పార్ట్ -10 ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు

పార్ట్ -10  ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు 


ప్రశ్న : నేను 16.06.2004లో SGT చేరాను. మా స్నేహితుడు 18.10.2009లో ఉద్యోగంలో చేరారు. తదుపరి ఇద్దరికి ఒకే రోజు పదోన్నతి వచ్చింది. ఇద్దరిలో ఎవరు సీనియర్.

జవాబు : ఒకేసారి ప్రమోషన్ వచ్చిన సందర్భంలో క్రింది కేడర్లో ఎవరు సీనియర్ అయితే వాళ్ళే సీనియర్ అవుతారు. కావున మీరే సీనియర్ అవుతారు.

Join APTEACHERS Telegram Channel for UPDATES CLICK HERE
Join APTEACHERS WHATSAPP Channel for UPDATES CLICK HERE

ప్రశ్న : నేను SGT ఉపాధ్యాయునిగా పనిచేయుచున్నాను. నాకు అర్హతలు లేనందు వలన 24 సం||ల స్కేలు ఇవ్వలేదు. నాకు 30 సం॥ల సర్వీసు నిండిన తర్వాత 30 సం॥ల ఇంక్రిమెంటు ఇస్తారా?

జవాబు : జిఓ ఎంఎస్ నం.1; తేదీ. 17.01.2022నందు An employee, on completion of 30 years of service in a particular post, may be granted one increment in the SPP Scale IIA/ SAPP Scale IIA, as the case may be, which shall be called the Special Promo tion Post Scale 11 -B/ Special Adhoc Promotion Post Scale 11-B అని పేర్కొన్నారు. దీని ప్రకారం 30 సం||ల ఇంక్రిమెంట్ అంటే 24 సం||ల స్కేలులోనే ఒక ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుంది. మీకు 24 సం||ల స్కేలుకే అర్హత లేనందున 30 సం||ల ఇంక్రిమెంట్ ఇవ్వరు.

ప్రశ్న :: 30 సం||ల ఇంక్రిమెంట్ పొందాలంటే తప్పనిసరిగా 24 సం||ల స్కేలు పొంది ఉండాలా?
జవాబు : అవును. పై ప్రశ్నకు సంబందించిన జవాబు పరిశీలించండి.

ప్రశ్న : నేను SGT 32 సం॥ల సర్వీసు పూర్తి చేసుకొన్న తర్వాత 26.05.2018న పదోన్నతి పొందాను. నాకు 30 సం||ల ఇంక్రిమెంట్ వస్తుందా?
జవాబు : రాదు. 01.07.2018 నాటికి 30 సం॥ల సర్వీసు పూర్తి అయి అదే కేడర్ కొనసాగుతున్నవారికి మాత్రమే 30 సం||ల ఇంక్రిమెంట్ వస్తుంది. మీరు 01.07.2018 కన్నా ముందే పదోన్నతి పొంది కేడర్ మారినందున మీకు 30 సం॥ల ఇంక్రిమెంట్ రాదు.

ప్రశ్న : జీత నష్టపు సెలవుపై వెళ్ళిన వారికి అర్ధజీతపు సెలవు, సంపాదిత సెలవు ఏ విధంగా జమ చేయాలి?
జవాబు : జీత నష్టపు సెలవులో ఉన్నప్పటికీ అర్ధజీతపు సెలవు తగ్గింపు జేయనవసరం లేదు. యధా ప్రకారం జమ చేయాలి. (ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్ 1933 రూల్ నం. 13ఎ) సంపాదిత సెలవు మాత్రమే జీత నష్టపు సెలవులో 1/10 వంతు తగ్గించాలి.

ప్రశ్న : ఒక ఉపాధ్యాయునికి 25.04.2018కి 30 సం||ల సర్వీస్ పూర్తి అయి 24.06.2021న పదోన్నతి పొందారు. వారికి 30 సం॥ల ఇంక్రిమెంటు వస్తుందా? ఆర్థిక లాభం ఎప్పటి నుండి వర్తిస్తుంది? అరియర్స్ ఏ విధంగా చెల్లిస్తారు?
జవాబు : వస్తుంది. ఆర్థిక లాభం 01.04.2020 నుండి వర్తిస్తుంది. 01.07.2018 నుండి 31.03.2020 వరకు బకాయిలు నోషనల్గాను 01.04.2020 నుండి 31.12.2021 వరకు బకాయిలు ఉద్యోగ విరమణ సందర్భంలోనూ, 01.01.2022 బకాయిలు ప్రస్తుతం చెల్లిస్తారు.

ప్రశ్న : సమైక్యాంధ్ర సెలవులతోపాటు సిఎల్ పెట్టుకోవచ్చా?
జవాబు : కుదరదు. సమైక్యాంధ్ర సెలవు నగదుగా మార్చుకోవడం మినహా సంపాదిత సెలవుగానే పరిగణించబడుతుంది. అందువలన సంపాదిత సెలవు సిఎల్ కలిపి వాడుకో రాదు.

ప్రశ్న : ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరికి వర్తిస్తుంది? ఎంత చెల్లిస్తారు?
జవాబు : ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ అందరు నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు, లాస్ట్ గ్రేడ్ ఉద్యోగులకు వర్తిస్తుంది. గరిష్టంగా ఇద్దరు పిల్లల వరకు చెల్లిస్తారు. ఒక్కొక్క పిల్లవానికి రూ.2500/- చెల్లిస్తారు