఎ) 1 నుంచి 5 వతరగతి బాలురు (80 సెంటీమీటర్లు) 
  2. (బి) 6 నుంచి 8వ తరగతి బాలురు (90 సెంటీమీటర్లు)
  3. (సి) 9, 10వ తరగతి బాలురు (100 సెంటీ మీటర్లు) 
  4. (డి) 1 నుంచి 5 వతరగతి బాలికలకు శాటన్ క్లాత్ తో కూడిన బెల్ట్ (80 సెంటీమీటర్లు)
  • సరిపోయినన్ని వస్తువులు స్కూల్ కాంప్లెక్సులకు వచ్చిందా లేదా సరి చూసుకోవాలి.
  • వచ్చిన బెల్టుల్లో నవారు చినిగిపోయిందా? ఏమైనా డ్యా మేజ్ అయ్యిందా తనిఖీ చేయాలి.
  • బెల్టు బకెల్ లింక్ సరిగా ఉందా లేదా గమనించాలి. 
  • రవాణా సమయంలో ఏదైనా చినిగినవా, పాడైనవా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా గమనించవలసిన విషయాల్లో నమూనా బెల్టుతో వచ్చిన వస్తువులులోని బెల్టులు సరిపోలి ఉన్నాయా లేవా అని చూసుకోవాలి.
  •  వాటిల్లో నాణ్యత బాగా లేకపోయినా, చినిగిపోయినా, డ్యా మేజ్ అయిన రిజక్ట్ చేసి వెనక్కి పంపవచ్చు. 
  • రిజక్ట్ చేసిన సమాచారాన్ని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సంబంధిత మండల విద్యాశాఖాధికారికి తెలియజేయాలి. మరియు 'జగనన్న విద్యాకానుక' యాప్ నందు నమోదు. చేయాలి. 
  • తర్వాత రాష్ట్ర కార్యాలయానికి సమాచారం నిమిత్తం సpdapssapeshi@gmail.com కు ఈమెయిల్ పంపాలి.
బూట్లు మరియు సాక్సులకు సంబంధించి
  • సప్లయర్స్ నుంచి స్కూల్ కాంప్లెక్సులకు నేరుగా బూట్లు మరియు సాక్సులు అందుతాయి. 
  • ఒక్కో బ్యాగుల్లో ఒక్కో సైజు, బాలబాలికలకు విడివిడిగా అందుతాయి. 
  • బూట్లు, సాక్సులుకు సంబంధిత స్కూల్ కాంప్లెక్సుకు చేరగానే సరిపోయినన్ని వచ్చాయా లేదా సరి చూసుకోవాలి. లేని పక్షంలో స్కూల్ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు సదరు మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయాలి. 
  • రవాణా సమయంలో నోటు పుస్తకాలు ఏవైనా చినిగినవా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అటువంటి పరిస్థితుల్లో వాటిని రిజెక్ట్ చేసి సంబంధిత మండల విద్యాశాఖాధికారికి తెలియజేయాలి. మరియు 'జగనన్న విద్యాకానుక' యాప్ నందు నమోదు చేయాలి. 
  • తర్వాత రాష్ట్ర కార్యాలయానికి సమాచారం నిమిత్తం spdapssapeshi@gmail.comకు ఇ-మెయిల్ పంపాలి. మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి బూట్లు, సాక్సుల సరుకు లోడు వచ్చిన తర్వాత బూట్లు, సాక్సులు అబ్బాయిలకు, అమ్మాయిలకు విడివిడిగా సైజులు వారీగా సర్దుకోవాలి.
JVK 2022 Dictionaries డిక్షనరీలకు సంబంధించి 
  • సప్లయిర్స్ నుంచి జిల్లా కేంద్రాలకు నేరుగా వస్తువులు అందుతాయి. జిల్లాల్లో అన్ని పాఠశాలల్లో 1 మరియు 6 తరగతులకు సరిపోయినన్ని డిక్షనరీలు ఉన్నాయా లేవా అన్నది జిల్లా విద్యాశాఖాధికారి వారు మరియు జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటరు వారు - సరిచూసుకోవాలి. 
  • ఒకటో తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ, ఆరో తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందజేయవలసి ఉంటుంది. 
  • రవాణా సమయంలో ఏవైనా చినిగినవా మరియు సరిగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అటువంటి పరిస్థితుల్లో వాటిని రిజక్ట్ చేసి సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి మరియు జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటరు వారు సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయానికి తెలియజేయాలి. జిల్లా కేంద్రాల నుంచి పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు ఎలా సరఫరా చేస్తున్నారో అదే పద్ధతిని డిక్షనరీలు సరఫరాలో కూడా పాటించాలి.
స్టాకు రిజిస్టర్ నిర్వహణ 
ప్రతి మండల విద్యాశాఖాధికారి కార్యాలయం | స్కూల్ కాంప్లెక్సు/ పాఠశాలలో తప్పనిసరిగా 'జగనన్న విద్యాకానుక'కు సంబంధించి ఒక స్టాకు రిజిస్టరును నిర్వహించాలి. 
స్టాకు వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అధికారులు సంబంధిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయం | స్కూల్ కాంప్లెక్సు తనిఖీ నిమిత్తం సందర్శించినప్పుడు స్టాకు రిజిస్టర్ తప్పనిసరిగా చూపించవలసి ఉంటుంది. 

డెలివరీ చలానాలు
  • ప్రతి మండల విద్యాశాఖాధికారి కార్యాలయం / స్కూల్ కాంప్లెక్సులో 'జగనన్న విద్యాకానుక'కు సంబంధించి వస్తువులు వచ్చిన తర్వాత అవి సరిగా ఉన్న తర్వాత చలానాల్లో సంతకాలు పెట్టాలి. కిట్ కు సంబంధించి మొత్తం ఎన్ని వస్తువులు వచ్చాయో పూర్తిగా లెక్కపెట్టిన తర్వాతే చలనాల్లో సంతకం పెట్టాల్సి ఉంటుంది. 
  • రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన చలానాలు చేరిన తర్వాత వస్తువుల్లో సంఖ్య మార్పులు చేయడం వంటివి ఉండకూడదు. 
  • వస్తువులు పూర్తిగా అందిన తర్వాత వస్తువుల సంఖ్య పూర్తిగా సరిచూసుకున్న తర్వాతే డెలివరీ చలానా యందు సంబంధిత సీఎంవో, మండల విద్యాశాఖాధికారి/ స్కూల్ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు మాత్రమే సంతకం (తేదీతో సహ) చేయాలి. స్టాంపు తప్పనిసరి.
  • లేకపోతే సంబంధిత సీఎంవో! మండల విద్యాశాఖాధికారి/ స్కూల్ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించవలసి ఉంటుంది.
  • తర్వాత ఎటువంటి ఫిర్యాదులు స్వీకరించబడవు. 
  • సప్లయర్స్ ఇచ్చే 3 చలానాల్లో సంతకం చేసి కార్యాలయ ముద్ర వేయాల్సి ఉంటుంది. 
  • తర్వాత ఆ చలానా ఒకటి పాఠశాలలో, మరొకటి జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో ఏపీసీ దగ్గర, మూడో చలానా రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. 
  • సప్లయర్స్ ఇచ్చే 3 చలానాల్లో సంబంధిత సీఎంవో | మండల విద్యాశాఖాధికారి/ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సంతకం, వస్తువులు తీసుకున్న తేదీ తప్పక ఉండేలా చూసుకోవాలి.
లాగిన్లలో నమోదు 
  • 'జగనన్న విద్యాకానుక' స్టూడెంట్ కిట్ల పంపిణీ వివరాలు 'జగనన్న విద్యా కానుక'యాప్ నందు నమోదు చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన లాగిన్ వివరాలు సంబంధిత జిల్లాలకు పంపడం జరిగింది. 
  • ఏవైనా సందేహాలు, సమస్యలు ఎదురైతే రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం 0866 2428599 నంబరుకు పని వేళల్లో సంప్రదించగలరు.
  • రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ కార్యక్రమం సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.
  • పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది.