పార్ట్ -11 ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు Question & Answers

పార్ట్ -11  ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు  Question & Answers
పార్ట్ -11  ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు  Question & Answers

పార్ట్ -11  ఉద్యోగుల - ఉపాధ్యాయుల సర్విస్ మాటర్ -సందేహాలు - సమాధానాలు  Question & Answers


ప్రశ్న : ఒక ఉపాధ్యాయుడు 5-4-1986 నాడు సర్వీసులో చేరి డిసెంబరు 2022 నాటికి కూడా సెకండరీ గ్రేడ్ టీచరుగా ఒకే క్యాడర్లో కొనసాగుతున్నాడు. 24 సం||ల స్కేలు కూడా తీసుకున్నాడు. 30 సం||ల స్కేలుకు అర్హుడా కాదా తెలియజేయండి. ఎప్పటినుండి 30 సం||ల స్కేలు వర్తిస్తుందో తెలపండి.

జవాబు : ఆయన పదోన్నతి రిక్వింకష్ చేసి ఉండకపోతే 1-7- 2018 నుండి 30 సం॥ ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది.

ప్రశ్న : పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుని కమ్యూటేషన్ బిల్లు ఆ ఉపాధ్యాయుడు మొదటి నెల పెన్షన్ చెల్లింపు తరువాత అనుమతించాలా? లేక వెంటనే చెల్లించవచ్చా?
జవాబు : ఫైనాన్షియల్ కోడ్ వాల్యూం -1లోని ఆర్టికల్ 72 ప్రకారం రిటైర్మెంట్ గ్రాట్యూటీ మరియు కమ్యూటేషన్ ఉద్యోగ విరమణ చేసిన మరుసటి రోజే చెల్లించవచ్చు. పెన్షన్ మాత్రం తదుపరి నెల ఒకటవ తేదీన చెల్లించాలి.


ప్రశ్న : ఒక ఉపాధ్యాయుడు 1 సం॥ 6 నెలలు వ్యక్తిగత కారణ ములపై జీత నష్టపు సెలవు పెట్టినారు. ఆయన తిరిగి ఉద్యోగంలో చేరుటకు దరఖాస్తు చేసినారు. ఆయనకు అదే పాఠశాలలో పోస్టింగ్ ఇవ్వవలెనా లేదా వేరే పాఠశాలలో అయినా పోస్టింగ్ ఇవ్వవచ్చా?
జవాబు : జి ఓ ఎం ఎస్ నెం. 180 పాఠశాల విద్య, తేదీ. 18.11. 2022 ప్రకారము సెలవు అనంతరం అదే పాఠశాలలో పోస్టింగ్ ఇవ్వవలసి ఉంటుంది.

ప్రశ్న: ఒక ఉద్యోగి 7 సం||లు ఆఫీస్ సబార్డినేట్గా పనిచేసి ల్యాబ్ అసిస్టెంట్గా పదోన్నతి పొందారు. అతనికి 12 సం॥ స్కేలు కొరకు ఆఫీస్ సబార్డినేట్ సర్వీస్ కూడా లెక్కించాలని కోరుతున్నారు. లెక్కించవచ్చునా?
జవాబు : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభి వృద్ధి శాఖ మెమో నెం. 1417876/Estt.IV/A1/2021, తేదీ. 06-10-2021 ప్రకారం ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీంకు ఆఫీస్ సబార్డినేట్ మరియు ల్యాబ్/ లైబ్రరీ అసిస్టెంట్ సర్వీసులను కలిపి లెక్కించకూడదు. పదోన్నతులకు మాత్రమే కలిపి లెక్కించాలి. రికార్డు అసిస్టెంట్ / రోనియో ఆపరేటర్ పోస్టులకు మాత్రం పదోన్నతులకైనా, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీంకైనా ఆఫీస్ సబార్డినేట్ సర్వీసు కలిపి లెక్కించవచ్చు.


ప్రశ్న : భర్త చనిపోయిన ఒక మహిళా ఉద్యోగి ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారు. ఆమెకు కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం ఇచ్చారు. ఆమె తిరిగి వివాహం చేసుకుంటే ఫ్యామిలీ పెన్షన్ వస్తుందా?
జవాబు : సదరు మహిళా ఉద్యోగికి మొదటి భర్త ద్వారా పిల్లలు ఉన్నారో లేదో మీరు తెలియజేయలేదు. పిల్లలు లేకపోతే ఆమెకు మరల వివాహం చేసుకున్నా ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. కానీ ఆమె కనీస పెన్షన్ కు సరిపడే ఆదాయం స్వంతంగా సంపాదించుకుంటే పెన్షన్ నిలిపివేస్తారు. ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే ఆమె పునర్వివాహం చేసుకున్న తదుపరి ఫ్యామిలీ పెన్షన్ నిలిపివేస్తారు. పిల్లలకు ఆ పెన్షన్ కొన్ని షరతులతో ఇస్తారు.

ప్రశ్న: పదోన్నతి ఉత్తర్వులలో కొందరికి ప్రమోషన్ అని, కొందరికి అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అని ఇవ్వటం గమనించాను. రెండింటికి తేడా తెలియజేయగలరు.
జవాబు :
ఒకే సర్వీస్ రూల్స్ పరిధిలో క్రింది పోస్ట్ నుండి పై పోస్టుకు పదోన్నతి పొందితే ప్రమోషన్ అని పేర్కొంటారు.

ఒక సర్వీస్ రూల్స్ పరిధిలోని క్రింది పోస్టు నుండి మరొక సర్వీస్ రూల్స్లోని పై పోస్టుకు పదోన్నతి పొందితే అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అని ఇస్తారు.

ఉదా|| సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయుని నుండి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి లభిస్తే (రెండు కూడా ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్) ప్రమోషన్ అని ఇస్తారు.

స్కూల్ అసిస్టెంట్ నుండి(ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్, సబార్డినేట్ సర్వీస్ రూల్స్) నుండి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి (ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్) పొందితే అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అని ఇస్తారు.