జిల్లా విద్యాశాఖాధికారి విశాఖపట్నం వారి కార్యాలయము ఇందు మూలముగా విశాఖపట్నం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ తెలుగు, లాంగ్వేజ్ పండిట్ తెలుగు మరియు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా గౌరవ ఎ.పి.ట్రిబ్యునల్ వారి ఆదేశములు మరియు కమీషనర్ వారి ఉత్తర్వుల మేరకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు పదోన్నతికి సంబంధించిన సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖాధికారి వారి వెబ్ సైట్ (deovsp.net) నందు పొందుపరచడమైనది. సదరు సీనియారిటీ జాబితాలో ఏమైనా అభ్యంతరములున్నచో పూర్తి ఆధారములతో అప్పీళ్లను కార్యాలయపు పనివేళలలో తేది 03.05.2019 లోగా సమర్పించవలసినదిగా కోరడమైనది. నిర్ణీత గడువులోగా సమర్పించని అప్పీళ్ళు పరిశీలింపబడవని జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీ బి.లింగేశ్వర రెడ్డి గారు తెలియజేసినారు.
SA Telugu Seniority List SA Telugu Promotions Visakhapatnam
సీనియారిటీ జాబితాలో ఏమైనా అభ్యంతరములున్నచో పూర్తి ఆధారములతో అప్పీళ్లను కార్యాలయపు పనివేళలలో తేది 03.05.2019 లోగా సమర్పించవలసినదిగా కోరడమైనది. నిర్ణీత గడువులోగా సమర్పించని అప్పీళ్ళు పరిశీలింపబడవని జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీ బి.లింగేశ్వర రెడ్డి గారు తెలియజేసినారు.