నాడు-నేడు వెబక్స్ సమీక్షా సమావేశంలోని ముఖ్యాంశాలు 18-05-2022

*నేటి నాడు-నేడు వెబక్స్ సమీక్షా సమావేశంలోని ముఖ్యాంశాలు*
తేది : 18-05-2022
నిర్వహణ : ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ

https://t.me/APTEACHERS
👉 నాడు-నేడు రెండవ దశ లో పాఠశాలల సంఖ్య పెంచబడును

👉 సిమ్మెంట్ త్వరలో సరఫరా చేయబడును

👉 రివాల్వింగ్ ఫండ్ ప్రతిపాదనలు తక్షణమే పంపవలె.

👉 రివాల్వింగ్ ఫండ్ జమైన పాఠశాలలన్నీ తక్షణమే కావలసిన నిర్మాణ సామగ్రి కొనుగోలు చేసి ఎక్సపండీచర్ అప్లోడ్ చేయాలి. అనకాపల్లి జిల్లా ఎక్సపండీచర్ లో చాలా వెనుకబడుంది.

👉 ఇనుము కొనుగోలు ప్రారంభించాలి

👉 ప్రస్తుతానికి సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరూ యుద్ధప్రాతిపదికన ఇసుక ఇండెంట్లు రైజ్ చేయవలె.

👉 స్థలం వున్న ఉన్నత పాఠశాలలు లేదా ఇతర పాఠశాలల్లో ఇసుక డంపె చేయబడును అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల్లో ఇతర పాఠశాలల వారు ఇసుక తీసుకు వెళ్ళాలి. సదరు ఖర్చులను నాడు-నేడు నిధుల నుంచి తీసుకోవచ్చు

👉 ఇసుక డెలవరీ మరియు పాఠశాలలకు పంపిణీ ప్రక్రియ బాధ్యత సీఆర్పీలు చూడవలె

👉 ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధానోపాధ్యాయులు సెలవలని మరియు ఇతర కారణాల వలన ఇసుక సరఫరాను నిరాకరించరాదు.

👉 వేసవి సెలవల్లో నాడు-నేడు పనులు నిర్వహించు ప్రధానోపాధ్యాయులకు ఆర్జిత సెలవు మంజూరు చేయబడును.

👉 పాఠశాల ఒకటైనా అదనపు తరగతి గదులకు, నాడు-నేడు కాంపోనెంట్స్ కు మరియు కాంపౌండ్ వాల్స్ కు వేర్వేరుగా ప్రోజెక్టులు చూపబడును

👉 OPC (ordinary portland cement) మరియు PPC(Portland Pozzolana Cement) అను రెండురకాల సిమ్మెంట్లను నిర్మాణాలకు వాడవలె, ఆ ప్రాప్తికి సిమ్మెంట్ సరఫరా జరుగును. ఏ సిమ్మెంట్ దేనికి వినియోగించాలో ఇంజినీర్లు తెలుపుదురు.
👉 3,4&5 తరగతులు సమీప ఉన్నత పాఠశాలలో విలీనమైన, అక్కడ కావలసిన గదులు వున్న సందర్భంలో సదరు తరగతి గదులను ప్రీప్రైమరీ తరగతులకు వినియోగించవలె.

👉 ఇక మీదట రాష్ట్రంలో ఫౌండేషన్ పాఠశాలలు(PP 1&2 and I&II) మరియు సెకండరీ స్కూల్స్ (III to XII) మాత్రమే వుంటాయని తెలియజేసారు.

👉 జిల్లా కలెక్టర్లు 3,4&5 తరగతులు వీలీనమవుతున్న ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదుల అవసరాన్ని గుర్తించి ఏ పాఠశాలలకు అదనపు తరగతి గదుల కేటాయించాలో ఖచ్చితమైన సమాచారాన్ని సమర్పించాలని తెలియజేసారు.

👉 ఉపాధ్యాయుల బదిలీలు మరియు పునః కేటాయింపులు జూన్ 2022 లో నిర్వహించబడును.

👉 ఏ పాఠశాలలోనైనా నాడు-నేడు నిర్మాణ పనులు కాంట్రాక్టర్లచే నిర్వహించబడుచున్నాయని తెలిసిందో సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుని మీద మరియు సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పైన తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోబడును.

👉 వారం వారం నాడు-నేడు పిసి సమావేశాలు నిర్వహించి అవసరమైన తీర్మానాలు చేయడం అయిపోయిన పనులకు చెక్కులపై సంతకాలు చేసి చెల్లింపులు చేయడం మొదలగు కార్యక్రమాలు నిర్వహించాలి.

👉 అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు మరియు ఎపిసిలు నాడు-నేడు తో పాటు SMF మరియు TMF నిర్వహణలను కూడా పరిశీలించాలి.

👉 2022-23 విద్యా సంవత్సరంలో అమ్మ ఒడి సొమ్ముల నుంచి ప్రతీ తల్లి వద్ద రెండువేలు మినహాయించి 13 వేలు ఇచ్చి మినహాయించిన రెండువేలు టాయిలెట్స్ నిర్వహణ కు వినియోగించడం జరుగుతుంది.

👉 పిసిలు లేని పాఠశాలలకు నాడు-నేడు పనులు కేటాయించబడవు. కాబట్టి పిసి ఎన్నికలు జరగని పాఠశాలలకు మరొక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. తేది తెలుపబడును.


ఇట్లు,
జిల్లా విద్యాశాఖ అధికారి,
అనకాపల్లి.