AP Employees New Online Pension Proposals - Pension authorization New System
SALIENT FEATURES OF THE NEW SYSTEM:- 1. In the proposed new system, Pension proposals by the retiring employees are to be submitted to the State Audit Department through CFMS through the respective pension sanctioning authority.
- 2. Old pension proposals/Forms containing 13 pages are simplified and reduced now to 4 pages.
- 3. The submission of proposals through online mode only, its establishes transparency and promotes swift processing of pensions.
- 4. Most of the data of the retired employee is automatically captured from the existing CFMS data to reduce time to fill up the forms.
- 5. All the calculations are made automatic in the new software to facilitate the pensioners.
- 6. Biometric authorization for the security of the money of the pensioners.
- 7. Comprehensive pension proposal preparation by the Pension sanctioning authority only to remove middlemen.
- 8. Online forwarding of PPO/GPO/CPO to treasury authorities and the departmental authorities.
- 9. If retired employee can accept the above in electronic mode the same can also be delivered through email.
- 10. SMS alert facility on the status of the pension case to the mobile number of the retiree.
నూతన ఆన్లైన్ పెన్షస్ ఆథరైజేషన్ విధానము
తేది:30-7-2022న ప్రతిపాదిత నూతన ఆన్లైన్ పెన్షస్ ఆథరైజేషన్ విధానము అవగాహన కార్యక్రమం
నూతన విధానమునందు గల విశిష్ట లక్షణములు:
నూతన విధానమునందు గల విశిష్ట లక్షణములు:
- 1. ఈ నూతన విధానం ద్వారా, పదవీ విరమణ చేసిన / చేయుచున్న ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలను సంబంధిత పెన్షన్ CFMS ద్వారా మంజూరు అధికారుల ఋజు మార్గము ద్వారా రాష్ట్ర ఆడిట్ విభాగానికి సమర్పించాలి.
- 2. పాత పెన్షన్ ప్రతిపాదనలు 13 పేజీలతో కూడిన ఫారమ్ లు, సరళీకృతం చేయబడ్డాయి మరియు ఇప్పుడు 4 పేజీలకు కుదించబడినవి.
- 3. ఇక పై ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే పెన్షన్ ప్రతిపాదనలు సమర్పించడం వలన పారదర్శకత ఏర్పడుతుంది మరియు పింఛను ప్రక్రియ వేగవంత గా జరుపబడుతుంది.
- 4. ఇక మీదట పింఛనుదారుల సంబంధిత వివరములు ఆటోమేటిక్ అనగా, ముందస్తుగా CFMS లో నమోదు కాబడిన వివరములను గ్రహించుకొని వాని ద్వార వివరములు పూరింప బడును.
- 5. పింఛనుదారుల సౌకర్యార్థం కొత్త స్వా ర్ లో అన్ని లెక్కలు ఆటోమేటిక్ గా తయారు చేయబడ్డాయి.
- 6. పింఛను మంజూరునకుగాను పింఛనుదారుల భద్రతకు / గోప్యతకు వీలుగా బయోమెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టడమైనది.
- 7. నూతన పింఛను విధానం నందు సమగ్ర పింఛను ప్రతిపాదనలను నేరుగా మంజూరు అధికారి వారే చేయటం వలన మధ్యవర్తి ఇబ్బందులను తొలగించవచ్చును.
- 8. ఈ నూతన పింఛను విధానం నందు ఆన్లైన్ ద్వారా నే PPO/GPO/CPO ల ను ట్రెజరీ అధికారులకు మరియు సంబంధిత శాఖలకు జారి చేయబడతాయి.
- 9. ఈ నూతన పింఛను విధానము నందు సంబంధిత పదవీ విరమణ చేసిన ఉద్యోగి అంగీకరించిన యెడల ఇమెయిల్ ద్వారా సమాచారం అందిచబడును.
- 10. సంబంధిత పింఛను దారునకు కేసు కు సంబంధించిన వివరములను, సంక్షిప్త సమాచారము ను మొబైల్ నంబర్‌కు అందచేయబడుతుంది.