Telugu Top Educational Employees News 28th Sep

ప్రభుత్వ పాఠశాలలు భేష్

విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నాడు-నేడు పనులపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ప్రశంస
కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరుపాఠశాలల పరిశీలన

పెనమలూరు/కంకిపాడు: మనబడి నాడు - నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారా యని, మౌలిక వసతులు భేషుగ్గా ఉన్నాయని ప్రపం చ బ్యాంకు ప్రతినిధి బృందం కితాబిచ్చింది. కృష్ణా జిల్లా కంకిపాడులోని మండల పరిషత్ ఆదర్శ పాఠ శాల, జెడ్పీ పాఠశాల, పెనమలూరు జిల్లా పరిషత్ పాఠశాలలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం మంగళవారం పరిశీలించింది. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టు (ఎస్ఏఎల్) ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిం చడానికి ఈ బృందం వచ్చింది. ఆయా పాఠశాలల్లో భవన నిర్మాణాలు, కల్పించిన మౌలిక వసతులను పరిశీలించి, నిర్మాణ పనుల నాణ్యతను తనిఖీ చే సింది. పారిశుధ్య నిర్వహణకు వినియోగిస్తున్న సామగ్రిని పరిశీలించింది. తరగతి గదుల్లో విద్యార్థు లకు అర్థమయ్యే రీతిలో సాగిస్తున్న బోధన తీరును ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రశంసించారు. నాణ్యత, మౌలిక వసతులతో పాఠశాలల రూపురే ఖలు మారడంతో విద్యా ప్రమాణాల స్థాయి పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాడు-నే ద్వారా తొలి దశ, రెండో దశల్లో చేపట్టిన అభి వృద్ధి పనులు, కేటాయించిన నిధులు, మౌలిక వస తుల కల్పన చర్యలను నాడు-నేడు ప్రత్యేక అధికారి మురళి ప్రపంచ బ్యాంకు బృందానికి వివరించారు.

♦️విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదగాలి..
ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంక్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ టాస్క్ టీమ్ లీడర్ కార్తీక్ పెంతల్ మాట్లాడుతూ.. నాడు-నేడు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అనేక సదుపాయాలు కల్పించిందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రపంచ స్థాయికి ఎదగాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు. వసతులు బాగున్నాయని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆకునూరు మురళి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అతుర్పానే, ట్రెసివిలి కొష్కి ఆదిత్య శర్మ, స్వాతి గమేలియల్, సురభి, దీప బాలకృష్ణన్, కాంచన్ రాజీవ్సంగ్, తనూష్ మాధుర్, కృష్ణా డీఈవో తాహేరా సుల్తానా, పలువురు కన్సల్టెంట్లు పాల్గొన్నారు.

ఆడపిల్లలకు జీవన నైపుణ్యాలు నేర్పించాలి -బాలికా విద్యాభివృద్ధికి 'ప్రాజెక్ట్ కస్తూరి' ప్రారంభం

పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్

 ప్రతి అమ్మాయి చదువుకునేలా అందరూ బాధ్యత వహించా లని, ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించేలా తర్ఫీదు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కు మార్ అన్నారు. సమగ్ర శిక్షా, రూమ్ టూ రీడ్ సంయుక్త ఆధ్వర్యంలో బాలికా విద్యాభివృద్ధి కోసం 'ప్రాజెక్ట్ కస్తూరి' కార్యక్రమాన్ని మంగళవారం విజయ వాడలోని ఓ హోటల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ చదువు జీవితానికి ఒక వారధి అని, ప్రతి విద్యార్థికి చదివే నైపుణ్యం, సృజనా త్మకత, జీవన నైపుణ్యాలు పెంపొందించడానికి కృషి చేయాలని చెప్పారు. 'ప్రాజెక్ట్ కస్తూరి' కార్యక్రమాన్ని తొలుత కడప జిల్లాలోని చాపాడు, దువ్వూరు, ఖాజీపేట, మైదుకూరు, వల్లూరు, పెండ్లిమర్రి కేజీబీవీల్లో 6, 7, 8 తరగతుల విద్యార్థినులకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ఆత్మవిశ్వాసం పెంపొందించడం, భావోద్వేగాలను నియంత్రించ డం, స్వీయనియంత్రణ పాటించడం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి, సొంతగా నిర్ణయాలు తీసుకోవడం, పట్టుదలగా పని చేయడం, సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించడం, సంబంధ బాంధవ్యాలను ఏర్పరుచుకో వడం తదితర జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తామని వివరించారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయ, విద్యార్థి కరదీపికలను ఆవిష్కరించారు.

పాలిటెక్నిక్ కళాశాలల్లో పరిశ్రమల అనుసంధానంతో కోర్సులు

అమరావతి: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు కొత్త కోర్సులను ప్రారంభించనున్నారు. పరి శ్రమల అనుసంధానంతో కోర్సులను డిజైన్ చేశారు. రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్, ఫుట్వేర్ టెక్నాలజీ కోర్సులను ప్రవేశపెట్టను న్నారు. శ్రీసిటీలోని పరిశ్రమల భాగస్వామ్యంతో సిలబస్ ను రూపొంది స్తున్నారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేయగానే ఆయా కంపెనీలే ఉద్యో గాల్లోకి తీసుకునేలా ప్రణాళిక రూపొందించారు. పరిశ్రమలతో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇప్పటికే కమిషనర్ పరిశ్రమలను సందర్శించి, ఉద్యోగ అవకాశాలను పరిశీలించారు. శ్రీసిటీలోని డైకిన్ కంపెనీకి రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండి షనింగ్లో ఏటా 300 నుంచి 500 మంది వరకు అవసరమవుతున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్లలో ఈ కోర్సు పూర్తిచేసినవారిని నేరుగా ఉద్యోగం లోకి తీసుకుంటారు. మరో కంపెనీ అపాచీ టాడాకు వచ్చే ఏడాది 2 వేల మంది వరకు ఫుట్వేర్ టెక్నాలజీ కోర్సు చదివినవారు అవసరం కాను న్నారు. ఈ కంపెనీ పులివెందుల, వెంకటగిరిలోనూ ప్లాంట్లను ప్రారం భిస్తే ఉద్యోగ అవసరాలు మరింత పెరుగుతాయి.

డిగ్రీ వెబ్ ఐచ్ఛికాలు  అక్టోబరు 5 వరకు

అమరావతి: డిగ్రీ ఆన్లైన్ కౌన్సెలింగ్లో వెబ్ ఐచ్ఛికాల నమోదుకు అక్టోబరు ఐదో తేదీ వరకు అవకాశం కల్పించారు. వెబ్ ఐచ్చికాల అనంతరం 9న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులకు 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి

డీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలు అక్టోబరు 26 నుంచి

అమరావతి: డీఈడీ 2020-22 రెగ్యులర్ విద్యార్థులకు మూడో సెమిస్టర్, 2019-21లో ఫెయిలైన వారికి అక్టోబరు 26 నుంచి నవంబరు 1 వరకు పరీక్షలు నిర్వహించను న్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానం దరెడ్డి తెలిపారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

ధరల సూచికకు అనుగుణంగా కనీస వేతనాలకు సవరణ

అమరావతి: రాష్ట్రంలో అక్టోబరు నుంచి కనీస వేతనాల అమలుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికే షన్ జారీచేసింది. వినియోగదారుల ధరల సూచి ఆధా రంగా సవరించిన వేతన రేట్లను విడుదల చేసింది. పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యవసాయ కార్మికు లకు వీటిని అమలుచేయాలని ఆదేశించింది. గత జూన్ వరకు ఉన్న ధరల ఆధారంగా అక్టోబరు కనీస వేతనా లను సవరించింది.

సెలవుల్లో తరగతులు నిర్వహించే విద్యాసంస్థలపై చర్యలకు ఫిర్యాదు

అమరావతి: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ పార్వతికి ప్రైవేటు టీచర్లు, లెక్చ రర్ల సంఘం అధ్యక్షుడు అంబేడ్కర్ ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తూ ప్రైవేటు ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.

దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక టీచర్లు తప్పనిసరి

♦️విద్యాహక్కు చట్టానికి కేంద్రం సవరణ

దిల్లీ: ఇకపై ప్రతి పాఠశాలలో దివ్యాంగ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక టీచర్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు విద్యా హక్కు చట్టం-2009కి సవరణలు చేస్తూ మంగళవారం నోటిఫికేషన్ జారీచే సింది. 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి 10 మంది దివ్యాంగుల కోసం, 6 నుంచి 8వ తరగతికి అయితే ప్రతి 15 మంది కోసం ఒక ప్రత్యేక టీచర్ ఉండాలని స్పష్టంచేసింది. ఒకవేళ ఈ సంఖ్య ప్రకారం ప్రత్యేక టీచర్లు దొర క్కపోయినప్పుడు, ఏకోపాధ్యాయులతో పాఠశాలలు నడుస్తున్నప్పుడు కొన్ని పాఠశాలల్ని క్లస్టర్ గా గుర్తించి అందులో ఉన్న దివ్యాంగుల పిల్లల నిష్పత్తికి సరిపోయేలా ప్రత్యేక ఉపధ్యాయుల్ని నియమించాలని స్పష్టంచేసింది. అయితే ఈ క్లస్టర్లో స్కూళ్ల సంఖ్య 4కి మించకూడదని, అలాగే వాటి మధ్య దూరం 5 కిలోమీటర్లు దాటకూడదని షరతు విధించింది.

లింక్డ్ఇన్ ప్రతినిధులతో  ఉన్నత విద్యామండలి చర్చలు

అమరావతి: అధ్యాపకుల సామర్థ్యాలను పెంచేందుకు, కంటెంట్ తయారీ, ఉద్యోగాలకు విద్యార్థులను సంసిద్ధులను చేయడం, కెరీర్ మార్గదర్శకత్వం లాంటి వాటిల్లో లింక్డ్ ఇన్ సహకారం కోరుతు న్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. లింక్డ్ఇన్ ఇండియా హెడ్ సాబా కరీమ్, సీనియర్ డైరెక్టర్ రుచి ఆనంద్, కస్టమర్ మేనేజర్ ఇషా గుప్తాలతో ఉన్నత విద్యామండలిలో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్తులో లింక్డ్ఇన్ సహాయంపై చర్చించారు. ఉన్నతవిద్యలో ఏపీ ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలు, అమలుచేస్తున్న విధానాలను హేమచంద్రారెడ్డి వివరిం చారు. అక్టోబరు నుంచి 3.5 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ ప్రారంభించనున్నామని, అభ్యసన నిర్వహణ విధానం(ఎల్ఎంఎస్)లో తిలక్షల మంది విద్యార్థులు నమోదయ్యారని ఆయన వెల్లడించారు.

ట్రిపుల్‌ ఐటీ కౌన్సెలింగ్‌  ప్రారంభం

సెప్టెంబరు 27: ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశానికి సంబంధించి ఆర్జీయూకేటీ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ మంగళ వారం ప్రారంభమైంది. 27 నుంచి 30 వరకు స్పెషల్‌ కేటగిరీలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జరుగుతుంది. ఆచార్య జీవీఆర్‌ శ్రీనివాసరావు, నిర్దేశకులు ఆర్జీయూకేటీ నూజివీడు క్యాంపస్‌లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. మొదటిరోజు స్పోర్ట్స్‌ కేటగిరీలో 256 మంది, క్యాప్‌ కేటగిరిలో 170 మంది హాజరయ్యారు. విద్యార్థులు వారికి కేటాయిం చిన తేదీల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కాలేని పక్షంలో కింద పేర్కొన్న ఇతర తేదీల్లో కేడర్‌ వారీగా హాజరుకావచ్చు. ఈనెల 28,29,30 తేదీల్లో స్పోర్ట్స్‌ కేటగిరీ , ఎన్‌సీసీ కేటగిరీకి సంబంధించిన వారు, 28న క్యాప్‌ కేటగిరీ, పీహెచ్‌సీ (దివ్యాంగుల కోటా) సంబంధించిన వారు, 29న బీఎస్‌జీ కేటగిరీకి సంబంధించిన వారు హాజరుకావచ్చునని ఆర్జీయూకేటీ అడ్మిషన్స్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోపాలరాజు తెలిపారు.

వాయిదాల ‘ట్యాబ్‌’లు!

♦️సెప్టెంబరులో ఇస్తామని గతంలో ప్రకటన
♦️నవంబరులో ఖాయమన్న మంత్రి బొత్స
♦️ఇప్పుడు డిసెంబరులో ఇచ్చే యోచన!
♦️విద్యార్థుల ఆశలపై సర్కారు నీళ్లు
♦️‘బైజూస్‌’ కంటెంట్‌పైనా సందేహాలు
♦️బేసిక్‌ మాత్రమే ఇచ్చే యోచనలో సంస్థ
♦️మిగిలిన సబ్జెక్టుకు ధర చెల్లించక తప్పదా?
♦️ఇలాగైతే.. భారమేనంటున్న తల్లిదండ్రులు



ఆంధ్రజ్యోతి: విద్యార్థులకు అందించాలని భావించిన ట్యాబ్‌లు వారి చేతికి ఎప్పుడు అందుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. పదే పదే ట్యాబ్‌ల పంపిణీ అంశం వాయిదా పడుతోంది. అదేవిధంగా ల్యాప్‌ట్యా్‌పలు ఇస్తామని మాటమార్చి ట్యాబ్‌లకు వచ్చిన ప్రభుత్వం చివరికి వాటి పంపిణీపై స్పష్టత ఇవ్వలేకపోతోంది. సెప్టెంబరు నెలాఖరులో కొందరికి, అక్టోబరు నెలాఖరులో కొందరికి ఇస్తామని గతంలో ప్రకటించింది. అయితే.. దీనిపై ఇటీవల శాసన మండలిలో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ.. బాలల దినోత్సవం(నవంబరు 14) రోజున పంపిణీ చేస్తామని వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, సర్కారు మాత్రం ఈ వాయిదాలను పెంచుకుంటూనే పోతోంది. తాజాగా ఇప్పుడు ట్యాబుల పంపిణీని డిసెంబరుకు వాయిదా వేసినట్లు తెలిసింది. ట్యాబ్‌లు సరఫరా చేసే సంస్థ సకాలంలో అందించలేకపోవడం, వాటిలో కంటెంట్‌ నింపడంలో సాంకేతిక సమస్యలు కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఇలా పదే పదే వాయిదాలు పడటంతో ట్యాబ్‌లపై విద్యార్థుల్లో అసహనం వ్యక్తమౌతోంది. విద్యా సంవత్సరం చివరి నాటికి వీటిని ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఎనిమిదో తరగతి విద్యార్థులతో పాటు ఆ తరగతికి బోధించే ఉపాధ్యాయులకు కూడా ట్యాబ్‌లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 5,18,740 మందికి ట్యాబ్‌లు ఇవ్వాల్సి ఉంది. ఒక్కో ట్యాబ్‌ను రూ.12,800 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మొత్తం రూ.664 కోట్లు దీనికి ప్రభుత్వం వెచ్చించింది. ఆ ట్యాబ్‌ల్లో బైజూస్‌ సంస్థ కంటెంట్‌ను నిక్షిప్తం చేసి ఇస్తుంది. ఆ కంటెంట్‌ ఆధారంగా ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.

♦️బైజూస్‌ లబ్ధి కోసమేనా?!
ఈ ట్యాబ్‌ల కొనుగోలు వెనుక బైజూస్‌ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఆ సంస్థ పరపతిని పెంచుకునేందుకు ఏకంగా ప్రభుత్వం ద్వారా వారి ఉత్పత్తులకు ప్రచారం చేసుకునే ప్రణాళికను ఏపీలో అమలుచేస్తోందనే వాదన ఉంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఈ సంస్థ డిజిటల్‌ పాఠాలకు డిమాండ్‌ ఉన్నా.. విద్యా సంస్థలు తెరుచుకున్న తర్వాత ఆ సంస్థ కంటెంట్‌కు డిమాండ్‌ పడిపోయింది. ఈ సమయంలో ఆ సంస్థకు ప్రభుత్వమే బ్రాండ్‌ అంబాసిడర్‌ తరహాలో ప్రచారం చేసిందని విమర్శలు వచ్చాయి. కాగా, వారి కంటెంట్‌ను పూర్తి ఉచితంగా ఇస్తామని చెప్పిన బైజూస్‌ ఎంతకాలం ఇస్తుందో తెలపలేదు. పైగా వాటిలోనూ బేసిక్‌ కంటెంట్‌ మాత్రమే ప్రభుత్వ విద్యార్థులకు ఇస్తారని తెలుస్తోంది.

బేసిక్‌ కంటెంట్‌ దాటి లోతైన సబ్జెక్టు కావాలనుకుంటే అటు ప్రభుత్వం ద్వారాగానీ లేదా విద్యార్థులుగానీ అదనపు నగదు చెల్లించక తప్పదనే వాదన వినిపిస్తోంది. ఇదే నిజమైతే తమపై భారం పడడం ఖాయమని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

♦️ల్యాప్‌ట్యాప్‌ నుంచి ట్యాబ్‌కు

పాఠశాల విద్యా వ్యవస్థను గందరగోళం చేసిన వైసీపీ ప్రభుత్వం ల్యాప్‌ట్యా్‌పల విషయంలోనూ మాట తప్పింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ చేసిన ప్రకటననే అమలుచేయలేక వెనకడుగు వేసింది. ‘అమ్మఒడి’ నగదు వద్దనుకున్న విద్యార్థులకు ల్యాప్‌ట్యా్‌పలు ఇస్తామని గతంలో సీఎం జగన్‌ ఆర్భాటంగా ప్రకటించారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఈ క్రమంలో అమ్మఒడికి బదులుగా ల్యాప్‌ట్యాప్‌ కోరుకునే విద్యార్థుల నుంచి ఆప్షన్లు సైతం తీసుకున్నారు. దీంతో ఏకంగా 7 లక్షల మందికిపైగా విద్యార్థులు ల్యాప్‌ట్యా్‌పలకు ఆప్షన్‌ ఇచ్చారు. తీరా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేనాటికి ల్యాప్‌ట్యా్‌పలు భారీ ఖర్చుతో కూడుకున్నదని.. దానిస్థానంలో ట్యాబులు ఇస్తామని సీఎం జగనే స్వయంగా ప్రకటించారు. పైగా ల్యాప్‌ట్యా్‌పలు, సెల్‌ఫోన్ల పోటీతో ట్యాబ్‌ల అమ్మకాలు తగ్గిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

EWS కోటా పై సుప్రీం లో తీర్పు రిజర్వ్ 

ఆర్ధికంగా వెనకబడిన వర్గాల వారికి విద్య ఉద్యోగాల్లో 10% రిసర్వేషన్ పై వాదనలు ముగింపు. తీర్పు రిజర్వ్ 

ఐఐటీ విద్యార్ధుల పై ఫీజుల భారం 

ఆందోళన చేస్తున్న విద్యార్దులు - వివరణాత్మక కధనం