Ministry of Housing and Urban Affairs has prepared Draft Model Tenancy Act (MTA), 2020. A background Note and Draft MTA Act, 2020 are put up here in English, Hindi and various regional languages and for perusal of the public.
Draft Model Tenancy Act Gets Cabinet Approval The union cabinet, on June 2, 2021, approved the Model Tenancy Act. The draft law, which is expected to revolutionise the rental real estate market in India, was approved in a cabinet meeting chaired by prime minister Narendra Modi. The approved law will now be circulated to states and union territories, for adaptation by way of enacting fresh legislation or amending existing rental laws suitably.
నమూనా అద్దె చట్టం లోని ముఖ్యాంశాలు
అద్దె ఒప్పందంలో అంగీకరించబడినట్లుగా, పార్ట్ A కింద వచ్చే విషయాలకు సంబంధించిన మరమ్మతులకు యజమాని బాధ్యత వహించాలి మరియు పార్ట్ B కింద వచ్చే విషయాలకు అద్దెదారు బాధ్యత వహించాలి
పార్ట్ A యజమాని యొక్క బాధ్యతలు
Draft Model Tenancy Act Gets Cabinet Approval The union cabinet, on June 2, 2021, approved the Model Tenancy Act. The draft law, which is expected to revolutionise the rental real estate market in India, was approved in a cabinet meeting chaired by prime minister Narendra Modi. The approved law will now be circulated to states and union territories, for adaptation by way of enacting fresh legislation or amending existing rental laws suitably.
Tenancy Act 2020 (Model Tenancy Act MTA 2020) - Detailed Rules for Tenants and Owners
- లిఖితపూర్వక ఒప్పందం లేకుండా ఇళ్లు, వ్యాపార సముదాయాలను అద్దెకివ్వడానికి వీల్లేదు.
- అద్దెదారులు చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్‌పై పరిమితి ఉంటుంది. నివాస గృహసముదాయం అయితే గరిష్ఠంగా రెండు నెలల అద్దె, నివాసేతర సముదాయం అయితే గరిష్ఠంగా ఆరు నెలల అద్దెను అడ్వాన్సుగా తీసుకోవాలి..
- అద్దె ఎంత ఉండాలి? ఎంతకాలం పాటు అద్దెకు తీసుకోవాలనేదానిపై పరిమితులు ఏమీ లేవు. అద్దెదారు, యజమాని పరస్పర అవగాహనతో ఒప్పందం చేసుకోవచ్చు. దీనివల్ల యజమానులకు భరోసా వస్తుంది..
- అద్దె ఒప్పందంలో ఏర్పాటుచేసుకున్న నిబంధనలను అనుసరించి.. యజమాని తన ఇంటిని ఖాళీ చేయాలని అద్దెదారుకి ముందస్తు నోటీసు ఇవ్వాలి. ఒప్పంద గడువు ముగిసిన తర్వాత, కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న తర్వాత కూడా కిరాయిదారు ఖాళీ చేయకపోతే తొలి రెండు నెలలు రెట్టింపు అద్దె, ఆ తర్వాత నాలుగు రెట్ల అద్దె వసూలు చేయడానికి యజమానికి అధికారం దక్కుతుంది..
- యజమాని/ఆస్తి నిర్వాహకుడు తాను అద్దెకిచ్చిన ప్రాంగణంలోకి 24 గంటల ముందస్తు నోటీసు ఇచ్చి ప్రవేశించవచ్చు. నోటీసు లిఖితపూర్వకంగాకానీ, ఎలక్ట్రానిక్ మోడ్‌లోగానీ పంపవచ్చు..
- ‘రెంట్ అథారిటీ’ ఏర్పాటవుతుంది. జిల్లా స్థాయిలోనూ ఇలాంటివి ఉంటాయి. అద్దెలను నియంత్రించడం ద్వారా యజమానులు, అద్దెదారుల ప్రయోజనాలను రక్షించడానికి వీలవుతుంది. ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదాలను వేగంగా పరిష్కరించే యంత్రాంగం అమల్లోకి వస్తుంది..
- వివాదాల పరిష్కారం కోసం రెంట్ ట్రైబ్యునళ్లు, రెంట్ కోర్టులు ఏర్పాటు చేయొచ్చు. వాటిలో వివాదాలను వేగవంతంగా పరిష్కరిస్తారు..
- ఈ చట్టం పరిధిలోకి నివాస, వాణిజ్య, విద్యా సంబంధ అద్దె విషయాలు వస్తాయి. పారిశ్రామిక అవసరాల కోసం ఇచ్చే అద్దెలు రావు. హోటళ్లు, లాడ్జీలకూ మినహాయింపు ఉంది..
- అద్దెను యజమాని ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పెంచొచ్చు. లేదంటే మూడు నెలల ముందస్తు నోటీసు ఇచ్చిన తర్వాతే పెంచాల్సి ఉంటుంది..
- పట్టణ, గ్రామీణ ప్రాంతాలు.. రెండింటికీ చట్టం వర్తిస్తుంది..
- యజమాని నుంచి లిఖితపూర్వక సమ్మతి లేకుండానే అద్దెకున్న భవనంలో నిర్మాణాత్మక మార్పులు చేయడానికి వీల్లేదు..
- అద్దెదారుల వల్ల ఏవైనా వస్తువులు పాడయితే వారే భరించాలి. ఇవి కాకుండా భవనానికి సంబంధించిన మరమ్మతులు, సున్నాలు, రంగులు వేయడం, పైపులు మార్చడం, విద్యుత్తు వైర్ల మరమ్మతులు... తదితరాలు అన్నింటినీ యజమానే చూసుకోవాలి..
- నూతన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త అద్దెదారులు లిఖితపూర్వక ఒప్పందం చేసుకొని, ఆ పత్రాన్ని రెంట్ అథారిటీకి సమర్పించాలి..
- ఒప్పంద పత్రాలు సమర్పించడానికి స్థానిక భాషల్లో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఏర్పాటుచేస్తారు..
- భూస్వామి, అద్దెదారు ప్రయోజనాల మధ్య సమతౌల్యం ఉంటుంది..
- యజమాని, అద్దెదారు పాత్రలకు స్పష్టమైన నిర్వచనం ఇవ్వడంవల్ల అనవసర వివాదాలు తప్పుతాయి..
- భూస్వామి ముందస్తు అనుమతితోనే ప్రాంగణాలను ఉప కిరాయి (సబ్ లెటింగ్)కి ఇవ్వాల్సి ఉంటుంది..
- మురికికాలువల పరిశుభ్రత, వంటగదిలోని స్విచ్చులు ఇతరత్రా మార్పులు, కిటికీలకు ఉండే అద్దాలు, లాన్ల పెంపకం వంటి పనులకు అద్దెదారునిదే బాధ్యత..
- భవనంపై అదనపు నిర్మాణం చేపట్టడానికి అద్దెదారుడు అభ్యంతరం తెలిపితే దానిపై రెంట్ కోర్టుకు ఫిర్యాదు చేసే హక్కు యజమానికి ఉంది..
- వివాదం కోర్టులో ఉన్నప్పటికీ అద్దెదారు భూస్వామికి అద్దె చెల్లిస్తూ ఉండాల్సిందే..
- ఒప్పంద సమయంలోపు అద్దెదారును ఖాళీచేయించడానికి వీల్లేదు. ఈ చట్టంలోని నిబంధనలు అనుమతిస్తే తప్ప అందుకు మినహాయింఉండాల్సిందే.
- భవన ప్రాంతానికి సంబంధించిన ఎలాంటి అత్యవసర సరఫరాలను కూడా అద్దెదారులకు నిరాకరించడానికి వీల్లేదు..
- ఒకవేళ ఒప్పందాలను అమలు చేయలేని పరిస్థితి.. ‘దైవ ఘటన’ (ఫోర్స్ మజురె) ఎదురయినప్పుడు ఆ విపత్తుకర పరిస్థితి తొలగిపోయిన నెలరోజుల వరకు అద్దెదారు ఆ ప్రాంగణంలో ఉండటానికి అవకాశం ఇవ్వాలి..
- రెంట్ కోర్టు, రెంట్ ట్రైబ్యునళ్లు 60 రోజుల్లోపు ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంటుంది..
- ఈ వివాదాల్లో సివిల్ కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు..
- ఈ చట్టం భవిష్యత్తు తేదీల నుంచి వర్తిస్తుంది తప్పితే ఇప్పటికే ఉన్న వారికి వర్తించదు. రెంట్ ట్రైబ్యునళ్లకు జిల్లా జడ్జి, అదనపు జిల్లా జడ్జి స్థాయి అధికారులు ఉంటారు. హైకోర్టుతో సంప్రదించిన మీదట రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని నియమిస్తాయి..
యజమాని మరియు అద్దెదారుల మధ్య నిర్వహణ బాధ్యత యొక్క విభజన
పార్ట్ A యజమాని యొక్క బాధ్యతలు
1. అద్దెదారు వల్ల నష్టం కలిగిన తప్పనిసరి మరమ్మత్తులు
2. గోడల వైట్ వాషింగ్ మరియు తలుపులు మరియు కిటికీల పెయింటింగ్.
3. అవసరమైనప్పుడు పైపులను మార్చడం మరియు ప్లంబింగ్ చేయడం.
4. అవసరమైనప్పుడు అంతర్గత మరియు బాహ్య విద్యుత్ వైరింగ్ మరియు సంబంధిత నిర్వహణ
పార్ట్ B అద్దెదారు చేత చేయవలసిన ఆవర్తన మరమ్మతులు
పార్ట్ B అద్దెదారు చేత చేయవలసిన ఆవర్తన మరమ్మతులు
1. ట్యాప్, దుస్తులను ఉతికే యంత్రాలు మరియు కుళాయిల మార్పు
2. డ్రెయిన్ క్లీనింగ్
3. నీటి గది మరమ్మతులు
4. బేసిన్ మరమ్మతులు
5. బాత్ టబ్ మరమ్మతులు
6. గీజర్ మరమ్మతులు
7. సర్క్యూట్ బ్రేకర్ మరమ్మతులు
8. స్విట్లు మరియు సాకెట్ మరమ్మతులు
9. ప్రధాన అంతర్గత మరియు బాహ్య వైరింగ్ మార్పులు మినహా విద్యుత్ పరికరాల మరమ్మతులు మరియు భర్తీ
10. కిచెన్ ఫిక్చర్స్ మరమ్మతులు
11. తలుపులు అలమారాలు, కిటికీలు మొదలైన గుబ్బలు మరియు తాళాల భర్తీ.
11. తలుపులు అలమారాలు, కిటికీలు మొదలైన గుబ్బలు మరియు తాళాల భర్తీ.
12. ఫై నెట్స్ భర్తీ
13. కిటికీలు, తలుపులు మొదలైన వాటిలో గాజు ఫలకాలను మార్చడం.
14. అద్దెదారు చే వాడబడిన మరియు ఉపయోగించబడింది తోటలు మరియు బహిరంగ ప్రదేశాల నిర్వహణ .