AP Schools Reopen from Nov 2nd Detailed Class Wise Schedule
కరోనా వైరస్ కారణంగా మూతపడ్డ పాఠశాలలు, కాలేజీలు నవంబర్ 2 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు.ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ వ్యాపించకుండా అన్నరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వివరించారు.
నవంబర్ 2 నుంచి 9,10,11/ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ,12 / ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు. నవంబర్ 2 నుంచి ఈ తరగతులు హాఫ్‌డే మాత్రం నిర్వహిస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్ 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్ పద్ధతిలో హయ్యర్ ఎడ్యుకేషన్ తరగతులను నిర్వహిస్తారు.
నవంబర్ 23 నుంచి 6,7,8 క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, 6,7,8 క్లాసులకు హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.
డిసెంబర్ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.