VVIT BALOTSAV 2023 Schedule, Events, Online Registration, Rules

VVIT BALOTSAV 2023 Schedule, Events, Online Registration, Rules. VVIT has released the Balotsav 2023 Notification open for All Students across the State. Cultural festival will be organized  by VVIT every with the Name Balotsav- 2023. The CSE has also issued Memo.No.ESE02-30/74/2023-A&I -CSE Date: 21/11/2023 informing all Schools to participate in this Cultural Event to he held from 11th Dec to 13th Dec in various Cultural Activities.

VVIT BALOTSAV 2023 Details, List of Events, Schedule of Events, How to Apply for Registration, Venue for Attending the Event is explained below.

    VVIT BALOTSAV 2023 Schedule, Events, Online Registration, Rules


    Memo.No.ESE02-30/74/2023-A&I -CSE Date: 21/11/2023
    Sub: School Education - Cultural festival will be organized VVIT Balotsav- 2023 - Request for wide publicity and encourage the schools for their active participation – Certain instructions issued - Reg

    Ref: Lr.dt: 18.11.2023 of the Principal of Vasireddy Venkatadri Institute Technology (VVIT).

    While enclosing herewith a copy of the reference cited along with its enclosures, all the District Educational Officers in the state are instructed to give wide publicity and to advise all schools to ensure participation in VVIT BALOTSAV-2023 held from 11th December to 13th December 2023 as requested in the above reference.

    The Brief details of the Letter to CSE by VVIT Balotsav Convenor

    It is my pleasure to inform you that we have resumed the great event of showcasing the talents of young school children of our state and from abroad through a prestigious cultural extravaganza - VVIT BALOTSAV-2023 held from 11th December to 13th December 2023. Dt:18-11-2023

    VVIT Balotsav is an international annual inter-school residential cultural festival for Telugu children, organized Vasireddy Venkatadri Institute of Technology (VVIT ), Nambur. VVIT is very much thankful to the Department of  School Education for the continuous support in successful conduction of Balotsav festivals since 2017. We are very much thankful for your consent extended for the current year also.

    Every year, a three-day festival featuring competitions in as many as 61 events ranging from classical and folk dances to on-the-spot drawing, quiz, elocution, street play, spell-bee, analysis, short film review, instrumental music and a wide array of exciting cultural and literary events. Almost ten thousand students from various states participated in the competitions organized for sub-juniors (Nursery to Class IV), juniors (Class V to VII) and seniors (Class VIII to X).

    In this connection, we are happy to provide free lodge and board facilities to the participants and their team leads. 

    We request you to kindly inform about the event among all the schools under your esteemed leadership. 

    We also request you encourage the Principals/Headmasters of various schools to depute a
    contingent of respective school children as per the guidelines enclosed and register their teams either online or by post/courier. We also request you please provide phone numbers and email-id of all schools to us, so that we can circulate all information about VVIT Balotsav.

    VVIT Balotsav 2023 Events List.

    There are total 20 Events in 61 Categories. The Detailed events list is given below.

    VVIT బాలోత్సవ్  2023 -20 అంశాలు 61 విభాగాలు

    పోటీలు నిర్దేశించిన వేదికలపై నిర్వహించబడును. ప్రతి విభాగంలోను ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు మరియు 2 ప్రత్యేక బహుమతులు ఇవ్వబడును. వి.వి.ఐ.టి. బాలోత్సవ్ -2023లో పాల్గొన్న ప్రతి పాఠశాలకు ప్రత్యేక ప్రశంసాపత్రం ఇవ్వబడును. పోటీలు నిర్వహించు శాస్త్ర మరియు సాంస్కృతికాంశాలు

    1. చిత్రలేఖనం (స్పాట్ డ్రాయింగ్ / డిజిటల్ స్పాట్ డ్రాయింగ్)
    2. వక్తృత్వం (ఇంగ్లీషు - తెలుగు)
    3. తెలుగు పద్యం
    4. సంస్కృత శ్లోకం
    5. శాస్త్రీయ సంగీతం
    6. శాస్త్రీయ నృత్యం (కూచిపూడి/భరతనాట్యం) (సోలో/గ్రూపు)
    7. తెలుగులోనే మాట్లాడుదాం
    8. వేషధారణ (సంప్రదాయ / విచిత్ర)
    9. రచన (కవిత, కథ, లేఖ)
    10. అభినయం (ఏకపాత్రాభినయం / మూకాభినయం)
    11. జనరల్ క్విజ్
    12. విశ్లేషణ (కథావిశ్లేషణ, లఘుచిత్ర విశ్లేషణ) 13. మట్టితో బొమ్మలు చేద్దాం.
    14. నాటికలు
    15. స్పెల్ బీ (Spell Bee)
    16. వాద్య సంగీతం (రాగ, తాళ ప్రధానం)
    17. జానపద నృత్యం (సోలో/గ్రూపు)
    18. కథ చెబుతా, వింటారా ?
    19. లలిత / జానపద గీతాలు
    20. శాస్త్ర సాంకేతిక అంశం (ప్రయోగశాల, ప్రదర్శనశాల)



    VVIT Balotsav 2023 Events List


    VVIT Balotsav 2023 Category of Classes

    పోటీలకు ప్రవేశ రుసుము లేదు.
    ఇతర జిల్లాలు - రాష్ట్రాల నుండి వచ్చువారికి ఉచిత వసతి మరియు భోజన సౌకర్యం కలదు.

    అర్హత విభాగము : 
    • సబ్ జూనియర్స్ - నర్సరీ నుండి 4వ తరగతి వరకు
    • జూనియర్స్ - 5వ తరగతి నుండి 7వ తరగతి వరకు 
    • సీనియర్స్ - 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు
    • Nursery to 4th Class considered as Sub Juniors Category
    • 5th to 7th Class will be considered as Juniors Category
    • 8th to 10th Class will be considered as Seniors Category

    VVIT Balotsav 2023 Rules

    నియమనిబంధనలు :

    1. ప్రపంచంలో ఏదేశంలో నివసిస్తున్న తెలుగు విద్యార్థులు వివిఐటి బాలోత్సవ్ - 2023 పోటీలలో పాల్గొనుటకు అర్హులు.

    2. ప్రతి విద్యార్థి తాము చదువుచున్న పాఠశాల నుండి గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. స్కూల్ యూనిఫారంలో పోటీలలో పాల్గొనరాదు. 

    3. పోటీలలో పాల్గొను వారు న్యాయనిర్ణేతలకు తమ పేరు, పాఠశాల పేరు చెప్పరాదు.

    4. వ్యక్తిగత అంశాల పోటీలకు ప్రత్యేకంగా "కోడ్ నెంబర్లు" ఇవ్వబడును.

    5. పోటీదారులు తాము పాల్గొనే అంశాలను ధ్రువీకరిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుండి అనుమతి పొందిన పత్రం జతపరచాలి.

    6. పోటీలకు కేటాయించిన కాలపరిమితిలోనే అంశాలను పూర్తిచేయాలి. అదనపు సమయం తీసుకున్నచో అనర్హతగా భావించబడుతుంది.

    7. ఒక విద్యార్థి ఒకే సమయంలో రెండు మూడు పోటీలలో పాల్గొనరాదు. ఒకే రోజు వేరువేరు సమయాలలో జరిగే పోటీలలో పాల్గొనవచ్చు.

    8. జానపద నృత్యాలు ప్రదర్శించేవారు వైవిధ్యభరితమైనవి, అశ్లీలత లేనివాటిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అశ్లీల నృత్యప్రదర్శనలను నిషేధించే అధికారం న్యాయనిర్ణేతలకు ఉంది.

    9. వ్యక్తిగత అంశాల పోటీలకు ప్రత్యేకంగా "కోడ్ నెంబర్లు" 11-12-2023 ఉదయం గం|| 8.30 ని॥ నుండి ఆయా ప్రత్యేక కౌంటర్లలో యివ్వబడతాయి. 

    10. విజేతల ఎంపికలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఎటువంటి వాదోపవాదములకు తావులేదు. ఏ రోజు పోటీల విజేతల వివరాలు ఆరోజే ప్రకటించబడును. 

    11. కార్యక్రమము సజావుగా జరుగుటకు అప్పటికప్పుడు కొత్త నియమనిబంధనలను ఏర్పరిచే అధికారం న్యాయనిర్ణేతలకు కలదు. వాటిని పోటీదారులు అంగీకరించవలెను. సమయానుకూలంగా కార్యక్రమాలలో మార్పులు, చేర్పులు చేయుటకు మరియు రద్దుచేయుటకునిర్వాహకులకుఅధికారం కలదు. 

    12. రిజిస్ట్రేషన్ కొరకు www.balotsav.in/registration వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న ఎంట్రీ ఫారాలను పూర్తిచేసి పోస్టు ద్వారా పంపవచ్చు, లేదా అదే వెబ్సైట్లో గూగుల్ ఫారం (https://forms.gle/66Zy5HwvdwErYpYn8) పూర్తి చేసి సబ్మిట్ (submit) మీట నొక్కటం ద్వారా అప్లోడ్ చేయవచ్చు. Click Here for Online Form

    13. పూర్తి చేసిన తమ విద్యార్థుల ఎంట్రీఫారంలను పాఠశాలల యాజమాన్యాలు 02-12-2023 లోపు చేరేలా మాకు పంపాలి.

    14. స్పాట్ ఎంట్రీలు అనుమతించబడవు.

    15. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సహాయ సహకారాలతో విద్యార్థులకు అవసరమైన శాస్త్ర సాంకేతిక విషయాల పై ఉపాధ్యాయులకు కార్యశాల నిర్వహించబడును. కార్యశాలలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సర్టిఫికెట్, పాఠశాలకు ఉపయోగకరమైన సైన్స్ కిట్ అందించబడును.

    Day Wise List of Activities in Balotsav 2023





    VVIT Balotsav 2023 Registration Process

    Online:
    రిజిస్ట్రేషన్ కొరకు www.balotsav.in/registration వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న ఎంట్రీ ఫారాలను పూర్తిచేసి పోస్టు ద్వారా పంపవచ్చు, లేదా అదే వెబ్సైట్లో గూగుల్ ఫారం (https://forms.gle/66Zy5HwvdwErYpYn8) పూర్తి చేసి సబ్మిట్ (submit) మీట నొక్కటం ద్వారా అప్లోడ్ చేయవచ్చు. 

    Offline ద్వార
    ఎంట్రీ ఫారం డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ లింకు క్లిక్ చేయండి.
    డౌన్లోడ్ చేసుకున్న ఎంట్రీ ఫారంను ప్రింట్ తీసుకొని పూర్తి చేయండి. 
    పూర్తి చేసిన ఎంట్రీ ఫారంలను ను క్రింద అడ్రసుకు 02-12-2023 లోపు చేరేలా మాకు పంపండి.

    అడ్రసు:
    కన్వీనర్, వీవీఐటీ బాలోత్సవ్ - 2023, వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్ స్టీట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
    నంబూరు గ్రామం, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా - 522 508. 

    Never Miss any Update: Join Our Free Alerts:

    VVIT Balotsav 2023 Support and Contact Address:


    ఆహ్వానించువారు: వాసిరెడ్డి విద్యాసాగర్, ఛైర్మన్, వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నంబూరు, గుంటూరు.

    ఎంట్రీలను పంపవలసిన చిరునామా: 
    కన్వీనర్, బాలోత్సవ్-2023,
    వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, (VVIT), 
    నంబూరు గ్రామం, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా-522508. 
    వివరాలకు : :73862 25336, 
    www.balotsav.in email : witbalotsav@gmail.com