పార్ట్ -9 ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు

పార్ట్ -8  ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు 


ప్రశ్న : నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలులో పని చేస్తున్నాను. నేను 2015 స్కేళ్ళలో 35120-87130 స్కేలులో స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు పొంది 98440 మూలవేతనంగా కలిగి ఉన్నాను. తదుపరి వచ్చే 18 సం||ల ఇంక్రిమెంట్‌ను పొందలేకపోయాను. 1-72018న 2022 వేతన స్కేళ్ళలో 54160-140540 స్కేలులో 140540 వద్ద నా వేతనం స్థిరీకరించ బడింది. నా ఇంక్రిమెంట్ నెల ఆగష్టు నేను నా తదుపరి ఇంక్రిమెంట్లు పొందగలనా? 
అదే విధంగా 18 సం||ల ఇంక్రిమెంటు వస్తుందా? 18 సం||ల సర్వీసు 01-12 2020 నాటికి పూర్తి అయింది.
జవాబు : 1-7-2018న మూల వేతనం 54160-140540 స్కేలులో గరిష్ట వేతనమైన 140540 వద్ద స్థిరీకరించ బడినందున తదుపరి 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి. 2018,2019, 2020,2021 సం|| ఇంక్రిమెంట్లతోపాటు 18 సం|| ఇంక్రిమెంట్ కూడా వర్తిస్తుంది.

ప్రశ్న : ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లేక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కు డిగ్రీ, బిఇడి అర్హతలుంటే స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇవ్వ వచ్చునా?
జవాబు : ప్రస్తుతం అటువంటి అవకాశం లేదు. 

ప్రశ్న : నేను SGT గా 2016 మార్చిలో 30 సం||ల సర్వీస్ పూర్తి చేసుకున్నాను. జులై 2019లో స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందాను. నేను ఎజిటి కేడర్ లో 30 సం||ల ఇంక్రిమెంట్ పొందగలనా?
జవాబు : మీరు 1-7-2018 నాటికే 30 సం||ల సర్వీస్ పూర్తి చేసుకున్నందున మరియు 1-7-2018న మీరు అదే కేడర్‌లో ఉన్నందువలన మీకు 1-7-2018 నుండి ఎజిటి కేడర్ లో 30 సం||ల ఇంక్రిమెంట్ ఇవ్వ బడుతుంది.

ప్రశ్న : నా ఏపిజిఎ చివరి ప్రీమియం తేదీ ముగిసినా ఇంకా నాలుగు నెలలు ప్రీమియం అదనంగా మినహాయింపు జరిగింది. అదనంగా చెల్లించిన ప్రీమియం తిరిగి వస్తుందా? -
జవాబు : చివరి ప్రీమియం తేదీ మీ బాండ్లో ఉంటుంది. సదరు విషయాన్ని మీ డిడిఓకి తెలియజేసి మినహాయింపు ఆపమని కోరాలి. ఇప్పటికైనా విషయాన్ని డిడిఓ దృష్టికి తీసుకెళ్ళండి. రికవరీ నిలుపుదల చేస్తారు. ఏపిజిఎ ముగింపు దరఖాస్తును పంపుకుంటే అదనంగా చెల్లించిన మొత్తం కూడా మీ చివరి చెల్లింపుతోపాటు చెల్లిస్తారు.

 ప్రశ్న : శిశు సంరక్షణ సెలవు గరిష్టంగా 3 పర్యాయములు మాత్రమే వాడుకోవాలని ఒక మేసేజ్ వాట్సాప్ లో వస్తోంది. నిజమేనా?
జవాబు : వాస్తవం కాదు. శిశు సంరక్షణ సెలవు ఉత్తర్వులు జిఓ ఎంఎస్ నం.33 ఆర్థిక తేదీ. 08.03.2022నందు జిఓ ఎంఎస్ నం.132 ఆర్ధిక తేదీ.06-07-2016లో ఇవ్వ బడిన నిబంధన కొనసాగుతాయని పేర్కొన్నారు. జిఓ 132లో 3 పర్యాయములకు తగ్గకుండా అని మాత్రమే ఉంది. గరిష్టంగా 3 పర్యాయములు అని లేదు. 

ప్రశ్న : ఒక ఉపాధ్యాయులు 7 రోజులు సమైక్యాంధ్ర సెలవులు పెట్టుకున్నారు. మధ్యలో రెండవ శనివారం, ఆదివారం సెలవులు వచ్చినాయి. వాటికి అనుమతి ఇస్తారా?
జవాబు : ఇవ్వరు. సమైక్యాంధ్ర సెలవులు నగదుగా మార్చుకొనటం మినహా సంపాదిత సెలవు మాదిరిగానే వర్తిస్తాయి. అందుచేత మధ్యలో వచ్చిన సెలవులు కూడా సమైక్యాంధ్ర సెలవులుగానే పరిగణించబడతాయి.

ప్రశ్న : ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి శాఖాపరమైన పరీక్షలకు మినహాయింపు ఉంటుందా?
జవాబు : జిఓ ఎంఎస్ నం.23 పాఠశాల విద్య; తేదీ. 28.01.2019 ప్రకారం 50 సం|| వయస్సు నిండిన వారికి పదోన్నతులలో శాఖాపరమైన పరీక్షల నుండి మినహా యింపు వర్తిస్తుంది.

Read Ikyopadhyaya